Thursday, March 2, 2023

శత శ్లోకేన పండితాః

 

  1. Shloka 1/100     చాణక్య నీతి 

శత నిష్కో ధనాధ్యశ్చ శత గ్రామేణ భూపతి

శతాశ్వ క్షత్రియో రాజా   శత శ్లోకేన  పండితాః 

100 నిష్కలు ఉన్నవాడు - ధనవంతుడు. 100 గ్రామాలు ఒకరి క్రింద  ఉంటే, ఆయన ని భూపతి అని అంటారు. ఒకరి దగ్గర అ 100 గుర్రాలు ఉంటే, వారిని రాజు అంటారు. అలాగే వంద శ్లోకాలు తెలిసిన వారిని పండితుడు అంటారు.

 2. చాణక్య నీతి

శతం విహాయ భోక్తవ్యం  సహస్రం స్నాన మాచ రేత్ !

         లక్షం విహాయ దాతవ్యం  కోటిం త్యక్త్వా హరిం భజేత్ !!

వంద పనులు  విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి పనులు  విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని లేదా కోటి పనులు విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించాలి. 


3. Mahabharath 5.35.78 Udyoga Prava 

        దివసేనైవ తత్కుర్యాద్ యేన రాత్రౌ సుఖం వసేత్।

        అష్టమాసేన తత్కుర్యాద్  యేన వర్షాః సుఖం వసేత్॥

        పూర్వే వయసి తత్కుర్యాద్ యేన వృద్ధః సుఖం వసేత్।

        యావజ్జీవం తు తత్కుర్యాద్ యేన ప్రేత్య సుఖం వసేత్ ॥


పగలు అంతా కష్టపడి జాగ్రత్త చేసుకున్న వాడికి, రాత్రి సుఖంగా నిద్రపడుతుంది. ఒక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది మాసాలు  కష్టపడి, జాగ్రత్త తీసుకున్న వారికి, వర్షాకాలము నాలుగు మాసాలు సుఖంగా ఉంటుంది. యవ్వనంలో ఉన్నప్పుడు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బలంగానూ ధైర్యంగా తెలివిగాను ఉన్నవారికి, వృద్ధ వయసు సుఖంగా ఉంటుంది. అలాగే జీవితం మొత్తం తెలివిగా తగిన పనులు చేస్తూ జాగ్రత్తగా ఉన్నవారికి మరణం సుఖంగా ఉంటుంది.

అంటే జీవితం మొత్తం దైవం గురించి తెలుసుకుంటూ, హరి నామస్మరణ చేసిన వారికి మరణమే ఉండదు అంటే జనన మరణ చక్రాలు ఉండవు అని అర్థం


5. *చాణక్య నీతి*  

విద్వత్వంచ నృపత్వంచ    నైవ తుల్యం కదాచన|

స్వదేశే పూజ్యతే రాజా  విద్వాన్ సర్వత్ర పూజ్యతే ||

 పండితుడు మరియు రాజు ఇద్దరూ  సమానము కాదు.  ఎందుకంటే రాజు-  కేవలము ఆయన దేశంలోనే  లేదా అని రాజ్యంలోనే గౌరవింప బడతాడు. కానీ పండితుడు ఆయన విద్య, పాండిత్యము చేత సర్వత్ర , అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పూజింపబడుతాడు. 

 


Cvv

 [04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 సృష్టి నిర్మాణానికి పెట్టుబడి సత్యము. దాని అల్లిక అంతా ధర్మముప...