Saturday, August 27, 2022

నాసదీయ సూక్తము - ఋగ్వేదము The Beginning of Universe

 *🧘‍♂️నాసదీయ సూక్తం🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


(ఋగ్వేదం – మండలం10)


The Beginning of Universe


It was not clear to science even today what is the beginning of this Universe. Veda ( Rigveda expressed the nature of the beginning, its structure and character thousands of years ago) expression on the beginning is still appealing for today’s science or fiction. 


Nasadiya Sukta of Rig Veda is about Big Bang theory and creation of Cosmos.


*నాసదీయ సూక్తము - ఋగ్వేదము*


నాసదా సీన్నో సదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరో యత్ |

కిమావరీవ కుహ కస్య శర్మన్నమ్భ కిమాసీద్గహనం గభీరమ్ ||



న మృత్యురాసీదమృతం న తర్హినరాత్ర్యా అహ్న ఆసీత్ప్రకేతః |

ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్న పరః కిం చనాస ||



తమ ఆసీత్తమసా గూళ్హమగ్రే౭ప్రకేతం సలిలం సర్వమా ఇదమ్ |

తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్తపసస్తన్మహినాజాతైకమ్ ||



కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేత ప్రథమం యదాసీత్ |

సతో బన్ధుమసతి నిరవిన్దన్హృది ప్రతీష్యా కవయో మనీషా ||



తిరశ్చీనో వితతో రశ్మిరేషామధః స్విదాసీ  దుపరి స్వీదాసీ  త్ |

రేతోధా ఆసన్మహిమాన ఆసన్స్వధా అవస్తాత్ప్రయతిః పరస్తాత్ ||



కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్కుత ఆజాతా కుత ఇయం విసృష్టిః |

అర్వాగ్దేవా అస్య విసర్జసేనాథా కో వేద యత ఆబభూవ ||



ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న |

యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్సో అంగ వేద యది వా న వేద ||


ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 


🕉️🌞🌏🌙🌟🚩


(An expression of energy as matter)


నాసాదాసీనో సదాసీత్ తదానీం నాసీద్రజో నొవ్యోమా పరో యత్కిమావారీవాహ కుహకస్య శర్మాన్భః కిమాసీత్ గహనం గభీరం – 1


1.సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?


ముందు సత్తుగానీ అసత్తు గానీ లేదు . భూమి గానీ ఆకాశం గానీ లేదు. అగాధమైన, గంభీరమైన వెల్లువ తో ఆవరించిన అనుభవం వుంది.


నమృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత హ అనీదవాతం స్వధయా తదేకం తస్మాధ్యాన్నన్న పరః కించనాస – 2


2.మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. అన్నిటికి అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేనీ మీద ఆధారపడిలేదు. ఆ బ్రహ్మం తప్ప వెరొకటిలేదు.


అప్పుడు మృత్యువు, అమృతము , రాత్రిమ్బవళ్ళు లేవు . శ్వాస లేని ఆ ఒక్కటి ఉన్నది . స్వయంగా అది తరువాత శ్వాసించింది. 


వ్యాఖ్య – మనిషి తన శరీరమునుండి విశ్వకేంద్రం దాక శోధించి రెండూ ఒకటేనని అంతర్ద్రుష్టితో వ్యక్తిత్వాన్ని విస్తరించడం యోగం . దాన్ని తెలిపే జ్ఞానమే వేదం . మహర్షులు శాశ్వత తత్వాన్నీ కనుగొనడానికి చేసిన ప్రయత్నం ఇది.


దీనికి సమతుల్యత భావం , దాన్ని సాధించడానికి నిరంతరం ఇంద్రియ నిరోధం, మానసిక సంయమనం చేయాలని అర్థం చేసుకుని, ఆచరించి చెప్పిన మాటలే వేదం . ఈ క్రమంలో శరీరం ప్రకృతితో మమేకమై జీవించడం భోగం. ప్రకృతితో మమేకమై భోగించకుండ ఉండటం యోగం. అదే నిష్కామ కర్మయోగం. ఈ యోగంలో అశాశ్వతమైన శరీరం నుండి శాశ్వత తత్వమైన మనస్సుకు, బుద్ధికి , శక్తికి ఆవల, ఆదిలో వున్న ఏక తత్వం అనుభవానికి వస్తుంది . ముందు ఉన్నది అదే చివర చేరాల్సింది అదే.


తేడా మాత్రం చైతన్య రహితమైన ఆది నుండి చైతన్య సహితమైన ఆది లోనికి ప్రవేశించడమే జీవిత పరమార్థం .


ఈ గమనంలో చుట్టూ ఆ చైతన్యాన్ని ఆవరించి ఉన్న శరీరాన్ని , కుటుంబాన్ని , సమాజాన్ని , ప్రపంచాన్ని, ప్రకృతిని , విశ్వాన్ని మనతోపాటు తీసుకుపోయే ప్రయత్నం గానీ లేదా ఆ విషయం చెప్పే ప్రయత్నం గానీ చెయ్యడం సాంఘిక ధర్మం . అది చేయకపోతేె మనలోని ఛైతన్యం చుట్టూ ఉన్న ఆవరణతో సమతుల్యంగా , సంయమనంగా ఉండలేదు .


విడిగా దూరంగా ఉండాలనుకుంటే ఏ బంధము లేకుండా జీవితం గడపాలి. ఇతరులతో బంధం తగిలించుకొని పాటించకపోతే కర్మబంధమై తిరిగి కర్మకు కారణమౌతుంది . అందుకే వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి చివరికి సన్యాసంతో ముక్తుడు కావాలని చెప్పారు. 


విశ్వ కేంద్రంగా ఉంటూ నిమిత్తమాత్రంగా ఉండడం శివ తత్వం . నిమిత్త మాత్రంగా ఉంటూ ప్రకృతితో ప్రకృతిలో సంయమనంగా ఉంటూ సమతుల్యతా క్రియ చేయడం విష్ణు తత్వం . ఆది అంతము శివ తత్వమైతే మధ్య ఉన్న క్రియాశీలమైన  చైతన్యమే విష్ణు తత్వం. 


చైతన్యం విడిగా ఉన్నంతవరకు విష్ణు తత్వం అవసరం అవుతుంది . చైతన్యం శివశక్తి లేక స్థితి శక్తిలోనికి ఐక్యం కాగానే నిశ్చలమైన శివ తత్వమై ప్రకాశిస్తుంది . జీవిలో చైతన్యం ఉన్నంతవరకు విష్ణు తత్వంగ ఉండక. తప్పదు.


శరీర బంధం ఉన్నంతవరకు కర్మ బంధం తప్పదు. జీవన్ముక్తుడు కావాలంటే శరీర బంధం నుండి జీవుని విడదీయాలి . వారికీ ఎటువంటి పాప పుణ్యాలు అంటవు


జీవుడు చైతన్యం , బుద్ధి, మనస్సు , ప్రాణం ద్వారా శరీరానికి అరిషడ్వార్గాలతో బంధించబడి ఉంటాడు . తిరిగి అదే క్రమంలో వాటిని విడదీసి జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది . 



అరిషడ్వార్గాలను క్రమబద్ధమైన , ధర్మబద్ధమైన జీవితంతోనూ, ప్రాణాన్ని ప్రాణాయామంతోను , బుద్ధిని  ధారణతోను , మనస్సును ధ్యానంతో , చైతన్యాన్ని సమాధితోను నిలువరించాలి. 


సంకల్పం జీవునితో మొదలై చైతన్యాన్ని ప్రేరేపించి  , భావంగ మారి , ప్రేరణగా మారి , ఆలోచనగా రూపుదిద్దుకుని, భాషగా , క్రియగ మారి మనకు కావలసిన మార్పుగా రూపాంతరం చెందుతుంది.



తమ ఆసీత్ తమసా గూఢమాగ్రి ప్రకేతం సలిలమ్ సర్వమా ఇదంతుచ్యేనాభ్వాపిహితం యదాసీత్ తపసత్ తన్మహినాజాయతైకం – 3


3.అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం (బ్రహ్మ పదార్ధం) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.)


ముందు యావత్తూ అంధకారంతో ఆవరించబడి గుర్తుపట్టలేని వెల్లువగా సమస్తాన్ని ఇముడ్చుకొని ఒక్కటే ఏదయితే ఉందొ అదే అభివ్యక్తమౌతున్నది.



అప్పుడు ఉన్నది స్త్రీ కాదు పురుషుడు కాదు . ఆ ఒక్కటీ అనిర్వచనీయమైనది . విశ్వం యొక్క ఈ స్థితి ఇప్పుడు చెప్పే బిగ్ బాంగ్ ను పోలి  ఉంది . అది చైతన్యాన్ని తనలో ఇముడ్చుకున్న స్థితి శక్తి . అందులోనుండి వెలువడిన చైతన్యం చరాచర పరాపర విశ్వంగా మారింది .



ప్రథమంగా ఉన్నది అంధకారమై  ఇప్పుడు కనపడే సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఒక ఆవరణగా ఉంది . ఈ స్థితి ఏది అని కనుక్కోవడానికి శాస్త్రాలు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి . అందుకే ఋగ్వేదం దాన్ని అనిర్వచనీయమైనదని అన్నది. 



కామస్తదగ్రే సమవర్ధతాది మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుంసతి నిరవిందన్ హృది ప్రతీప్యా కవయో మనీషా – 4


4.దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.


మనస్సు ప్రథమ రేతస్సుతో మొదట హృదయంనుండి ఆకాంక్ష అంకురించబడినదని తెలుసుకున్న ఋషులు సత్యానికి అసత్యానికి ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు .


సత్యం అన్నది మూలం . అసత్యం అన్నది మూలం నుంచి వచ్చి తిరిగి అందులోనికి పోయేది అని అర్థం . సృష్టి పరంగానైనా శాస్త్ర పరంగానైనా ఈ నిజం ఒకటే . జగత్తులో ఒక్క మనిషి మాత్రం ఆ చైతన్యాన్ని గుర్తించి మూలంలోకూడా చైతన్యంగా వ్యవహరించగలుగుతాడు . ఆ చైతన్యం కలిగిన మనిషే దేవుడౌతాడు .


ఏ మనిషి ఇతరులకంటే శక్తిమంతుడు అయి ఇతరులకు ఉపయోగపడే కార్యం  చేస్తాడో అతడే దైవంగా భావిస్తున్నారు . తన్ను తాను తెలుసుకున్నవాడు మూలం చేరి విముక్తడవుతాడు . ఇతరులకు ఉపయోగపడితే  దేవుడవుతాడు . 




తిరశ్చినో వితతో రశ్మిరేషామధ: స్విదాసీ దుపరి స్విదాసీత్ | 

రెతొధా అసన్ మహిమాన ఆసన్ త్స్వధా అవస్తాత్ ప్రయతి: పరస్తాత్ || -5


5.మరియు శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైనశక్తులను తయారు చేసింది. అన్నిటికిపైన చైతన్యశక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణకు తగ్గట్టుగా నడుస్తోంది.


అతనిలో ఒక కిరణం ఏటవాలుగా ఉంది. ఆవెలుగు కిరణం క్రిందికి పైకి వ్యాపిస్తున్నది.అక్కడ బీజం ఉంది. అతనియందు మహిమలు న్నాయి. అతనికి స్వతంత్రమైన పనులున్నాయి.అతని యందు చైతన్య స్పందన ఉన్నది. శ్రేష్ఠమైన ప్రగతి ఉంది.అతని యందు (ప్రకాశించే)శక్తి ఉన్నది

పనులు =సృష్టి స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది పంచ కర్మలు శక్తి = చిచ్ఛక్తి .




కోఅద్ధా వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టి: | 

అర్వాగ్దేవా అస్య విసర్జనేనాథాకోవేద యత ఆ బభూవ || -6


6.కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు (పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే).



సరీగ్గా ఎవరికి తెలుసు ? అతడిని గురించి ఎవరు చెప్పగలరు? ఈ సృష్టి ఎక్కడినుంచి వచ్చిందో ఎవరు చూసారు?


దేవతలంతా తరువాత జన్మించిన వారు. ఎక్కడినుంచి ఈసృష్టి ఎలా వచ్చిందో ఎవరూ చూడలేదు. ముందు గాఉన్నది అతడు మాత్రమే.


ఇక్కడ దేవతలు అంటే పంచ బ్రహ్మలు.(స బ్రహ్మ స శివ, స హరి స్సేంద్ర: సొ అక్షర: పరమ స్వరాట్) .



ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధేయ దివాన | 

యో అస్యాధ్యక్ష: పరమె వ్యొమన్ సొ అంగ వేద యది వా నవేద || -7


7.ఈ సృష్టిని చేసి, దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. బహుశ అతనికి కూడా తెలియదేమో! (ఎవరికి తెలుసు?)


ఈ సూక్తంలో చెప్పిన చాలా విషయాలను ఆధునిక భౌతికశాస్త్రం కూడా వర్ణించింది. విశ్వోద్భవశాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద అవగాహన ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది.


ఈ సృష్టి ఎక్కడినుంచి వచ్చింది, పరమా కాశం లో దీనిని ఎవరు ఉంచారు ? ఇది పరమాకాశం లో ఉన్న, అన్నిటికి అధ్యక్షుడైన విశ్వకర్మ ఆ సృష్టికర్తకే తెలుసు....లేదా ఆయనకు తెలియదని మనం అనుకోవచ్చు.

అన్ని యెరిగిన వాడు, సర్వసాక్షి ఆ పరమాత్మ యొక్కడే.


🕉🌞🌏🌙🌟🚩


*సృష్టి పుట్టు పూర్వోత్తరాలు*

^^^^^^^^^^^^^^^^^

ఋగ్వేదంలోను, ఉపనిషత్తులలోను, దర్శనాలలోను, త్రిమత సిద్ధాంతాలలోను సృష్టిని గురించిన విచారణ విస్తారంగానే ఉంది. ఈ విశ్వం ఎక్కడ నుండి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎంతకాలం ఉంటుంది? మొదలైన ప్రశ్నలకు సమాధానాలను మన ప్రాచీనులు వెతికారు. కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కాకపోతే, ఇవన్నీ ఏ నిర్దిష్టమైన సిద్ధాంతాన్నీ ఆవిష్కరించలేదు. అయితే, విశ్వసృష్టి (cosmology) మీద వేల సంవత్సరాల క్రితం భారతీయ చింతన దృష్టి సారించడమే ఒక విశేషం. ‘అనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్యన్న పర: కిం చనాస’ (ఋ: 10.8.129) ‘సృష్టికి పూర్వం ఉన్నది భగవంతుడు తప్ప మరెవ్వరూ లేరు. ఆయన తనంతట తానే శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాడు’ అని ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం సృష్టి పూర్వం ఉండే స్థితిని ఆసక్తికరంగా వర్ణించింది.



పురుషసూక్తం ‘పరమాత్మ మనస్సు నుండి చంద్రుడు, చక్షువుల నుండి సూర్యుడు ఉద్భవించారని’ సృష్టిక్రమాన్ని వర్ణించింది. మొదట జన్మించిన వాడు హిరణ్యగర్భుడని, ఆయనే భగవంతుడని, ఆయనే విశ్వానికి అధిపతి అని ‘హిరణ్యగర్భసూక్తం’ (ఋ: 10.8.121) చెబుతున్నది. ఇక తైత్తిరీయ ఉపనిషత్తులో కొంత స్పష్టత కనిపిస్తుంది. ‘సో‚కామయత బహుస్యాం ప్రజాయేయేతి’ ఒకటిగా ఉన్న నేను అనేకములుగా అవుతాను. నన్ను నేనే పుట్టించుకొనెదను అని సంకల్పించుకొని ఆ అవ్యాకృతంగా వున్న బ్రహ్మం ‘తదాత్మానగ్గ్‌ం స్వయమకురుత’ తనకు తానే ఈ నామరూపాత్మకమైన విశ్వంగా మారాడట. ఈ విశ్వంగా మారే క్రమాన్ని ఉపనిషత్తు ఇలా వివరించింది. ‘తస్మాద్వా ఏతస్మాదా త్మన ఆకాశ స్సంభూత: ఆకాశాద్వాయు: వాయోరగ్ని: అగ్నేరాప: అద్భ్యాపృథివీ: పృథివ్యా ఓషధయ: ఓషధీభ్యోన్నమ్‌ అన్నాత్పురుష:’ (2.1) బ్రహ్మం నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి నీరు, దాని నుండి భూమి, దాని నుండి మొక్కలు, వాటి నుండి అన్నం, దాని నుండి పురుషుడు లేక జీవజాలం పుట్టిందని హృద్యంగా వివరించబడింది.



ఇక్కడ ఒక విషయం వివరించాలి. ఆకాశం జడమైంది. దానికి సృష్టించే శక్తి లేదు. మరి, దాని నుండి జలం ఎలా వచ్చిందనే సందేహం వస్తుంది. బ్రహ్మం ఆకాశాన్ని సృష్టించినప్పుడు దానిలో బ్రహ్మం (material cause) నిక్షిప్తంగా ఉంటుంది. అలా ప్రతి వస్తువులోనూ ఉంటుంది. బయటా, లోపలా ఉండేది బ్రహ్మం అని ముందు చెప్పుకున్నాం కదా. అందువల్ల అంతర్హితంగా, అన్నింటిలోనూ బ్రహ్మం ఉంటూనే ఒకదాని నుండి మరొక దానిని సృష్టిస్తుందని తాత్పర్యం. అయితే, ఈ నామరూపాత్మకమైన సృష్టికి ఆదిమధ్యాంతాలు ఉన్నాయి కనుక నిజమైంది కాదని అద్వైతులు, మన కంటికి కనిపిస్తున్న, మనం వ్యవహరిస్తున్న ప్రపంచాన్ని మిథ్య అనరాదని, అది నిజమేనని విశిష్టాద్వైతులు, ద్వైతులు అంటారు. పరమాత్మతో సృష్టించబడ్డ విశ్వాన్ని మిథ్య అనడం తప్పని వారి వాదన.



దాన్ని కూడా ఒక సిద్ధాంతంగా గౌరవించాలి. సాలెపురుగు నుండి దారాలు ఎలా వచ్చి మళ్లీ దానిలోకే ఎలా వెళ్లిపోతున్నాయో అలాగే, బ్రహ్మం నుండి విశ్వం ఉద్భవించి మళ్లీ బ్రహ్మంలోనే లయం అవుతుందని ‘ముండకోపనిషత్తు’ చెప్తున్నది. జైనులు ఉపనిషత్తులను తిరస్కరించి విశ్వం అణువులతో ఏర్పడిందని అన్నారు. ఎవ్వరి ప్రమేయం లేకుండా విత్తనం చెట్టుగా ఎలా మారుతుందో, గుడ్డు పిల్లగా ఎలా మారుతుందో.. అలాగే, ఈశ్వరుని ప్రమేయం లేకుండానే విశ్వం ఆవిర్భవించిందని నిరీశ్వరవాదులైన బౌద్ధులన్నారు. వైశేషిక దర్శనం తన అణు సిద్ధాంతానికి కొనసాగింపుగానే సృష్టి క్రమాన్ని వివరించింది. బ్రహ్మ పదవీకాలం అయిపోయిన వెంటనే పరమేశ్వరుడు జీవులకు విశ్రాంతి నివ్వాలనుకుంటాడు. వెంటనే జీవులలో అదృష్టశక్తిని ఉపసంహరిస్తాడు. తత్కారణంగా పదార్థాలలోని అణువులు వియోగం చెంది పదార్థాలు శిథిలమవుతాయి. మహాభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు కూడా నశించి పరమేశ్వరునిలో ఐక్యమవుతాయి.



విడివిడిగా అణువులు, పుణ్యపాపాలతో కూడిన జీవులు, నిద్రాణంగా ఉంటాయి. ‘అదృష్టవదాత్మ సంయోగాదేవ సర్గాదౌ పరమాణూనాం కర్మ’ (వై.సూ.4.2.7) ఆత్మకు, జీవులకు పూర్వజన్మతోగల సంయోగ కారణంగా అణువులలో కర్మానుగుణంగా స్పందన కలుగుతుంది. అప్పుడు జీవుల కర్మానుభవం కోసం మళ్లీ పరమేశ్వరుడు అణువులలో చలనాన్ని కలిగించి, మహాభూతాలను సృష్టించి, సృష్టికార్యం ప్రారంభిస్తే దానిని బ్రహ్మదేవుడు పూర్తి చేస్తాడు. పరమేశ్వరుడే సృష్టికి నిమిత్త కారణం. బ్రహ్మదేవుడు సృష్టిలో ఉత్తముడు. బ్రహ్మకూడా ఆ పదవిని తన పుణ్యంతోనే పొందాడు. ఆ పుణ్యం క్షయం కాగానే, తనతోపాటు సృష్టికూడా లయం అవుతుంది.



మరొక బ్రహ్మ ఆ పదవిని అలంకరిస్తాడు. ఇలా ప్రతి సృష్టికీ ఒక బ్రహ్మ ఉంటాడు. ఇలా సృష్టిని గురించి భారతీయ చింతన ఉపనిషత్తులలోను, దర్శనాలలోనూ ఏ విధంగా ఉన్నా పరమాత్మ సృష్టికర్త అనే భావంతో అన్నీ అంగీకరించాయి. వైశేషికుల సృష్టి వాదాన్ని శంకరాద్వైతం తిరస్కరించింది. దానికి ముఖ్య కారణం అణుసిద్ధాంతంలోని కొన్ని ప్రధానాంశాలను శంకరులు అంగీకరించక పోవడం. అద్వైతానికి అభ్యంతరం కాని భాగాలను శంకరులు అంగీకరించారు. కాగా ఐతరేయ ఉపనిషత్తులో సృష్టిక్రమం ఇలా వర్ణించబడింది...



‘స ఇమాన్లోకానసృజత: అమ్భోమరీచీర్మరమాపోదో

మ్భ: పరేణ దివం ద్యౌ: ప్రతిష్ఠా‚న్తరిక్షం మరీచయ:

పృథివీ మరో యా అధస్తాత్తా ఆప: (1.1.2)

సృష్టి అంటే ఇదేదో కొత్తగా జరిగే మొదటి సృష్టి అనుకోకూడదు. సృష్టి స్థితి లయాలు వృత్తాకార పద్ధతిలో మరల మరల ఆవృత్తమవుతూనే ఉంటాయి. అందువల్లే సృష్టి అనాది. ఇంతకు ముందటి సృష్టి లయకాలంలో ప్రళయం వచ్చి, అంతం అయిపోతుంది. ఆ ప్రళయ సమయం తీరిపోయి, పూర్వపు సృష్టిలోని జీవజాలం వాసనలకు అనుగుణమైన లోకాల సృష్టి జరుగుతుంది. విశ్వాన్ని సృష్టించాలని ఆత్మ ఆలోచించిందనడంలో అర్థం పూర్వోక్త వాసనలు ప్రధానాన్ని ప్రేరేపించగా, సృష్టికర్త  చైతన్యాన్ని ఇచ్చి సృష్టి కార్యానికి దోహదపడ్డాడని! అలా ఆలోచించి అంభస్సు, మరీచి, మరం, జలం అనే లోకాలను సృష్టించాడు.



బ్రహ్మం నుండి ఈ విశ్వం ఆవిర్భవించిందనుకున్నాం. అయితే ఈ సృష్టికి ప్రేరణ ఏమిటి? తపస్సుతో బ్రహ్మం ‘ఒకటిగా ఉన్న నేను బహురూపాలతో ఆవిర్భవిస్తాను’ అనుకున్నాడు. అంటే, ఆ బ్రహ్మం ఇచ్ఛామాత్రంతోనే సృష్టి జరిగిందని అర్థం చేసుకోవాలి. అలా సంకల్పించుకున్న బ్రహ్మం నుండి మొదట అన్నం పుట్టింది. ఇక్కడ అన్నం అంటే మనకు ఆహారంగా ఉన్న అన్నం అని అనుకోకూడదు. అన్నం అంటే ప్రకృతి (ఆదిమద్రవ్యం Primordial Material) అని అర్థం. దానిలోనే సత్తరజస్తమో గుణాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ ప్రకృతి నుండి హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. ఆయన నుండి మనస్సు (ఇక్కడ మనస్సు అంటే సమష్టి రూపమైన మనస్సు Cosmic Mind), ఆ మనస్సు నుండి పంచభూతాలు (ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి), వాటినుండి జగత్తు ఉద్భవించాయి.



ఎప్పుడైతే జగత్తు పుట్టిందో అప్పుడే జీవులు, కర్మలు వాటిని అనుభవించడం మొదలైంది. ఈ అక్షర పరబ్రహ్మమే సృష్టికి కారణం. ప్రాణం, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి ఇవన్నీ అక్షర పరబ్రహ్మం నుండి పుట్టినవే. ప్రాణం కూడా దీనినుండే ఉద్భవించిందంటే, అంతకు ముందు ప్రాణం అనేది లేదన్న మాటే కదా. అంటే, అక్షర పరబ్రహ్మానికి ప్రాణం ఆపాదించకూడదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నామరూపాత్మకమైన ఈ విశ్వం అంతా ఆ బ్రహ్మం నుండే వచ్చింది. అందువల్ల ఆ బ్రహ్మాన్ని ఉపాదాన కారణం (Material Cause) అన్నారు. భారతీయ తత్వశాస్త్రంలో బ్రహ్మం నుండి విశ్వం ఆవిర్భవించింది (Projection) అంటారు. తాబేలు నుండి అవయవాలు ఎలా బయటికి వస్తాయో అలాగే. మళ్లీ అవయవాలను తాబేలు లోపలికి తీసుకున్నట్లే ప్రళయకాలంలో విశ్వాన్ని బ్రహ్మం తన లోపలికి తీసుకుంటుంది లేదా తనలో లయం చేసుకుంటుంది.



ముందుగా, ఐతరేయ ఉపనిషత్తు సృష్టికి పూర్వం ఉన్న పరిస్థితిని గురించి మూడు విషయాలను చెప్పింది.

ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్: సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మ మాత్రమే.

నాన్యత్కించన మిషత్: కార్యకలాపాలు చేసే ఇతర వస్తువు ఏదీ లేదు.

స ఈక్షత లోకాన్ను సృజాఇతి: విశ్వసృష్టి చేద్దామని ఆ ఆత్మ సంకల్పించింది లేదా ఆలోచించింది. ఇదంతా ఐతరేయ ఉపనిషత్తులోని సృష్టిక్రమం. ఇలా సృష్టి కార్యాన్ని మన ఉపనిషత్తులు వర్ణించాయి.


🕉🌞🌏🌙🌟🚩

Thursday, June 9, 2022

గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని 40 రోజులు తినండి. ఆరోగ్యవంతులు అవండి

 https://youtu.be/28vzcraqm0E. గో🐂 ఆధారిత ప్రకృతి వ్యవసాయము

🌾 సేవ్ దేశీ సీడ్స్ & సేవ్ నేచర్ & సేవ్ సాయిల్ 🌾

👉రసాయన రహిత గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని 40 రోజులు తినండి.ఆ ఆహారము యొక్క  ఉపయోగమును మీరు పొంది వాటి విలువను అందరికీ తెలియజేయండి.గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయమును ఆచరించండి. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించండి.


👉 మన ఊరు - మన ఆరోగ్యము - మన ఆర్థిక వ్యవస్థ,ప్రకృతి వ్యవసాయము, దేశివాళీ విత్తనము,వాననీటి సేకరణతోనే సాధ్యము చేసుకొందాం.దేశివాళీ విత్తనాల్లో అధిక పోషకాలు లభిస్తాయి మరియ రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.


👉ఆరోగ్య సమస్యలు అధికమించి, రోగనిరోధక శక్తిని ఆహారము ద్వారా పొందడానికి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో దేశివాళీ బియ్యముతో  తయారు అయిన భోజనమును 40 రోజుల పాటు తినడము. ఇటువంటి ఆహారమును తిన్నవారు ప్రకృతి యొక్క విలువను అర్థము చేసుకొని ప్రకృతి వ్యవసాయము చేయడము లేదా అటువంటి రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయడము.ఈ విధముగా ప్రకృతి వ్యవసాయము,దేశవాళీ విత్తనాలను వ్యాప్తి చేయడము మరియు భావి యువతరానికి ఆదర్శంగా నిలుద్దాం.


👉 2020 - 2030 కాలాన్ని గ్రామ ఆరోగ్యము, అర్ధికముగా పెంపొందించే దిశగాఎవరి గ్రామములో వారు కనీసము ఎకరం లేక రెండు ఎకరాలాలో ప్రకృతి వ్యవసాయము చేయడం లేదా చేయించాలి.అప్పుడే ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఏర్పడుతుంది.


👉 ప్రతీ గ్రామములో ప్రకృతి రైతులు మరియు ఔత్సాహికులు అందరూ కలిసి 40 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో భోజనాలు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని వ్యాప్తి పెంచడానికి ప్రయత్నములు చేద్దాము.ఎవరి గ్రామములో వారు స్వచందముగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొంటే అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించిన వాళ్లమౌతాము. తద్వారా ప్రకృతి వ్యవసాయం సాగు విధానము పెరుగుతుంది.


👉 మన ఊరు - మన ఆరోగ్యము - మన ఆర్థిక వ్యవస్థ అనే నినాదంతో  సేవ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ విజయ రామ్ గారు,వారు బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మా బహుధాన్య మిత్ర బృందం తరపున హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు🙏👏💐💐.

        

👉 ఇట్లు మీ రైతు సోదరులం

బహుధాన్య మిత్ర బృందం.

🌾సేవ్ దేశీ సీడ్స్ & సేవ్ నేచర్ & 

సేవ్ సాయిల్🌾

*ఏలూరు & కాకినాడ & బళ్ళారి*

📞90591 27252 ; 92475 00497.   

ప్రకృతి వ్యవసాయంతో మన ఆరోగ్యాన్ని, భూమాతను,గోమాతను,వాతావరణమును కాపాడుకుందాం🙏👏.

Wednesday, June 8, 2022

నేడు మృగశిర కార్తె  


_____________________


మృగ‌శిర‌ కార్తె వ‌చ్చిందంటే స‌క‌ల‌జ‌నుల‌కు వూర‌ట క‌లుగుతుంది. అప్ప‌టివ‌ర‌కు గ్రీష్మ‌తాపంతో అల్లాడుతున్న స‌ర్వ‌కోటి జీవాలు తొల‌క‌రి జ‌ల్లుల‌తో స్వాంత‌న చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు ప‌గిలే ఎండ‌లు కాస్తాయి. అనంత‌రం మృగశిర కార్తె వ‌స్తుంది. రుతుప‌వ‌నాల రాక‌ను మృగ‌శిర‌కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ న‌క్ష‌త్రంలో ప్ర‌వేశిస్తే ఆ రాశి ప్రారంభ‌మ‌వుతుంది. జింక త‌ల క‌లిగివుండ‌టంతో ఈ కార్తెను మృగశిర‌కార్తెగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ కార్తె మ‌న‌దేశంపై విశేష‌ప్ర‌భావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువ‌ప‌నాలు భార‌త్‌లోకి ప్ర‌వేశిస్తాయి. అప్ప‌టి వ‌ర‌కు నిప్పులు చెల‌రేగిన భానుడి కిర‌ణాలు న‌ల్ల‌టి మేఘాల ప్ర‌భావంతో  చ‌ల్ల‌బ‌డుతాయి. దేశానికి జీవ‌ధార అయిన వ‌ర్షాల‌తో నేల‌త‌ల్లి పుల‌క‌రిస్తుంది. రైతులు తొల‌క‌రి జ‌ల్లులు ప‌డ‌గానే  దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధ‌మ‌వుతారు. ఏరువాక‌సాగే కాలం అని కూడా అంటారు. 

మృగశిర  న‌క్ష‌త్రం దేవ‌గ‌ణానికి చెందిన‌ది. అధిప‌తి కుజుడు. రాశి అధిప‌తులు శుక్రుడు, బుధుడు. ఈ న‌క్ష‌త్రంలో జ‌న్మించిన‌వారు మంచి అదృష్టం క‌లిగివుంటారు.


ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం వలన శరీరంలో   కూడా సమతుల్యం దెబ్బతిన కుండా ఉండడానికి నేడు ఇంగువ   బెల్లం    కలిపి తీస్కోవడం అనేది మన   ఆనవాయితీ.మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెలుగురైతులు సామెతల రూపంలోవ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు.పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయం గొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు.జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏచుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారు చేసుకున్నారు.ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు.తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’, వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో ఎలా చెప్పుకున్నారో చూడండి: 


*1.అశ్వని (ఏప్రిల్ – 14) '*


అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం

అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.

అశ్వని కురిస్తే అడుగు తడవదు.


*2'.'భరణి' (ఏప్రిల్ – 27)*


భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.

భరణి ఎండకు బండలు పగులుతాయి.భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలుభరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.


*3.కృత్తిక (మే – 11)*


కృత్తిక పునర్వసులు సత్తువ పంట.

కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.


*4.రోహిణి (మే – 25)*


రోహిణి ఎండకు రోళ్ళు పగులును

రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.


*5.మృగశిర (జూన్ – 8)*


మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.

మృగశిరకు ముల్లోకాలు చల్లబడును. మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.

మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.మృగశిర కురిస్తే ముంగాలి పండును.

మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.


*6.ఆరుద్ర (జూన్ – 22)*


ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు.ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.

ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.

ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు. ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.ఆరుద్రతో అదనుసరి.ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.

ఆరుద్ర వాన ఆదాయాల బాన.

ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.

ఆరుద్ర వాన అరుదు వాన

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి.


*7.పునర్వసు (జులై – 6) :-*


పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.


*8.పుష్యమి (జులై – 20) :-*


పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు.


*9.ఆశ్లేష (ఆగస్టు – 3) :-*


ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది

ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.

ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.

ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.

ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం

ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.

ఆశ్లేష వర్షం – అందరికి లాభం.

ఆశ్లేష వాన అరికాలు తేమ


*10.మఖ (ఆగస్టు – 17) :-*


మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ

మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.

మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి. మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు. మఖా పంచకం సదా వంచకం.మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం. మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.


*11.పుబ్బ (ఆగస్టు – 31) :-*


పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.

పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.

పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు

పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు

పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు

పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు.


*12.ఉత్తర (సెప్టెంబరు – 13) :-*


ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.

ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.

ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.

ఉత్తర పదును ఉలవకు అదును.

ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.

ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు


*13.హస్త (సెప్టెంబరు – 27) :-*


హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.

హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.

హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.

హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.

హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.

హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.

హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.

హస్తలో చల్లితే హస్తం లోకి రావు.

హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.

హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.


*14. చిత్త (అక్టోబరు – 11) :-*


చిత్త కురిస్తే చింతలు కాయును

చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.

చిత్తి ఎండకు బట్టతల పగులును.

చిత్తలో చల్లితే చిత్తుగా పండును.

ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.

చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.

చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.

చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.

చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.

చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.

చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.


*15.స్వాతి (అక్టోబరు – 27) :-*


స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.

స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.

స్వాతి కురిస్తే భీతి కలుగును.

స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.

స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.

స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.

స్వాతి వానకు సముద్రాలు నిండును.

స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.

స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.

స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.


*16.విశాఖ (నవంబరు – 16) :-*


విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.

విశాఖ కురిస్తే పంటకూ విషమే.

విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం

విశాఖ విసురుతుంది.


*17.అనూరాధ (నవంబరు – 20) :-*


అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.


*18.జేష్ట్య (డిసెంబరు – 3) :-*


జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును


*19.మూల (డిసెంబరు – 16) :-*


మూల కార్తెకు వరి మూలన జేరుతుంది

మూల ముంచుతుంది

మూల కురిస్తే ముంగారు పాడు

మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు

మూల మంటే నిర్మూల మంటాడు

మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.

మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది. 

అది మన రైతన్నల విజ్ఞానం. 


P.v. subrahmanyam

_____________________


మృగ‌శిర‌ కార్తె వ‌చ్చిందంటే స‌క‌ల‌జ‌నుల‌కు వూర‌ట క‌లుగుతుంది. అప్ప‌టివ‌ర‌కు గ్రీష్మ‌తాపంతో అల్లాడుతున్న స‌ర్వ‌కోటి జీవాలు తొల‌క‌రి జ‌ల్లుల‌తో స్వాంత‌న చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు ప‌గిలే ఎండ‌లు కాస్తాయి. అనంత‌రం మృగశిర కార్తె వ‌స్తుంది. రుతుప‌వ‌నాల రాక‌ను మృగ‌శిర‌కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ న‌క్ష‌త్రంలో ప్ర‌వేశిస్తే ఆ రాశి ప్రారంభ‌మ‌వుతుంది. జింక త‌ల క‌లిగివుండ‌టంతో ఈ కార్తెను మృగశిర‌కార్తెగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ కార్తె మ‌న‌దేశంపై విశేష‌ప్ర‌భావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువ‌ప‌నాలు భార‌త్‌లోకి ప్ర‌వేశిస్తాయి. అప్ప‌టి వ‌ర‌కు నిప్పులు చెల‌రేగిన భానుడి కిర‌ణాలు న‌ల్ల‌టి మేఘాల ప్ర‌భావంతో  చ‌ల్ల‌బ‌డుతాయి. దేశానికి జీవ‌ధార అయిన వ‌ర్షాల‌తో నేల‌త‌ల్లి పుల‌క‌రిస్తుంది. రైతులు తొల‌క‌రి జ‌ల్లులు ప‌డ‌గానే  దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధ‌మ‌వుతారు. ఏరువాక‌సాగే కాలం అని కూడా అంటారు. 

మృగశిర  న‌క్ష‌త్రం దేవ‌గ‌ణానికి చెందిన‌ది. అధిప‌తి కుజుడు. రాశి అధిప‌తులు శుక్రుడు, బుధుడు. ఈ న‌క్ష‌త్రంలో జ‌న్మించిన‌వారు మంచి అదృష్టం క‌లిగివుంటారు.


ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం వలన శరీరంలో   కూడా సమతుల్యం దెబ్బతిన కుండా ఉండడానికి నేడు ఇంగువ   బెల్లం    కలిపి తీస్కోవడం అనేది మన   ఆనవాయితీ.మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెలుగురైతులు సామెతల రూపంలోవ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు.పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయం గొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు.జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏచుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారు చేసుకున్నారు.ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు.తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’, వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో ఎలా చెప్పుకున్నారో చూడండి: 


*1.అశ్వని (ఏప్రిల్ – 14) '*


అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం

అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.

అశ్వని కురిస్తే అడుగు తడవదు.


*2'.'భరణి' (ఏప్రిల్ – 27)*


భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.

భరణి ఎండకు బండలు పగులుతాయి.భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలుభరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.


*3.కృత్తిక (మే – 11)*


కృత్తిక పునర్వసులు సత్తువ పంట.

కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.


*4.రోహిణి (మే – 25)*


రోహిణి ఎండకు రోళ్ళు పగులును

రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.


*5.మృగశిర (జూన్ – 8)*


మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.

మృగశిరకు ముల్లోకాలు చల్లబడును. మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.

మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.మృగశిర కురిస్తే ముంగాలి పండును.

మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.


*6.ఆరుద్ర (జూన్ – 22)*


ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు.ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.

ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.

ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు. ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.ఆరుద్రతో అదనుసరి.ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.

ఆరుద్ర వాన ఆదాయాల బాన.

ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.

ఆరుద్ర వాన అరుదు వాన

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి.


*7.పునర్వసు (జులై – 6) :-*


పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.


*8.పుష్యమి (జులై – 20) :-*


పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు.


*9.ఆశ్లేష (ఆగస్టు – 3) :-*


ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది

ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.

ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.

ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.

ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం

ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.

ఆశ్లేష వర్షం – అందరికి లాభం.

ఆశ్లేష వాన అరికాలు తేమ


*10.మఖ (ఆగస్టు – 17) :-*


మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ

మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.

మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి. మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు. మఖా పంచకం సదా వంచకం.మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం. మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.


*11.పుబ్బ (ఆగస్టు – 31) :-*


పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.

పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.

పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు

పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు

పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు

పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు.


*12.ఉత్తర (సెప్టెంబరు – 13) :-*


ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.

ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.

ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.

ఉత్తర పదును ఉలవకు అదును.

ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.

ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు


*13.హస్త (సెప్టెంబరు – 27) :-*


హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.

హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.

హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.

హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.

హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.

హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.

హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.

హస్తలో చల్లితే హస్తం లోకి రావు.

హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.

హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.


*14. చిత్త (అక్టోబరు – 11) :-*


చిత్త కురిస్తే చింతలు కాయును

చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.

చిత్తి ఎండకు బట్టతల పగులును.

చిత్తలో చల్లితే చిత్తుగా పండును.

ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.

చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.

చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.

చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.

చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.

చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.

చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.


*15.స్వాతి (అక్టోబరు – 27) :-*


స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.

స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.

స్వాతి కురిస్తే భీతి కలుగును.

స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.

స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.

స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.

స్వాతి వానకు సముద్రాలు నిండును.

స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.

స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.

స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.


*16.విశాఖ (నవంబరు – 16) :-*


విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.

విశాఖ కురిస్తే పంటకూ విషమే.

విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం

విశాఖ విసురుతుంది.


*17.అనూరాధ (నవంబరు – 20) :-*


అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.


*18.జేష్ట్య (డిసెంబరు – 3) :-*


జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును


*19.మూల (డిసెంబరు – 16) :-*


మూల కార్తెకు వరి మూలన జేరుతుంది

మూల ముంచుతుంది

మూల కురిస్తే ముంగారు పాడు

మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు

మూల మంటే నిర్మూల మంటాడు

మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.

మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది. 

అది మన రైతన్నల విజ్ఞానం. 


P.v. subrahmanyam

Tuesday, June 7, 2022

సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

 040821160821.  070622-9.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....*

                  ➖➖➖✍️


*1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.*


*2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.*


*3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.*


*4. తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.*


*5. తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.*


*6. స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.*


*7. సూర్య గ్రహణానికి ముందు ''12 '' గంటల కాలము, చంద్ర గ్రహణానికి ''9'' గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.*


*8. శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి బుధునకు, ఇనుము శని కి ఇష్టము.*


*9. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.*


*10. బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.*


*11. యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.*


*12. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.*


*13. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.*


*14. ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.*


*15. ఇద్దరు కూతుర్లకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.*


*16. గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకొట్టుచుందురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.*


*17. వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.*


*18. తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.*


*19. భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.*


*20. కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.*


*21. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.*✍️



                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

Thursday, May 26, 2022

అగ్నిహోత్రం

 జై గురుదేవ 

ధ్యాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో  శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం రోజున నిర్వహించబడే ప్రత్యేక సత్సంగకార్యక్రమానికి మీకు హృదయపూర్వక ఆహ్వానం.


 ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు


Time: APRIL 10 ,SUNDAY 2022


 06:00 PM



 

 అగ్నిహోత్రం 


_సామూహిక అగ్నిహోత్రం_


 అగ్నిహోత్రం పరమ పవిత్రం. ఇంట్లో క్రిమి కీటకాలు పోగొట్టి ఇంటి ఆవరణలో ప్రాణవాయువును (అక్సిజన్ )పెంచు అద్భుత హోమం . 


 సాధకులు online లో చూస్తూ వారు వారి ఇంట్లో చేసుకోగలిగిన ఓ మంచి కార్యక్రమం .


 అగ్నిహోత్రంలో ఈ క్రింది వస్తువులను సమకూర్చుకొని ,స్నానం చేసి , సాంప్రదాయ దుస్తులతో ఓ పండుగ వాతావరణం లో చేద్దాం .


🔥🔥🔥☀️🔥🔥🔥

 

👉 అగ్నిహోత్రం చేయాలి అనుకునే వారికి కావలసిన సామాగ్రి

 1. ఆవు పిడకలు 

2. కర్పూరం బిళ్ళలు 4/ముద్ద కర్పూరం

3. విరగని బియ్యం కొన్ని

4. ఆవు నెయ్యి కొంచెం

5.  అగ్నిహోత్రం పాత్ర.

6. అగ్గిపెట్టె

7.హోమం సమిధలు

8.కొంచెం సాంబ్రాణి.

.

Friday, May 20, 2022

ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశి రకం బియ్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి.

  1. కుజిపాటలియా  బియ్యం


Naturally cultivated *Kujupatalia rice* available for sale.


కేజీ  :90/-

మినిమం  ఆర్డర్  25 kg

Minumum order 25kg

25* 90=2,250


కావలసిన  వారు సంప్రదించగలరు.....

Contact:

Sampath gopathi

9866916202


 కుజిపాటలియా  విశిష్టత :

******

 ఇవి తెలుపు,సన్న రకం .ఈ బియ్యంలో కొవ్వు రహిత మరియు సోడియం లేనివి.తక్కువ కేలరీలు కలిగి వుంటాయి,గ్లూకోజ్ పదార్థంలు తక్కువగా ఉంటాయి, నిద్రలేమీ కలిగినటువంటి వారికి మంచి పరిష్కారం ,రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.

Friday, May 6, 2022

శంకర జయంతి సందర్భాన

 050522G2141.      060522-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


06May 2022…

       శంకర జయంతి సందర్భాన

                 ➖➖➖✍️


ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్లగ విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.


జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు) కేరళ రాష్ట్రం, కాలడి లో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది. ( *క్రీస్తు పూర్వం అని రాసుకోడానికి చింతిస్తున్నాను, శంకరుల శకం శంకరుల పూర్వం అని రాసుకోగలిగే రోజు వస్తే బాగుండు* )

ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం మొదలుపెట్టారు. మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.


హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన, ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు, ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 


శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే, ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 


శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 


👉 ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 


👉 ఇంకొకసారి ఆయన వేదాభ్యాసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ “ *కనకధారా స్తవం* ” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.


👉 శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 


👉 ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. ఒకసారి శంకరులు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు. 

తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు.


ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. 


గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.


ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ *మనీషా పంచకం* చదివారు.


ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి.


ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ, ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు.


ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. 


ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు, పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.


ధర్మసంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీలో  గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో  శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. 

అవి ఈనాటికీ, ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.

ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు, తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.


అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? 


అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 


*నామాట*

*శంకరుల వారసునిగా నువ్వేమి చేయాలి?*

శంకరుల అవతరణకు ముందు దేశంలో పరిస్థితులు   ఎలా ఉండేవో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే ఉన్నాయి. ఇప్పటి పరిస్థితులు చక్కబడాలి అంటే మళ్ళీ శంకరులు అవతరించాల్సిందే. అయితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడడం కన్నా  హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న శంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడు   అవ్వాలి, ఆయనే మనకు స్పూర్తి అవ్వాలి. ప్రతి తల్లి    తన కుమారుని  ఒక   శంకరునిలా పెంచాలి. మనం మన మాతృ ఋణం   తీర్చుకోవాల్సిన   సమయం ఆసన్నమైంది.  సనాతన ధర్మమే మన తల్లి. మన గ్రంధాలమీద వేరే   వాడు   పెత్తనం చెలాయించడం ఏంటి ? మన గురించి ఎవడో పిచ్చిరాతలు రాయడం   ఏదో టీవీ  లో   కూర్చొని పిచ్చికూతలు కూయడం ఏమిటి ? 

ఓ హిందువా మేలుకో ! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. 

ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి, శక్తిని సంపాదించి,  స్పూర్తిని పొంది నీమీద ధర్మం మీద స్పష్టత పొంది మరో శంకరుడివై  నీ ధర్మం   మీద   జరుగుతున్న దాడిని తిప్పికొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. అలా చేసినప్పుడే శంకరులకు మనం సంపూర్ణ నివాళి ఇచ్చినట్టు.

*సనాతన ధర్మం వర్ధిల్లాలి*

…….విఠల్ బాబు గారి వ్యాసం.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Thursday, May 5, 2022

శ్రీ ఆదిశంకరాచార్య కృతం శ్రీగణేశ భుజంగ స్తోత్రము

 *శ్రీ ఆదిశంకరాచార్య కృతం శ్రీగణేశ భుజంగ స్తోత్రము*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*1) రణత్-క్షుద్ర ఘణ్టానినాదాభిరామం। చలత్తాణ్డ వోద్దణ్డ వత్పద్మతాలమ్ ।*


*లసత్తున్దిలాఙ్గో పరివ్యాలహారం।గణాధీశ మీశాన సూనుం తమీడే॥* 


*మ్రోగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు , తాళముననుసరించి ప్రచండ తాండవము చేయుచున్న పాదపద్మములు కలవాడు , బొజ్జపై కదులుచున్న సర్పహారములున్న వాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.*




*2) ధ్వనిధ్వంస వీణాలయోల్లాసివక్త్రం। స్ఫురచ్ఛుణ్డ దణ్డోల్ల సద్బీజపూరమ్ ।*


*గలద్దర్పసౌగన్ధ్య లోలాలిమాలం।గణాధీశ మీశాన సూనుం తమీడే ॥*


*ధ్వని ఆగుటచే వీణానాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు , ప్రకాశించు తొండముపై విలసిల్లు బీజపూరమున్నవాడు , మదజలం కారుచున్న బుగ్గలపై అంటుకొన్న తుమ్మెదలు కలవాడు . ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*




*3) ప్రకాశజ్జపారక్తరన్త ప్రసూన-। ప్రవాల ప్రభాతారుణ జ్యోతిరేకమ్ ।*


*ప్రలమ్బోదరం వక్రతుణ్డైకదన్తం।గణాధీశమీశాన సూనుం తమీడే ॥*


*జపాపుష్పము , ఎర్రని రత్నము , పువ్వు , చిగురుటాకు , ప్రాతఃకాల సూర్యుడు వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజోమూర్తి , వ్రేలాడు బొజ్జ కలవాడు , వంకరయైన తొండము , ఒకే దంతము కలవాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*




*4) విచిత్రస్ఫురద్రత్న మాలాకిరీటం।కిరీటోల్లసచ్చన్ద్రరేఖా విభూషమ్ ।*


*విభూషైకభూశం భవధ్వంసహేతుం।గణాధీశమీశానసూనుం తమీడే ॥*


*విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటము కలవాడు , కిరీటముపై తళతళలాడుచున్న చంద్రరేఖాభరణమును ధరించినవాడు , ఆభరణములకే ఆభరణమైనవాడు , సంసార దుఃఖమును నశింపచేయువాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*




*5) ఉదఞ్చద్భుజా వల్లరీదృశ్యమూలో-। చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।*


*మరుత్సున్దరీచామరైః సేవ్యమానం।గణాధీశమీశానసూనుం తమీడే ॥*


*పైకెత్తిన చేతుల మొదలులు చూడ దగినట్లున్నవాడు , కదులుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు , దేవతాస్త్రీలచే చామరములతో సేవించబడుచున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.*




*6) స్ఫురన్నిష్ఠురాలోల పిఙ్గాక్షితారం। కృపాకోమలోదార లీలావతారమ్ ।*


*కలాబిన్దుగం గీయతే యోగివర్యై-। ర్గణాధీశ మీశానసూనుం తమీడే ॥*


*ప్రకాశించుచున్నవి , కఠినమైనవి , కదులుచున్నవి , పింగళవర్ణము కలవి అగు కంటిపాపలు కలవాడు , కృపచే కోమలుడై ఉదారలీలా స్వరూపుడు , కలాబిందువు నందు ఉన్నవాడుగా యోగి వరులచే స్తుతింపబడువాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*




*7) యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం। గుణాతీతమానన్ద మాకారశూన్యమ్ ।*


*పరం పరమోఙ్కార మాన్మాయగర్భం ।వదన్తి ప్రగల్భం పురాణం తమీడే ॥*


*ఏ గణాధీశుని ఏకాక్షరము , నిర్మలము , నిర్వికల్పము , గుణాతీతము , ఆనందస్వరూపము , నిరాకారము , సంసార సముద్రమున కవతలి తీరమునందున్నది , వేదములు తనయందు కలది అగు ఓంకారముగా పండితులు చెప్పుచున్నారో, ప్రగల్భుడు , పురాణపురుషుడు అగు ఆ వినాయకుని స్తుతించుచున్నాను.*




*8) చిదానన్దసాన్ద్రాయ శాన్తాయ తుభ్యం। నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।*


*నమోఽనన్తలీలాయ కైవల్యభాసే। నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥*


*జ్ఞానానందముతో నిండినవాడవు , ప్రశాంతుడవు అగు నీకు నమస్కారము. విశ్వమును సృష్టించువాడవు , సంహరించువాడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము. ప్రపంచమునకు బీజమైనవాడా! ఈశ్వరపుత్రుడా! ప్రసన్నుడవగుము.*




*9) ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా। పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।*


*గణేశప్రసాదేన సిధ్యన్తి వాచో। గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥*


*ఉదయముననే నిద్రలేచి భక్తితో ఈ మంచి స్తోత్రమును ఏ మానవుడు పఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును?*


*॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీ గణేశ భుజంగ స్తోత్రం సంపూర్ణం ॥*


🕉️🌞🌏🌙🌟🚩

Wednesday, May 4, 2022

జగద్గురు ఆదిశంకరాచార్యులు

 _*🚩ఎల్లండి  #ఆదిశంకరాచార్య జయంతి🚩*_         


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*జగద్గురు ఆదిశంకరాచార్యులు*


హిందూ  మత  పరిరక్షణ  కొరకు  అవతరించిన  సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.


*శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*

*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*


*ఆది శంకర జయంతి*


ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త  క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని  భక్తుల  ప్రగాఢ విశ్వాసం


*దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*

*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*


దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)


*కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*

*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*


శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)


జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.


ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం  గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.


☘ ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 


☘  ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.


☘ శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి

అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 


☘   ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది.  ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.


☘   గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.


☘  ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.


☘   ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.


☘  ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.


☘  ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట  కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!

ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!


☘  ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు , మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు మొదలైన వారు.


☘  వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.


☘  హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 


☘  గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.


☘  శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 


☘  ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.


*🌹మఠము-పీఠము🌹*


సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.


*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం  చేశారు* 


దేశంలో  నాలుగు  వైపుల  నాలుగు ప్రధానమైన  పీఠాల్ని  నెలకొల్పి దేశ సమగ్రత ను  ఆధ్యాత్మికతను కాపాడారు !!


*1 .తూర్పున  పూరీ  క్షేత్రంలో  గోవర్ధన  పీఠం రుగ్వేదం !!*


*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో  శారదా  పీఠం - యజుర్వేదం!!*


*3 - పశ్చిమాన ద్వారకలో  ద్వారక పీఠం - సామ వేదం !!*


*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*


నలుగురు శిష్యులను  నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.

*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని

రోజులు పీఠాన్ని అధిరోహించి  హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!

                        *చతుర్మఠాలు*


☘  *ద్వారకా మఠము :-*

ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. 


☘  *గోవర్ధన మఠము:-*

దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో


☘  *శృంగేరీ మఠము :-*

ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది


☘  *జ్యోతిర్మఠము :-*

దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.


☘  *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.


🌳 *ఉన్నది ఒక్కటే  పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం    నుప్రభోధించారు  !!*  


🌳  *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో  వున్న వారికే ఈ  సత్యం  అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక  దేవీ  దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన  చేయమన్నారు !!*


🌳  *ప్రస్థాన త్రయం అంటే  భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*

*ఉపనిషత్తలు ! వీటికి  భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*


🌳  *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*


☘  ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన  భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.

 

*శంకరులు :-*


అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 


ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు

ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ

తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు

రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి , అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు. శ్రీ ఆదిశంకరులు

అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా

స్మరించుకోవడం కన్నా పుణ్యమేముంటుంది ?

అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.

ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల

అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.


*" జయ  జయ  శంకర  హర  హర  శంకర "*


*" జయ జయ శంకర హర హర శంకర "*


***From whatsapp post***


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Cvv

 [04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 సృష్టి నిర్మాణానికి పెట్టుబడి సత్యము. దాని అల్లిక అంతా ధర్మముప...