Sunday, January 4, 2026

Cvv

 [04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సృష్టి నిర్మాణానికి పెట్టుబడి సత్యము. దాని అల్లిక అంతా ధర్మముపై చేయబడినది. ధర్మాన్ని అనుసరించి ఈ సృష్టిలో ఎంతైనా అనుభవించవచ్చు. ధర్మసంహిత అను గ్రంథము ఒకటి ఉన్నది. సనాతన ధర్మము తెలియాలంటే అది చూసుకుంటారు. ధర్మానికి సంబంధించి చేయకూడదని చెప్పినవి మనకు చేయాలనిపిస్తే  లోపల అధర్మము ప్రవేశించినదని అర్థము. *చేసేపని వలన ఇతరులకు, సమాజానికి ఇబ్బంది కలిగే పనులన్నీ అధర్మములే.*

త్రిగుణముల నిష్పత్తి లో భేదము వలన నిషిద్ధ కర్మలు ఆచరణ రూపము ధరించును. ఇదియే అవిద్య. ఇది సరిచేసుకుంటే జీవ చైతన్యము సుఖపడుతుంది.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సృష్టి నిర్మాణానికి పెట్టుబడి సత్యము. దాని అల్లిక అంతా ధర్మముపై చేయబడినది. ధర్మాన్ని అనుసరించి ఈ సృష్టిలో ఎంతైనా అనుభవించవచ్చు. ధర్మసంహిత అను గ్రంథము ఒకటి ఉన్నది. సనాతన ధర్మము తెలియాలంటే అది చూసుకుంటారు. ధర్మానికి సంబంధించి చేయకూడదని చెప్పినవి మనకు చేయాలనిపిస్తే  లోపల అధర్మము ప్రవేశించినదని అర్థము. చేసేపని వలన ఇతరులకు, సమాజానికి ఇబ్బంది కలిగే పనులన్నీ అధర్మములే. 

త్రిగుణముల నిష్పత్తి లో భేదము వలన నిషిద్ధ కర్మలు ఆచరణ రూపము ధరించును. ఇదియే అవిద్య. ఇది సరిచేసుకుంటే జీవ చైతన్యము సుఖపడుతుంది.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విద్యాభ్యాసములో శ్రద్ధను మొదటి విద్యగా చెపుతారు. శ్రద్ధనే  అశ్వవిద్య అంటారు. *శ్వ* అంటె భవిష్యత్తు,*శ్వ* అంటె భూతము. *అశ్వ* అంటె భూతము కాదు, భవిష్యత్తు కాదు, ప్రస్తుతము. భూత, భవిష్యత్తులు నిర్జీవములు. ప్రస్తుతము సజీవమైనది. 

ప్రస్తుతము లో ఉండకపోవడమే అశ్రద్ధ. అశ్రద్ధ ఉన్నవారికి ఏ విద్య అందదు. శ్రద్ధ ఉన్నవారికి సూటిగా చూడగానే విషయము అర్థమై పోతుంది. మేధస్సు పదునుగా ఉంటుంది. శ్రద్ధ అంటె రాముడు. శ్రద్ధ అంటె అర్జునుడు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

మనస్సు లోదృష్టితో పనిచేయవలెను. నీ మనస్సు యొక్క దృష్టి నేనే. నీ బుద్ధి రూపమున నేను ఉండి, నీవు చూచినప్పుడెల్ల నేను సత్యదర్శనము గావించెదను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మంత్రమునకు అర్ధము ప్రధానము కాదు. శబ్దతరంగములు ప్రధానము. మంత్రశక్తి శబ్దతరంగముల యందు ఉన్నది. ఉచ్చారణము సరిగా జరిగినపుడు శక్తి ఉద్భవించి, ఉచ్చరించు వానిని ఉద్ధరించును. ఆ తరంగములు పరిసరములను ప్రభావితము చేయును. 

విశుద్ధమగు కంఠము నుండి విశిష్టమగు శబ్దోచ్చారణము ఆర్తితో జరిపినపుడు చీకట్లు వెలుగుగా మారగలవు. అట్టి శబ్దోచ్చారణము ధనము కొరకై చేయుట మొత్తము ప్రయత్నమును నిర్వీర్యము చేయును.

*Master K.P.K*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

యోగసాధన చేయువారు తమ వద్ద పనికిరాని వస్తువులను చేర్చుకొనరాదు. ప్రస్తుత కాలమున వస్తు సముదాయము మిక్కుటముగ జీవుల చుట్టును ప్రోగగు చున్నది. అవసరము లేని వస్తువులను, అనావశ్యకమగు సాంగత్యమును సున్నితముగా విడువవలెను. లేనిచో సాధకుని జీవ చైతన్యమును అవి హరించును. బలహీనుడైన జీవుడు దైవయోగమున నిలువలేడు. 

దైవబలమును పెంచుకొనుచు, ఇతరములు క్లుప్తము కావించుకొనుట సాధకుని సాధనలో ముఖ్యమైనది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సంసార జీవులు కర్మబంధములలో చిక్కుకొని, అప్పుడప్పుడు దైవమును తలచు  చందురు. వారు తృప్తి కొరకు లోకమందలి అనేక విషయముల వెంట పరుగిడు చుందురు. వారు అడప దడప భగవత్కథలు విన్నను, అవి లోనికి ఇంకవు. రుచి పెరగదు. శాశ్వత రుచి ఏర్పడుటకు ప్రారబ్ధ కర్మమే అవరోధమై ఉండును. 

ఎల్లప్పుడు భగవత్ కథలు వినుచు, ముచ్చటించు కొనుటకు ఇచ్చగించు వారితోనే స్నేహము చేయవలెను. ఎప్పుడూ సద్గ్రంథ  పఠనము చేయుచు జీవించినచో జీవితమెట్లు సాగును అని సందేహ పడువారు సమస్యలలో బంధింప బడుదురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దురభిప్రాయము అన్ని అనర్ధములకు ముఖద్వారము. దురభిప్రాయము బలపడినపుడు సమస్తము ఆ దృక్కోణము నుండి  చూచుటయే జరుగును. అపుడు న్యాయ నిర్ణయము జరుగదు. అది కఠినముగా మాటాడుటతో మొదలై కఠినముగ ప్రవర్తించుట వరకు పెరుగును. వేరున పుట్టిన పురుగు క్రమముగ చెట్టునే ధ్వంసము చేయును. 

సాధకులు సదభిప్రాయమునే ఆశ్రయించి, దురభిప్రాయం చేరకుండుటకు ప్రతి ఒక్కరును అప్రమత్తులై ఉండవలెను. అపుడు మాత్రమే పరమగురువుల అనుగ్రహము లభించును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఎన్ని జన్మలెత్తినను, ఎంత మేధస్సును పెంచుకొనినను, ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని విజయములు పొందినను, ఎంత ధనము, కీర్తి సంపాదించినను మానవుడు జీవితమున ప్రాధమిక సూత్రములను అనుసరించుట లేదు. ముమ్మాటికీ ఆచరించుట లేదు.

*కర్మ చేయుట యందు నీకధికారము కలదు గాని,*

*ఫలముల యందు నీకెప్పుడూ అధికారము లేదు*

ఈ సూత్రం విననివారు లేరు. అనుసరించు వారునూ లేరు. పండితులు గూడ గీతా పారాయణమునకు ఫలితమును నుడివిరి. ఇంతకన్నా జీవితమున మాయ ఏమి కలదు?  ఒక ఉపాయము  కలదు. యోగేశ్వరుల జీవిత చరిత్రను పఠించి, స్పూర్తి చెంది, అట్లు జీవించుటకు ప్రయత్నించుట చేయవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నా యోగము శ్రద్ధా భక్తులతో చేయువారికి దేహమున సహజముగా వేడిమి పెరుగును. అనగా ప్రార్థన వలన దశప్రాణముల ద్వారా, శతనాడుల ద్వారా దేహము నందు  ప్రాణాగ్ని వ్యాపించును. తదుపరి ప్రాణాగ్ని, చైతన్యము హృదయమున చేరి, అటుపైన సుషుమ్న నాడి ద్వారా, ఊర్ధ్వముఖము పట్టును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: .*శ్రీగురుభ్యోనమః*🙏

ప్రతి రోజు సాయంత్రము లేక ఆదివారము  సాయంత్రము భాగవత పారాయణము జరుపుకోవడము అనేటటువంటిది ఒక భగవదనుగ్రహము. జీవితములో అలా జరుపుకోవడమనేటటు వంటిది జీవుడికి పరమ శాంతిని ప్రసాదిస్తుంది. అది భగవంతుని గూర్చి మనము చేసుకొనేటటు వంటి ప్రశంస. అతడు ఈ సృష్టిని నిర్మించి, ఇందు వసించి, దీనిని వృద్ధి చేసి, మరల తన లోనికి తీసుకుంటూ సంరక్షించుకొనే భద్రాత్మకుడు. 

భాగవతమును గురించి, భగవంతుని గురించి చింతన చేస్తున్నప్పుడు భాగవత మార్గము సమస్తమగు చైతన్య స్వరూపముగా దర్శనమిస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క అనుభూతిని ఒక రసానుభూతిగా  పొందటము అనేది భాగవత మార్గములో వీలుపడుతుంది.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవస్మరణము ధర్మాచరణమునకు దారి చూపును. ధర్మాచరణము దైవమునకు దారి చూపును. ధర్మము నాణెమునకు బొమ్మ, బొరుసు వంటివి. ధర్మము తెలియక జీవితమున ప్రవేశించుట అవివేకము. 

ధర్మమాచరించుచు  దైవమును ఆరాధన చేయనివాడు అహంకార పడుటకు అవకాశము మెండు. ధర్మముతో కూడని అర్థము (సంపాదన) ధర్మముతో కూడని కామము పతన హేతువు. ధర్మమును ఆచరించుట రాముడు చూపిన దారి. అతి సూక్ష్మమగు ధర్మము బుద్ధి యందు ప్రచోదన మగుటకు రామమంత్రము చాలును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఆషాఢమాసము వచ్చిందంటే సాధకులు సద్గురు స్పర్శ గురించి తపన చెందుతారు. సద్గురువు చంద్రుని వంటివాడు. సద్గురువులు ఈ కాలమున శిష్యుల ప్రాణములను సర్దుబాటు చేసి, శిక్షణ ఇచ్చి, యోగమున శిష్యులను ప్రవేశింప చేయుదురు. 

సాధకులు తగిన స్ఫూర్తితో ఆహార వ్యవహారముల యందు, నిద్రాదుల యందు  నియమమును పాటించిన యెడల ప్రాణమయ కోశములకు నూతన ఉత్సాహము కలుగును. ఆషాఢమాసమున దైవము భూమిజీవులను చేరుట, సద్గురువులు శిష్యులను చేరుట సున్నితముగా జరుగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుబ్యోనమః*🙏

సుఖ శాంతులతో జీవించుటకు ప్రతి ఒక్కరికిని అతని నడవడియే కారణమై ఉండును. నడవడికి మానవుని బుద్ధి, స్వభావము, శరీరము ఆధారములై ఉన్నవి. బుద్ధి యందు విచక్షణ ఉండును. విచక్షణ ధర్మముపై ఆధారపడి ఉండును. ధర్మము ఆచార్యుల నడవడి యందు, ఉపదేశముల యందు ఉండును. ఆచార్యులనగా ధర్మము నెరిగి, ఆచరించుచూ, ఇతరులకు మార్గదర్శకముగా ఉండువారు. 

అట్టి వారి సాంగత్యము నందు, వారి సేవ యందు మానవుని బుద్ధికి ధర్మముతో కూడిన విచక్షణ ఉండును. అట్టి విచక్షణ గల మానవుని బుద్ధిమంతుడందురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్పురుషులే స్వార్ధపరులుగా మారుతున్న కలి కాలమిది.  నిస్వార్థముగ నిర్వర్తింపబడవలసిన సత్సంకల్పము మార్గమధ్యమున స్వార్థముగా మారుట కలి నిర్వర్తించు చున్న సూక్ష్మమైన ప్రణాళిక.

తాను ఇతరుల కన్న అధికుడనని భావించువారు సత్కార్యములు నిర్వర్తింపలేరు. తాను అనగా ప్రజ్ఞామయమైన వెలుగని భావన చేయుచు, తన స్వభావమును, దేహాభిమానమును వదిలిన వారే లోకహిత మార్గమున యానము సాగించగలరు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సమభావము, సమదృష్టి, న్యాయము, ధర్మము, కరుణ, దయ, క్షమ, ప్రేమ ఇత్యాది ఉత్తమ గుణములకు నెలవు హృదయము. 

తర్కమునకు, వాదమునకు, లౌక్యమునకు హృదయము నిలయము కాదు. ఈ భావములు హృదయములపై ఏర్పడు మేఘముల వంటివి. అమితమగు కారుణ్యము కారణముగా  మహాత్ములు క్షమ చూపుదురే కాని, ఎదుటివారు క్షమార్హులు కారు. హృదయమును అర్థము చేసుకొనువారు హృదయము నందు ఉండువారే. ఇతరులకు హృదయస్థులు అర్థము కారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రస్తుత కాలమున దేహపోషణమునకు విటమినుల స్వీకరణము అత్యావశ్యకములని వైద్యశాస్త్రము యొక్క నమ్మిక. ప్రాణశక్తిని పెంపొందించు విటమిన్లు జీవుని యందే ఉన్నవి. జీవుని యందలి సద్గుణములే నిజమగు విటమినులు. సద్గుణ వంతులు మిక్కుటమగ ప్రాణశక్తి కలిగి ఉందురు. వారహర్నిశలు పనిచేయుచున్నను ప్రాణము నీరసింపదు. 

సాధారణ మానవునికి విటమినులు పనిచేయకపోవడానికి కారణము వారి యందు సద్గుణముల కొరతయే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నఁడుం 

జిత్తములందుఁ గోరరు హింసించియు లోకులకెల్ల నర్ధ సం

పత్తియు భూతియున్ సుఖము భద్రము గోరుదు రన్యరక్షణా

త్యుత్తమ మైన మేను విభుఁ దూరక యేల విరక్తిఁ బాసెనో?

ఈ పద్యము యొక్క సారాంశము అతి సున్నితము. సాధారణముగ ఆత్మహితము కోరుచు జీవులు ప్రార్థన గావించు చుందురు. అట్టి వారు మనుజులలో ఉత్తములు కాలేరు. కాని మహాత్ములు తమ మనస్సు నందు పరిహాసము కొరకైనను  స్వహితము కోరరట! లోకులకు ఎల్లప్పుడును సుఖము, రక్షణ, ఆనందానుభూతి కలుగవలెనని కోరుదురట. ఇట్టివారు కలియుగమున అరుదు. 

తమ హితము కన్న  పరహితమే మిన్నగా కోరువారు నిజమైన భక్తులని భాగవతము ప్రకటించు చున్నది.

*భాగవతము Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

చెందిరి బలమాధవు లభి 

నందించుచు బరమపావనము నంచితకా 

ళిందీసంజీవనమున్ 

బృందావనమున్ మునీంద్ర బృందావనమున్. 

బృందావనమనగా చిదాకాశ స్థానము. అది భ్రూమధ్యమున ఉండును. కాళిందీ యమున యందున్నది. "పింగళ"  యమునా నదిగను, "ఇడ" భాగీరథి గను, వాని మధ్యగల "సుషుమ్న" సరస్వతి నది గను ఋషులు సంకేతించిరి. యమునా నది యందు గల కాళింది బృందావనమునకు సమీపమున ఉన్నది. మునీంద్రులందరు అచట పరిరక్షింపబడు చున్నారు. రామకృష్ణులు ఆనందించుచు బృందావనమును చేరిరి. బృందావనమును చేరిన వానికి ఆనందము సహజము.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శని మనకు మూడు విషయములు నేర్పుతాడు. 1. ఉన్నది, జరుగుతున్నది అంగీకరించడం, 2. శరీర శ్రమ చేయడము, 3. వేచి ఉండడము. ఇష్టము లేనివి వస్తూ ఉంటే కర్మ క్షాళన మవుతున్నదని భావించమని శని చెప్తూ ఉంటాడు. 

వేచి ఉండడము, కర్తవ్యము నిర్వహించడము అనేవి గురు సాన్నిధ్యములో మాత్రమే లభ్యమవుతాయి.

*Master K. P. K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

"హరి" అను శబ్దము గాని "హర" అను శబ్దములు గాని నిత్యము స్మరించుట వలన మనసు నందలి సర్వ దోషములు హరింపబడును. హరుడనగా అజ్ఞానమునంతను హరించువాడు. అట్టి అజ్ఞానము హరింపగా జీవుడు శుద్ధ స్ఫటికము వలె ప్రకాశించును. కల్మష రహితుడగును.

హరి అనగా అంతర్యామి అయిన భగవంతుడు నామ రూపాత్మకమైన సృష్టి యందు దిగివచ్చుట. దిగివచ్చినచో హరి. దిగిరానిచో హరుడు. హరి తేజము హరుడే. హరుని మనోహర రూపము హరి. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మనసులో ఒక కోరిక చోటు చేసుకుంటే ఆ కోరికకు, ఆ మనిషికి ఉచ్చనీచాలేమీ ఉండవు.  అధర్మమైన కోరికకు చిన్న చోటిచ్చినా అది క్రమముగా పెద్దదై నిన్నే మ్రింగి వేస్తుంది. మొలకెత్తిన వెంటనే  త్రుంచివేయాలి.

ధర్మాన్ని వ్యతిరేకించి పనిచేసేవారికి, అసత్యమాడే వారికి జన్మ జన్మల వరకు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సంవత్సరానికి ఒకసారి మనము  ఋషుల యందు మన భక్తి ప్రపత్తులను ప్రకటించుకోవడానికి భాద్రపదశుద్ధ పంచమిని ఋషిపంచమిగా పెద్దలు ఇచ్చారు. ఋషులే లేకపోతే దైవము యొక్క స్వరూప స్వభావాలు తెలిసేవి కావు.  సృష్టిలో దేవతా ప్రజ్ఞల యొక్క అనుగ్రహము ఎలా పొందాలో వీరివలన తెలుస్తుంది. 

బ్రహ్మ నుంచి దిగివచ్చిన ప్రజాపతులలో కొంతమంది సప్తఋషులు అయ్యారు. భగవంతుని సంకల్పముగా సృష్టి ప్రారంభములో సృష్టికి తోడ్పాటు చేయడానికి అవతరించారు. మనము చేసే ప్రతిపనిని నేర్పినది ఋషులే. ఋషులే లేకపోతే మానవ జాతి మ్లేచ్చులుగా ఉండిపోయెడిది. ఋషులను తలచుకోకపోతే మనము కృతఘ్నుల కింద లెక్క. కృతజ్ఞత ఉన్నప్పుడు వృద్ధి ఉంటుంది.

 సప్తఋషులకు కూడా పూజ ఉంటుంది. వినాయకుడు ఎంతటి  వాడో ఋషులు అంతటివారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

విఘ్నములు తొలగుటకు విఘ్నేశ్వరుని ప్రార్థించుట సంప్రదాయము. క్షేమంకరమగు పనులు ఫలించునట్లుగను, కాని పనులు ఫలించ కుండునట్లుగను ప్రార్థించుట వివేకము. 

వినాయకుని పెద్ద చెవులు మాటాడుట కన్నా వినుట నేర్చుకోమని సందేశము ఇచ్చును.  గజముఖము జ్ఞానము నందు ఆసక్తి గొనుమని సూచించును. తొండము నీవు ఓంకార స్వరూపుడవని గుర్తుచేయును. మూషిక వాహనము కౌశలమునకు సూచన.

గణపతి భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగములకు అధిపతి అగుటచే గురుస్థానము అలంకరించినాడు. సృష్టి బృంహణము గావించిన బ్రహ్మణస్పతి. అతడు గురువులకు గురువు. గణపతి ఆరాధనము చక్కగా సాగినచో  మన చిత్తమందలి అవరోధము లన్నియు నశించి, చేతన అర్థవంతముగా ప్రసరించగలదు. గణపతి సాన్నిధ్యము కలుగుచుండగా మన మీద శని ప్రభావము తక్కువగు చుండును. 

గణపతి ఓంకార స్వరూపుడగుటచే ఓంకారమును జతచేసి ఆరాధించుట సర్వశ్రేయస్కరము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నా యోగము సర్వజన శ్రేయోదాయకముగ సాధకులను తీర్చిదిద్దును. స్థూల బంధము నుండి సూక్ష్మలోకాను భూతికి ఉద్ధరించును. భూతత్త్వమును తేలికపరచి కాంతివంతము చేయును. ఆకాశగమనానుభూతిని అందించును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

జీవుని దివ్యానుభూతికి పంచకోశములు సమన్వయింపబడవలెను. మనోమయకోశము నంటిపెట్టుకొన్న జీవుడు ప్రత్యేకమైన భావములలో జీవించి, తనదైన కర్మమును ఏర్పాటు చేసుకుంటాడు. ప్రాణమయ కోశమునకు అనుబంధముగ  తనవైన కొన్ని కోరికలను ఏర్పాటుచేసుకుని, కామశరీరమును మిక్కుటముగా పెంచుకొనుచున్నాడు. 

నా యోగము ద్వారా వీనిని నిర్వీర్యం చేయుటకు సంకల్పించితిని. అందుకని ప్రార్థన మరువకుము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

ఇంచుక మాయ లేక మది నెప్పుడు బాయనిభక్తితోడ వ

ర్తించుచు, నెవ్వడేని హరిదివ్యపదాంబుజగంధరాశి సే

వించు, నతం డెఱుంగు నరవిందభవాదుల కైన దుర్లభో 

దంచిత మైన యా హరియుదారమహాద్భుతకర్మమార్గముల్.

ఎవరైన తన ప్రవర్తనము నందు కొంచెము గూడా మాయ లేక, విష్ణుని దివ్య పాదపద్మముల సుగంధమును సేవించునో అతడు బ్రహ్మాదులకైన దుర్లభమైన  విష్ణుని ధర్మమార్గము తెలియగలుగును. ఇది కంఠస్థము చేయదగిన పద్యము. 

దైవ భక్తులు త్రికరణ శుధ్ధి కలిగి ఉండవలెను. మనస, వాచ, కర్మణ ఒకే విధమగు శుద్ధితో వర్తించవలెను. మోసము చేయరాదు. మాయా మోసములు  చేయుచు దైవారాధనము చేయుట నిరుపయోగము. ఇంచుకైనను భక్తునికి మాయ కూడదని, ఈ పద్యము హెచ్చరించు చున్నది. విష్ణువు అనగా సర్వవ్యాప్తి చెందిన తత్త్వము గనుక ఎవరిని మాయ చేసినను విష్ణుని మాయ చేసినట్లే. మాయను చేసిన వాడు మాయ యందు పడును.

కృష్ణావతారమున గోపకులను, గోవత్సములను, గోవులను మాయ చేసిన బ్రహ్మదేవుడు కృష్ణుని మాయ యందు చిక్కుకొనెను. మానవునకు మాయ చేయి బుద్ధి మాయమైనప్పుడే విష్ణువు అనుగ్రహము లభించును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

లోకహితులు చేయు సత్కర్మాచరణమునకు, సాధారణ భక్తులు చేయు సత్కర్మా చరణమునకు వ్యత్యాసమున్నది. సాధారణ సాధకులు నిర్వర్తించు సత్కార్యములు కర్మక్షాళనమునకే. లోకహితుల సత్కార్యాలకు బలము, ఆయుర్దాయము ఉండును. వారి తపోబలమును బట్టి వారు చేయు  కార్యములు శతాబ్దముల బాటు నిలిచి యుండి, లక్షలాది జీవులకు స్ఫూర్తి కలిగించు చుండును. 

సత్కార్మా చరణము అందరూ గావింపలేరు. వారి యందలి పవిత్రతను బట్టి, జరుగుట జరుగక పోవుట ఉండును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మనస్సు మానవులకు అందింపబడిన ఒక ప్రత్యేక పనిముట్టు. దానిని సద్వినియోగము చేయుట వలన సమస్త సృష్టి వైభవమును పొందవచ్చును. ఊర్ధ్వలోకములకు, అధోలోకములకు వంతెన వంటిది మనస్సు. మనస్సు తన సహజస్థితిని కోల్పోయినచో వంతెన విరిగినట్లే. 

మనస్సును దేవాలయముగా మలచుకొన వచ్చును. అందు దేవుని ప్రతిష్ఠించు కొనవచ్చును. మనసునకు సరియైన శిక్షణ ఇచ్చినచో మానవుడు మహాత్ముడగును. అతడు దేవతల కన్నా మిన్నయై భాసించును. ఋషులందరును అట్టివారే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మన దగ్గర ఉన్న సంపద వెదజల్లితే అవి విత్తనాలై అందులో నుంచి వృక్షాలు తయారై కొన్ని వేల ఫలాలను అందిస్తాయి. ఎంత మనము దానము చేస్తే సృష్టి దానికి పదింతలు ఇస్తుంది. సృష్టి మీద, సృష్టి ధర్మము మీద నమ్మకము ఉండాలి. నీ దగ్గరున్న విద్య, ధనము, శక్తి సామర్థ్యాలను పదిమంది కోసము వాడితే అది కొన్ని రెట్లు అయి సృష్టి నీ కిస్తుంది.  ఆకలిగా ఉన్నవాడిని గుర్తించి, అన్నము పెట్టిన కుటుంబము ఏడు తరాలు రక్షింపబడుతుంది. 

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భగవంతుని ఆశీర్వాదము లభించాలంటే విరివిగా భోజనాలు, సంతర్పణములు చేయాలి. అన్న సంతర్పణము అనాలి, అన్నదానము అనకూడదు. దానము అహంకారముతో కూడి ఉంటుంది. సమ్యక్ తర్పణమే సంతర్పణము. ఒక జీవుని సులభముగా తృప్తి పరచే ఒకే ఒక విధానము అన్నము అందించడమే. దానితో దైవము తృప్తి చెందుతాడు. 

వస్త్రాలు యివ్వడం వలన నిన్ను కాపాడడానికి ప్రతిక్రియ దేవతాలోకాలలో ఏర్పడుతుంది. వస్త్రము ఇవ్వడము వలన మనకు రక్షణ, అన్న సంతర్పణ వలన మనకు పోషణ లభిస్తాయి. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

ప్రస్తుతము మానవజాతి

 కర్మఫలితములలోని దుష్టత్వమును తొలగించుటకు శిక్షాధికారియైన శని పనిచేయుచున్నాడు. ఈ జీవుల దుష్కర్మను రహితము చేయు మార్గమును, శని భరించుచున్న అప్రతిష్టను, క్లిష్ట కార్యక్రమమును నేను తొలగింప పూనుకున్నాను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

తమ తమ ధర్మము, దప్పక

సములై నను నమ్మి తిరుగుసభ్యులకును బం 

ధము నన్ను జూడ విరియును

గమలాప్తుడు వొడమవిరియు ఘనతమము క్రియన్. 

తమ తమ ధర్మములు తప్పక సమభావములు కలిగి, నన్ను నమ్మి జీవించు జీవులకు గల సమస్త బంధములు తొలగును.

ఈ పద్యమున మూడు నియమములు లీయబడినవి. 1.ధర్మాచరణము, 2. సమభావము, 3, దైవమున్నాడని నమ్మిక. ఈ నియమములు పాటించు వారికి దైవానుభూతి కలుగును. జీవుడు ఉత్తమ కక్ష్య లో ప్రవేశించుటచే బంధములు కలవలె అదృశ్యమగును. జీవుడు నియమ బద్ధుడగుట వలన దివ్యాను భూతి అను సూర్యోదయము కలిగి, చీకట్లు అను బంధములు తొలగును. కల నుండి మేల్కాంచిన వారికి కల ఎట్లు లేదో, సంసార చక్రమున పడిన వానికి, సమస్త లౌకిక భావములు అదృశ్యమగును.  ఇది దైవమిచ్చిన వాగ్దానము.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మనసుని వినయవంతము చేయనిచో అహంకారియై తానే సర్వమని గర్వపడును. తన కర్తవ్యములను తాను నిర్వర్తించి, మహత్కార్యములు చేసినట్లు భావించును. సంఘ జీవనము, పెద్దలయందు గౌరవము, దైవారాధనము, శుచిగా ఉండుట,  పశుపక్ష్యాదుల యందు దయ కలిగి ఉండుట కనీస ధర్మములు. ఇవి నిర్వర్తించని వాడు పశుతుల్యుడు.

నిర్వర్తించినవాడు గర్వపడుట కేమియును లేదు. విశేష కర్తవ్యములను ఆచరించినపుడు కూడా సంస్కారవంతులు గర్వపడరు. సద్గ్రంధ పఠనము, సత్పురుష దర్శనము, సేవ అలవాటు కాని మనసు వినయవంతము కాజాలదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్గ్రంథము లన్నియు బాధ్యతనే బోధించుచున్నవి. బాధ్యతలను నిర్వర్తించక, గ్రంథ పఠనము సాగించినచో సాధకుడు ఒక వికారమగు ఒక స్థితిని పొందును. చదివిన విషయములు అనుభవమునకు రాని కారణమున చిరాకు, కోపము నిరాశ,  నిస్సహాయత మనస్సును ఆక్రమించి, సద్విషయము నందు సందేహము ఏర్పడి, సద్విషయములను ద్వేషించు క్రొత్త స్వభావము మొలకెత్తును.

ఈ స్థితి నుండి తనను తాను ఉద్ధరించుకొనుటకు ఒకటియే మార్గము. త్రికరణ శుద్ధితో ఉపయోగకరమగు పనులను మౌనముగా ఆచరించుట ఒక్కటియే పరిష్కారము. సాధకులకు త్రికరణ శుద్ధి పునాదిరాయి కావలెను. లేనిచో సమస్త ప్రయత్నము వృథా కాగలదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రతి వ్యక్తికి అనేకానేక సంకల్పములు కలుగుచుండును. అవి వాగ్రూపము, కార్యరూపం దాల్చక ముందే దైవమునకు సమర్పణ చేసి వేచి ఉండుట సమర్పణ మార్గమున అత్యుత్తమగు విషయము. చేయు కార్యము నందు మనస్సు, వాక్కు, కర్మ సమర్పణము కావలయును. సిద్ధించిన ఫలమును కూడా సమర్పణము చేయవలయును.

 అపుడే సంకల్ప సన్యాసము కలుగును. సంకల్ప సన్యాసము కలిగిన వానికి దివ్యత్వముతో యోగము చెందుటకు అర్హత ఏర్పడును. లేనిచో తన సంకల్పములే తనను బంధించును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

కర్తవ్య కర్మలను ఆచరించుట ఋణమును తీర్చుట వంటిది. దేహ రుణము, సంఘ ఋణము, పితృ ఋణము, కుటుంబ ఋణము, గురు ఋణములను నిర్వర్తింపకుండ దాటవేయుట వలన కర్మము సాధనకు అడ్డుపడును. నిర్వర్తించుట ఋణము తీర్చుట వంటిది గనుక ఫలములను ఆశించుట గూడా అవివేకము. 

ఈ విషయమున గురి కుదరక, నిర్వర్తింపక ఎన్ని రకముల సాధనలు చేసినను నిరుపయోగమే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సూక్తములు, స్తోత్రములు సంవత్సరముల తరబడి చదువు చున్నప్పుడు అవి యాంత్రికములై రుచి కోల్పోవుట సహజము. స్తోత్రములు సత్ఫల మిచ్చుటకు కొన్ని నియమములున్నవి.

పఠించు సూక్తము గాని, స్తోత్రము గాని, వినుట ప్రధానము. 

కంఠమునందు గాని, హృదయమునందు గాని, వినుచున్నట్లు భావించుచు వినవలెను. 

శబ్దము ఉచ్చరించినపుడు అందలి ధ్వని వికాసము నావిష్కరించును. చైతన్యము ప్రకటింప బడును. స్తోత్రములందు శబ్దములు ఛందోబద్దముగ ఋషులు ఏర్పరచిరి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్సంకల్పములు కలిగినప్పటికీ అవి కార్యరూపము దాల్చుట అరుదు. కార్యరూపము దాల్చినను పరిపూర్తి యగుట ఇంకను అరుదు. దీనికి కారణము  సంకల్పమున శ్రద్ధ లేకపోవడం. పూర్వకర్మ కారణముగా స్వభావము శుభ, అశుభ మిశ్రమమై ఉండును. స్వభావమును ఎప్పటికప్పుడు పరిశీలించుకొను చుండవలెను.

సాధకునకు వ్యక్తిగత కర్మను సరిచేసుకొనుట ఒక్కటియే మార్గము. నిష్కామ కర్మ  మార్గమును  అనుసరిస్తూ, పరహితమును ఆచరించినచో త్వరిత గతిన గమ్యము చేరవచ్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భౌతిక దేహమునకు తమోగుణము సహజము. ఎప్పుడును విశ్రాంతిని, నిద్రను కోరును. పూజాది కార్యక్రమములకు, ప్రాతఃకాల సంధ్యావందనమునకు శరీరము తోడ్పడదు. దేవతార్చనలు అక్కరలేదనియు, మానసిక పూజ చాలుననియు అను భావములు పుట్టించును. 

నిజమునకు కొనఊపిరి ఉన్నంతవరకు శారీరకముగ పూజాదికములను నిర్వర్తించ

వలెనని  ఋషులు స్పష్టము చేసిరి. శరీరము దైవకార్యమును ఎగవేయుటకు సంసిద్ధము చూపుట, ఇతర కార్యములకు సహకరించుట గమనింపవలెను. దేహము యొక్క సౌకర్య, అసౌకర్యములతో సంబంధములేక  దైవ కార్యమును నిర్వర్తించవలెను. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నా యోగమున భౌతిక శరీరము నుండి సూక్ష్మ శరీరమును, సూక్ష్మ శరీరము నుంచి కారణ శరీరమును వేరు చేయుట జరుగును. అపుడు అమరత్వమునకు దారి లభించును. ఈ మార్గము  తెలిసిన వారికి జనన మరణ రహస్యములు సంపూర్ణముగా తెలియగలవు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సృష్టికథ మధ్యమున మానవు డవతరించినాడు. అతనికి దైవము స్వతంత్ర బుద్ధి నిచ్చెను. స్వతంత్ర బుద్ధిని బాధ్యతయని ఎరిగి నిర్వర్తింపవలెనే గాని, హక్కుగా భావించి దుర్వినియోగము చేయరాదు. అతడు జరుగుచున్న కథలో తన వంతు కర్తవ్యమును నిర్వర్తించినచో ఉత్తీర్ణుడగును. 

చేయుపనుల యందు అవకతవక లుండి, వాని నుండి కర్మఫలములు పుట్టి, ఋణ రూపము ధరించి, కర్తవ్యములై కాలము రూపమున సమీపించును. తన సంకల్పములే తన బంధనములకు కారణమని తెలియుటకు కొన్ని జన్మలు పట్టవచ్చును. 

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

పలు పాటులబడు జనులకు 

నిలనొకచో నుండగలదె యేరుల వెంటన్

గలసి చనుమ్రాకు లన్నియు

బలువెంటలబోవుగాక పాయక యున్నే.

నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుచున్న దుంగలు వేటి దారిన అవి పోవునవే గాని ఎడబాయక ఉండునా? అటులనే చపలచిత్తుల జీవితము నిలకడ లేక, గమ్యము లేక, పలు శ్రమల నందుచు నశించును. తీరిక లేక జన్మలు ఎత్తుచు విధి వ్రాతపడి సాగిపోవుచుండును. అట్టి వారికి నామ స్మరణమే తరణోపాయము.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విపులీకరించుట కన్నా  క్లుప్తీకరించుకొనుట నిజమగు తెలివి. విస్తారముగా జీవితమును పరచుకొన్నచో అందు చిక్కుకొను అపాయము కలదు. కర్మ యోగి విస్తారముగా కార్యక్రమములు చేయుచున్నను తాను ఆశపడునది ఏమియు ఉండదు. 

ఆశపడునది మిక్కుటముగా  ఉన్నప్పుడు పరిచినదెల్లా పట్టిఉంచును. వస్తువులు, మనుషులు, ఆస్తులు జీవితమున క్రమముగా ఏర్పడి, మానవుని అందు ముంచును. దుస్తులను, వస్తువులను, గృహ సామాగ్రిని అతి తక్కువగా యేర్పరచు కొన్నచో ఎక్కువగా సుఖముండును.

*Master K P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విలువైన విషయముల కొరకు దూరతీరములలో వెతుకుకొనుట పరిపాటి. మహత్తర ప్రదేశములు విలువైనవే కావచ్చును కాని ఒక్కొక్క మారు అంతకు మించిన విషయములు పరిసరములలోనే ఉండవచ్చును. 

సామాన్య ప్రదేశములలో గూడా సత్పురుషులు, సద్విషయము లుండును. వానిని గుర్తించుటకు జిజ్ఞాసువులలో లోతు ఉండవలెను. లోతు పెంచుకున్న కొద్దీ విలువగు విషయములు సమీపముననే గోచరించును.  పై మెరుగులకు భ్రమపడక జీవించుట నేర్చినచో, సూక్ష్మ లోకముల అనుభవము లభ్యమగును.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీమాతను ఉపాసించువారు విశ్వవ్యాప్తమైన కీర్తి పొందుదురు. దేవతల కంటే మించిన కీర్తి పొందుదురు. ఆమె అందించు కీర్తి బాధా రహితమైన కీర్తియై ఉండును. ఇహ, పర లోకము లందు కీర్తి నందించ గలదు. ఆరాధన యందు శ్రద్ధ, భక్తి ఉన్నచో శుచి, శుభ్రతల యందు ఆసక్తి కలుగును. నిరంతర ఆరాధన వలన మనో మాలిన్యములు తొలగి, శక్తి సామర్థ్యములు పెరుగును. 

తత్ఫలితముగా దురదృష్టము తొలగి, అదృష్టము దరిచేరును. సంపద, కీర్తి దగ్గరగు చుండును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

 పంచమి రోజు దేవత పేరు  *శ్రీవహ్నివాసిని*

ఐం హ్రీం శ్రీం శ్రీ వహ్నివాసిని నిత్యా దేవతాయై నమః పాహిమాం, రక్షమాం.

ఫలశ్రుతి: అసమాన శరీరకాంతిని ప్రకాశింప చేయుచు,  ముల్లోకముల యందు సాటిలేనంత ఇహ సౌఖ్యములను ప్రసాదించును.

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీమాతను సంపూర్ణముగా ఎవ్వరెరుగ గలరు? కేవలము పరమ శివుడే ఎరుగగలడు. అతడు ఆది గురువు. అతని నుండి తమ తమ గురువుల వరకు గల మొత్తము గురుపరంపర రూపమున శ్రీమాత ఉన్నది. శ్రీమాత రూప రహస్యమును, తత్త్వరహస్యమును సద్గురువుల ముఖము నుండియే నిశ్చయముగా తెలుసుకొన వచ్చును. అందువలన గురుశుశ్రూష చేయుచు, గురువనుగ్రహము పొంది, గురూపదేశముగ శ్రీవిద్యను అభ్యసింపవలసినదే గాని, మరొక మార్గమున తెలియదు. 

భూమండలమున శ్రీవిద్య ఒకరినుండి ఒకరికి వినికిడి వలన లభించినది. విద్యకు శృతి, స్మృతి మూలము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*

శ్రీమాత అనుగ్రహము కరువుగ ఉన్నచోట, శ్రీమాత అస్థిత్వము అంతంత మాత్రముగ ఉన్నచోట జీవులు పొడిమెతుకుల వలె జీవించు చుందురు. ఆదరణ, ఆప్యాయతలు ఉండవు. వైభవముండదు.  కళాకాంతులు ఉండవు. ఎడారి వలె జీవితములు సాగుచుండును. 

*ఈం* కార రూపిణియగు శ్రీమాత  ఉన్నచో పరస్పరము జీవుల మధ్య ఆర్ద్రత ఉండును. పుష్టి యుండును. ప్రదేశమంతయు పుష్కరమై శోభిల్లును. *ఈం* కారమే సృష్టి యందు కల్పవృక్షము. శ్రీమాతయే సృష్టికి శోభ.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

 తదియ రోజు దేవత పేరు

*నిత్యక్లిన్నా*.

ఐం హ్రీం శ్రీం *నిత్యక్లిన్నా* నిత్యా దేవతాయై నమః  పాహిమాం, రక్షమాం.

ఫలశ్రుతి: కుటుంబ సభ్యులు మనసా, వాచా, కర్మణా ప్రేమాభిమానాలతో, అనురాగముతో ఉంటారు. ఐకమత్యముతో కూడిన ఆదర్శవంతమైన కుటుంబము వర్ధిల్లును.

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీమాత కామధేనువు మరియు కల్పవృక్షము. ఆమె సకల దేవతా మూర్తి, సర్వ శక్తిమంతురాలు. అష్ట ఐశ్వర్యములు ఆమె కనుసన్నలలో ఉండును. కోరికలను తీర్చుచు, జీవులకు వృద్ధి కలిగించు చుండును. కోరికల వలన హాని కలుగునని భావించినచో అట్టి కోరికల విషయమున మరపు కలిగించును.

కోరక ఆరాధనము చేయుట ఉత్తమము. పూజించువారు తమ బుద్ధి దైవ వశమై ఉండవలెనని కోరుకొనుట ఇంకను ఉత్తమము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీ చక్రరాజము నివాసముగా గలది  శ్రీదేవి. శ్రీచక్రరాజము సృష్టికి సంకేతము. మొత్తము తొమ్మిది త్రికోణములతో యుండునది శ్రీచక్రము. కేంద్రమున బిందువు ఉండును. ఇది శ్రీమాత ఉద్భవ స్థానము. తొమ్మిది శ్రీదేవిని గురించిన అంకె. శాశ్వతముగా శివునితోకూడి ఉండును గనుక పది అగుచున్నది. పూర్ణత్వమునకు పది సంకేతము. 

ఆమె అనుగ్రహముననే శివ సాయుజ్యము కలుగును. పరమ శివుడు కూడా ఆమె రూపముననే తెలియ బడును. సృష్టి ఆమె విశ్వ రూపము.చరాచర జగత్తు మొత్తము శ్రీమాత నివాస స్థానము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీమాత సమస్తమును చూచుచుండును. ఆమెయే లోకసాక్షి. కోటానుకోట్ల జీవుల యొక్క ప్రవర్తనమును, పరివర్తనములను అహర్నిశలు వారిలో నుండియే గమనించు చుండును. అధర్మ ప్రవర్తనులకు, అసత్య భాషణం చేయువారికి ఈ సత్యము తెలియదు.  ప్రతి అణువు నందు తానే నిండియున్నది గనుక ఆమె గమనికను దాటి ఏదియూ ఉండదు. 

తన లోపల, వెలుపల చైతన్యమై నిలిచి వివిధ రూపములతో వర్తించు చున్నది శ్రీమాతయే అని తెలిసి చూచుట నిజమగు చూచుట. ఇతర చూపులన్నియు గ్రుడ్డివారి చూపులే.

ఇట్లు తెలిసి ఆరాధించు వారికి శ్రీదేవి సాక్షాత్కారమిచ్చును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుల జిహ్వాగ్రమున శ్రీమాత సరస్వతియై నిలిచి యుండును. చైతన్య ప్రవాహమును సరస్వతి అని అందురు. శ్రీమాత చైతన్యము బ్రహ్మము నుండి పాతాళ లోకముల వరకు ప్రవహించుట వలన లోకములు ఏర్పడి జీవులేర్పడుట జరుగుచుండును. 

ఉత్తమ భావనలు, ఉత్తమ భాషణములు, ఉత్తమ ప్రవర్తనలు నిర్వర్తించు కొనువారిని శ్రీమాత సరస్వతీ రూపములో అనుగ్రహించును. వీరు ఉత్తర వాహిని యందు ప్రవేశింతురు. అధమ భాషణము, అసత్య భాషణము, అధమ ప్రవర్తన గలవారు అధస్సుకు ప్రవహింతురు. 

శ్రీమాత యొక్క సరస్వతీ స్వరూపము నెరుగుట శ్రీమాత అనుగ్రహముననే జరుగును.

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

లలిత అనగా లాలించు తల్లి. లాలింపబడునది సృష్టి. లాలించునది శ్రీమాత. లోకమందలి వెలుగును, ఆవరణములను మించి ప్రకాశించునది గనుక *లలిత* అని ప్రశంసింప బడుచున్నది. నవపురముల సృష్టిపై బిందు స్థానమున ప్రకాశించునది శ్రీమాత.

పుణ్యభూమి యగు భారతదేశమున లలితాపీఠము త్రివేణీ సంగమ పుణ్య ప్రదేశమగు ప్రయాగ యందు ఉన్నది. ఇచ్చటి మాత దర్శనము సర్వ శుభంకరము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఏ జీవుడు సద్గురువు వద్దకు చేరినా దానికి పూర్వపుణ్య విశేషము ఉన్నది. అందరూ సద్గురువు యొక్క సమాశ్రయము లోనికి రాలేరు. అలా వచ్చిన వారిలో వందకొకడికి,  వెయ్యికొకడికి మాత్రమే పరతత్వము గురించి తపన, ఏకాగ్రత ఉంటుంది. సద్గురువు సమాశ్రయము పొంది, సద్వినియోగం చేసుకోవడం మహద్భాగ్యం. సిద్ధి.

ఇలాంటి సిద్ధి యోగ సాధనా పరముగా చక్కగా, క్రమబద్ధముగా శిష్యుల చేత సద్గురువు అవగాహన చేయిస్తారు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీమాత శైలపుత్రి రూపము అరువది నాలుగు కళలతో శోభాయమానముగ ఉండును. పదహారు సంవత్సరముల కన్యగా, మహాలావణ్యముతో శోభిల్లు చుండును.

పదుహారు తిథులు నాలుగు పాదములతో ఏక కాలమున గోచరించినచో అరువది నాలుగు కళలు దర్శనమగును. ఈ కళల యందు 64 విద్యలు ప్రకాశించును. ఇట్టి రూపము శ్రీమాతకే తగును. శ్రీమాత ఈ రూప దర్శనమునకే మహర్షులు తహతహ లాడుచుందురు.

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఏ కొద్ది పుణ్యఫలముగనో శ్రీమాత ఆరాధన యందు రుచి కలిగినచో ఆమె దారి చూపును. క్రమముగా ప్రాథమిక విద్యల నందించును. వాని నాచరించు చుండగ జ్ఞానపర విషయములు తెలిసిన వారు పరిచయమగుదురు. వారిద్వారా విద్యలను విశదీకరించుకొని, ఆచరించుటలో సద్గురువు తారసిల్లును. 

క్రమముగా దుఃఖకారణములు ఉపశమించును. తత్కారణముగా  పరహిత కార్యము లొనర్చుటకు ఉత్సాహించును. ఇహపరముల యందు శాంతి లభించును. శ్రీమాత దుఃఖముల నుండి రక్షించి, తరింపునకు కావలసిన తోడ్పాటు నిచ్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శివుడు లేని శక్తి లేదు. శక్తి లేని శివుడు లేడు. పరతత్త్వమున శివతత్త్వము ఎంత ఉన్నదో శక్తి తత్త్వము గూడ అంతే యున్నది. ఈ రెంటిని సరిసమానముగా దర్శించుట సమదర్శనము. ఎక్కువ తక్కువలు జీవుల మనస్సు యందున్నవి తప్ప, వారిరువరిలో లేవు.

స్త్రీ పురుషులలో ఒకరిపై నొకరు ఆధిపత్యము చూపక సమవర్తనము చూపుట ఉత్తమోత్తమ సంస్కారము. స్త్రీలపై ఆధిక్యము చూపు పురుషులు శ్రీదేవి అనుగ్రహమును పొందలేరు.

అట్లే పురుషులపై ఆధిక్యం కోరు స్త్రీలు గూడా మహాదేవుని అనుగ్రహమును పొందలేరు. శివశక్తులలో ఒకరు అనుగ్రహింపనిచో మరి యొకరు అనుగ్రహింపలేరు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

కోరికలుండరాదని, కోపము కలుగరాదని బోధించు చుందురు. జన్మల తరబడి సాధన చేసినను ఇవి వదలవు. పొందవలసిన సద్విషయములు పొందుటకు ప్రయత్నము చేయవలెను గాని, మరియొక మార్గము లేదు. కాలమును సత్కర్మల యందు వినియోగించు చున్నచో క్రమముగా తగ్గును. దైవ స్మరణ యందు మనస్సు, బుద్ధి లగ్నమైన వానికి భయ క్రోధములు స్పృశింపనైనా స్పృశింపలేవు. ప్రహ్లాదుడు, అంబరీషుడు అట్టి వారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మన శరీరము నందు మనతో పాటుగా దేవతా ప్రజ్ఞలు, రాక్షస ప్రజ్ఞలు ఉన్నవి. మనమెవరితో సహవాసము చేసిన మనయందు వారు బలపడుదురు. అసుర ప్రజ్ఞలతో సహవాసము చేసినచో వారు బలపడి, దేవతలను దమించి, మనలను నిరంతర దుఃఖమున నిలుపుదురు. మనము అధోగతికి వెడతామా, ఊర్ధ్వగతికి వెడతామా  నిర్ణయము మనదే. 

యజ్ఞార్ధ జీవనము, పరహిత భావము, సత్పురుష సమాశ్రయము గావించినచో వృద్ధి కలుగును. దేవతా ప్రజ్ఞలు సన్నగిల్లినచో జీవుని స్వభావము స్వామిత్వము వహించును. కావున మానవుడు సరియైన నిర్ణయము చేయుట మేలు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

రక్షణము లేక సాధుఁడు

రక్షితుఁడగు సమతఁజేసి రాయిడులందున్ 

రక్షణములు వేయి గలిగిన 

శిక్షితుఁడగు ఖలుఁడు పాపచిత్తుం డగుటన్.

సాధు ప్రవర్తనము గలవాడు తన సమభావము కారణముగ రక్షణము లేకయే రక్షింపబడును. పాపబుద్ధి గలవాడైన దుర్జనుడు వేయి రక్షణములు కలిగియున్నను శిక్షింపబడును.

తమ తమ ప్రవర్తనములే తమకు రక్షణము గాని, శిక్షణము గాని కలిగించును. అంతియే గాని, మరి ఏ యితరములు, కారణములు కావని తెలియవలెను.

*భాగవతము Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సాధారణముగా మానవులు బాహ్య ప్రపంచమున నిమగ్నులై ఉందురు. మునిగి యుందురు. ఇట్లు దినమంతయు సాగి, రాత్రి వేళకు ప్రజ్ఞ బలహీనపడును. నిద్ర ప్రకృతి అందించిన వరము. నిదుర నుండి లేచిన మానవ ప్రజ్ఞ మరల బహిరంగమున ఉత్సుకతో ప్రవేశించి, ఇంద్రియముల ద్వారా ప్రజ్ఞ బహిర్గత మగును. 

ఇంద్రియ విషయముల కన్నా రుచికరమైన విషయము ఒకటున్నదని తెలియడం వలన చిల్లర విషయముల యందు ఆసక్తి తగ్గుచుండును. సత్సాంగత్యం, సద్గురుబోధ, సద్గ్రంథ పఠనము వలన దైవము నందు రుచి పెరుగును. దైవము నందు రుచి పెరుగుట దైవానుగ్రహమే. బాహ్య జీవితమున కర్తవ్య నిర్వహణము మాత్రమే నిర్వర్తించుట ఒక దీక్షగా గైకొనవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము.

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఊరక రారు మహాత్ములు

వా రథముల యిండ్లకడకు వచ్చుట లెల్లం

గారణము మంగళములకు

నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా!

ఎవరి గృహములకు మహాత్ములు వత్తురో వారి యిండ్లలో శుభ పరంపర ప్రారంభమగును. మహాత్ములను గృహములకు ఆహ్వానించుట, సత్కరించుట, పూజించుట, వారి ఆశీర్వచనము పొందుట మిక్కిలి మంగళ ప్రదము. భాగవత సంప్రదాయమున అత్యవసరముగ  పాటింప వలసిన విధి.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

అసత్యము లాడు వారు ముందుతరముల వారిని ఊర్ధ్వలోకములనుండి పతితులను చేయగలడు.

 సంపాదన విషయమున అసత్యము లాడువాడు పుట్టినవారిని, పుట్టబోవు వారిని అదృష్ట హీనులుగా చేయగలడు.

భూమి కొరకు అసత్యము లాడువాడు, తన వారి కొరకు అసత్య మాడువారు తన వారితో సహా నశించును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జీవుడు ఆహారమును అనేకరకములుగా స్వీకరించు చున్నాడు. కేవలము భోజనమే ఆహారమను కొనరాదు. పంచేంద్రియముల నుంచి, మనస్సు నుంచి (భావముల నుంచి) రకరకములైన విషయములను తన లోపలికి మనిషి స్వీకరించు చున్నాడు. ఇక్కడ ఆహారము వాసనా పరముగా ఉండును. ఈ వాసనలను  జీవుడు జన్మ జన్మలలో ప్రోగుచేసుకొని తనతో తెచ్చుకుని చుండును. 

ఈ వాసనల విసర్జనమే నిజమైన నిరాహార దీక్ష. ఆత్మతత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగా సాగినచో ఆత్మ జ్ఞానము నందు రుచి కలుగును. ఇంద్రియార్థ విషయములను స్వీకరింపనట్టి దేహము కలవాడై ఉండును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

పొడగంటి నిన్ను, బ్రతికితిఁ

గడచితి నాపదల నింకఁ గార్యములందే 

యెడమడుగులేని నెచ్చెలిఁ

బొడకాంచుట చచ్చి మరల బుట్టుటగాదే.

నందుని చూచిన వసుదేవుడు ఈ వాక్యమును పలికెను. సామాన్యముగా ప్రాణ స్నేహితుని జూచిన, హృదయము పొంగి ఆనందము కలుగును. నందుడు వసుదేవునికి కేవలము ప్రాణస్నేహితుడే గాక, బ్రహ్మవేత్త కూడా! బ్రహ్మ వేత్త ప్రాణస్నేహితుడగుట మహద్భాగ్యం. అట్టి వానిని చూచిన చాలును. సమస్తమైన ఆపదలు నివారింపబడును. కార్యములు సుగమమగును. చచ్చిన వానికి మరల పుట్టినంత ఉత్సాహము కలుగును.

మహాత్ములను, పుణ్యమూర్తులను కోరి సందర్శించవలెను. అవకాశమున్నచో వారి సంభాషణము వినవలెను. పాద స్పర్శ నంది కృతార్థులు కావలెను. భగవద్ అనుగ్రహప్రాప్తికి ఇది ఒకమార్గము.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్ గ్రంథ పఠనము వలన సమస్త విషయముల యెడల రాగద్వేషములు తొలగిపోవును. లోతులు పెరుగు చుండును. ధీరత్వము లభించును. అంతఃకరణము స్వచ్ఛమై పరమాత్మ దర్శనమునకు అవకాశ మేర్పడును. నోటినుండి అశ్లీల పదములు  వెలువడవు. వ్యాధులు మనస్సును చలింప జాలవు. జీవుడు ముక్తుడగుటకు స్వాధ్యాయము జరుగ వలెను.

నేను, నావారు, ఇతరులు  అను భ్రమలన్నియు ప్రతి నిత్యము విసర్జించుటకు శాస్త్రాధ్యయనము అవసరము. ఇది ఉత్తమ సదాచారము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

కష్ట కాలమున దైవభక్తులు ఇనుమడించిన భక్తితో ప్రార్థనలు చేయుదురు. కష్టములు, నష్టములు భగవద్ భక్తులకు భగవంతుని చేరుటకే ఉపయోగపడును. సన్నివేశములు భక్తులను పరీక్షించుటకై ఏర్పడును. అట్టి సమయమున ఆరాధనలను విసర్జింతురు. సమస్య గురించి ఎక్కువగా భావించి, దైవారాధనము మానుట వలన దైవ బలము తగ్గి, చిక్కులను సృష్టించుకొందురు. 

సమస్యలు పరిష్కారము కాకపోగా, భగవద్భక్తి గూడా సన్నగిల్లును. భక్తులు మాయలో పడుటనగా ఇదియే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నా యోగము చేయువారికి భావములలో స్వచ్ఛత పెరిగి, మానసిక అభివృద్ధి ఉండును. ఇంజను బావుంటే బండి బాగా నడుస్తుంది. ఇంజను బావుండక, బండి బావుంటే ఉపయోగము లేదు. నా ఈ యోగ రహస్యమును తెలుసుకొని ప్రార్థన చేయవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

అయస్కాంత సన్నిధిలో ఇనుపముక్క అయస్కాంత మగునట్లు, సత్పురుషుని సన్నిధిలో మనిషి మహాత్ముడు కాగలడు. ఈ సులువు తెలిసిన వారు బుద్ధిమంతులు. వారు సద్గురు దర్శన, స్పర్శన, సంభాషణముల ద్వారా తరింతురు. 

ఈ సంప్రదాయమందలి ఏకైక నియమము గురువాక్య పాలనయే. గురువందించిన సాధన చేయుచు, గురు బోధనలను నిరంతరము పఠించుచు, గురు వాక్యములను నిర్వర్తించుట శిష్యులందుకొనవలసిన దీక్ష. అట్టి శిష్యులు వారి దీక్షను బట్టి గురు సాన్నిధ్యమును ప్రతి పౌర్ణమి నందును పొందగలరు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మన దగ్గర ఉన్న సంపద వెదజల్లితే అవి విత్తనాలై అందులో నుంచి వృక్షాలు తయారై కొన్ని వేల ఫలాలను అందిస్తాయి. ఎంత మనము దానము చేస్తే సృష్టి దానికి పదింతలు ఇస్తుంది. సృష్టి మీద, సృష్టి ధర్మము మీద నమ్మకము ఉండాలి. నీ దగ్గరున్న విద్య, ధనము, శక్తి సామర్థ్యాలను పదిమంది కోసము వాడితే అది కొన్ని రెట్లు అయి సృష్టి నీ కిస్తుంది.  ఆకలిగా ఉన్నవాడిని గుర్తించి, అన్నము పెట్టిన కుటుంబము ఏడు తరాలు రక్షింపబడుతుంది. 

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భాగవత మార్గము నిరాహంకార మార్గము. దైవమే సర్వమును నిర్వర్తించు చున్నాడని, తాను నిమిత్తమాత్రుడనని నమ్మినవాడు నిజమగు భక్తుడు. అట్టి భక్తునకు జీవిత సన్నివేశములన్నియు దైవ సంకల్పమే అనిపించు చుండును. తన వంతు కర్తవ్యమును కూడా దైవమునే స్మరించుచూ నిర్వర్తించు చుండును. అట్టివాడు మాయలో పడినను, భగవదనుగ్రహ కారణముగా బయల్పడును.

*Master K.P.K.*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నీ నా అనుబంధమున నీ మేధస్సు క్రమముగా అభివృద్ధి చెందును. ఇది బజారులో ధనముతో కొనగలిగిన విషయము కాదు. నీకు నేను సూటిగా విద్యలన్నియు నేర్పెదను. నీవు బ్రహ్మము అగువరకు నా యందు విద్యార్థిత్వమును నెరపుము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

నిర్మల హృదయము శుద్ధస్ఫటికము వలె ప్రకాశించును. స్ఫటికము పారదర్శకముగ ఉండును. అట్లే మానవ హృదయమున మర్మము లేనపుడు అది శుద్ధ స్పటికము వలె మెరయును. ఓం కారము చేయగానే హృదయాకాశ మంతయు శుద్ధ స్ఫటికము వలె గోచరించును. 

అంతర్దర్శములు, అంతరానుభూతులు పొందుటకు ప్రయత్నించువారు ప్రాథమికముగా నిర్మలహృదయులై ఉండవలెను. నిర్మల హృదయమావిష్క రింపబడు వరకు అంతరంగమున ఓంకారమును స్మరించుట సాగవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

ప్రార్ధన యందలి నిరంతరత్వము, శ్రద్ధలను బట్టి  నీ సమస్యలకు పరిష్కారము లభించు చుండును. ప్రార్ధన యందు అంతః చక్షువుతో లోపల జరుగు కదలికలను దర్శించుటకు ప్రయత్నింపుము.

                        *ఇది నా మాట*

Master K.P.K.🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఆధ్యాత్మిక స్ఫూర్తి గల వారికి కావలిసినది దిశానిర్దేశము, ప్రోత్సాహము. స్ఫూర్తి కలిగించు కార్యక్రమము జీవునికి దేవునికి గల సంబంధమును బట్టి ఉండును. ఒక సత్కార్యమును వీక్షించు చున్నప్పుడు, ఒక సద్భోదను వినుచున్నప్పుడు అందరికీ స్పూర్తి కలుగదు. స్పూర్తి కలిగిన వారిలో కొందరు దిశానిర్దేశమునకు తపన చెందుదురు.

దిశానిర్దేశము పొందినవారు ప్రాథమికంగా ప్రోత్సాహమునకు ఎదురు చూతురు. ఇట్టి వారికి సహాయము చేయుట ఒక పవిత్ర ధర్మము. అది యజ్ఞార్థముగ నిర్వర్తింపబడ వలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సృష్టికథ మధ్యమున మానవు డవతరించినాడు. అతనికి దైవము స్వతంత్ర బుద్ధి నిచ్చెను. స్వతంత్ర బుద్ధిని బాధ్యతయని ఎరిగి నిర్వర్తింపవలెనే గాని, హక్కుగా భావించి దుర్వినియోగము చేయరాదు. అతడు జరుగుచున్న కథలో తన వంతు కర్తవ్యమును నిర్వర్తించినచో ఉత్తీర్ణుడగును. 

చేయుపనుల యందు అవకతవక లుండి, వాని నుండి కర్మఫలములు పుట్టి, ఋణ రూపము ధరించి, కర్తవ్యములై కాలము రూపమున సమీపించును. తన సంకల్పములే తన బంధనములకు కారణమని తెలియుటకు కొన్ని జన్మలు పట్టవచ్చును. 

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

కోరికలుండరాదని, కోపము కలుగరాదని బోధించు చుందురు. జన్మల తరబడి సాధన చేసినను ఇవి వదలవు. పొందవలసిన సద్విషయములు పొందుటకు ప్రయత్నము చేయవలెను గాని, మరియొక మార్గము లేదు. కాలమును సత్కర్మల యందు వినియోగించు చున్నచో క్రమముగా తగ్గును. దైవ స్మరణ యందు మనస్సు, బుద్ధి లగ్నమైన వానికి భయ క్రోధములు స్పృశింపనైనా స్పృశింపలేవు. ప్రహ్లాదుడు, అంబరీషుడు అట్టి వారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జీవుడు జన్మించుటకు ముందు క్షణమున, గర్భమున చేసిన ప్రార్థనలు కారణముగా వారిని ఒక దివ్య చైతన్య కిరణము స్పృశించును. మంచి చేయవలెనని, మంచిగా ఉండవలెనని ప్రతి జీవియు భావించుచు జన్మించును. కాని ఆ భావములు పరిసరముల వికారముల వలన బలహీన పడును. మరల మరణించు సమయుననే తనకు తన ప్రథమ కర్తవ్యము గుర్తుకు వచ్చును. మరల జన్మించు వరకు గుర్తుండును.

జన్మించిన వెనుక మరచును. ఇది జీవుని సమస్య. గురువు వచ్చి గుర్తు తెలిపినను, మరల మరల మరచు చుండును. ఆచరణ యందు గుర్తు లేని విద్య అక్కరకు రాని చట్టమే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

యోగసాధనము వేరుగను, యోగ జీవనము వేరుగను భావించువారు అజ్ఞానమున పడినవారు. యోగసాధన పేరిట వారు మోహం చెంది మాయలో పడుదురు. అన్నిట, అంతట దైవమే నిండి ఉన్నప్పుడు చూచుట దైవమును చూచుటగనే ఉండవలెను. వినుట దైవమును వినుటగానే ఉండవలెను. సేవ చేయుట దైవమునకే అని తెలిసి ఉండవలెను. తనకు సేవ చేయు వారి రూపములో కూడా దైవమే ఉన్నాడని తెలియ వలెను. 

అర్జునునికి బోధ చేయు సమయమున కృష్ణుడు తాను అంతర్యామిగా బోధించెనేగాని, ఒక వ్యక్తిగా బోధించలేదు. ఇది సాధనల కన్నింటికన్నను ఉత్తమమైన సాధన. ఇట్టి వానికి దైవముతో అవినాభావ సంబంధమేర్పడును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

*కర్మ* అంటే మనము చేయదలచుకున్న పని. *కర్తవ్యము*  అనగా మనము చేయవలసిన పని. రెండింటికీ మనకు తేడా తెలియాలి. చేయదలచుకున్న పనులు గాక, చేయవలసిన పనులు మిగలాలి. 

అదే కార్యకర్మ. "యోగః కర్మసు కౌశలమ్" 

కర్మాచరణము నందు చేతికి ఏమీ

అంటకుండా అన్నిపనులు చేయగలగడము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవ స్ఫూర్తి కలవారే నిజమైన ధనికులు. దైవ స్ఫూర్తి లేని ధనికులు దైవ సామ్రాజ్యములో దరిద్రులు. ధనము కన్నా ధర్మము ముఖ్యము. ధర్మాత్ముడు దరిద్రుడైనను అంతరంగమున ధనికుడే. అంతరంగ భక్తి, బహిరంగ ధర్మము ఉన్నవారు పవిత్రులు. వారి యందు దైవముండును. 

సత్యము, దయ, వారి ప్రవర్తన యందు గోచరించును. ప్రశాంతత వారి నుండి వ్యాప్తి చెందు చుండును. ప్రపంచమున హింసలు, అసత్య ఆరోపణలు జరుగుచునే ఉండును. వాటిని స్మరించుట వలన అవి మిమ్మల్ని స్పృశింప గలవు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

అనవసరమగు భాషణము, తిరుగుడు విసర్జించి, కేవలము కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు సమయమును సద్వినియోగము చేసినచో  ప్రాథమికమైన వైరాగ్యము అబ్బును. దాని వలన మనస్సు చిందులు తొక్కక ఏకోన్ముఖమై ఉండి, సాధన సిద్ధించును. 

ఏది నిత్యము, ఏది అనిత్యము  అను విచక్షణ లేనపుడు వైరాగ్యమునకు తావులేదు. తానొక్కడే నిత్యుడు. దేహముతో పాటు తనకేర్పడినవన్నీ అనిత్యము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సాధకుని భావముల దివ్యత్వమును బట్టి, పవిత్రతను బట్టి చేయు కార్యముల యందు నాణ్యత గోచరించు చుండును. అతడు చేయు పనుల యందలి ప్రశాంతత, పవిత్రత అతను ఉన్న స్థితిని తెలుపును. 

తాను ప్రశాంతుడైనచో తన నుండి వ్యక్తమగు దివ్యకార్యములు ఇతరులకు ప్రశాంతత నిచ్చును. తన యందు కలుగు దివ్య సంకల్పమునకు  బలము చేకూర్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మృత్యువు మూడు దశలలో నుండును. ఒకటి భౌతికము. భౌతిక శరీరమును విడుచుట. రెండవది సూక్ష్మము. అనగా సూక్ష్మ దేహమును వదలునపుడు  ఇంద్రియ లోకములకు సంబంధించిన బంధములు తెగును. మూడవది కారణ శరీరము విడచు నపుడు  భావ బంధములు తెగును. భౌతిక బంధములు, ఇంద్రియ బంధములు, భావ బంధములు విసర్జించుట ఎవరికి జరుగునో అతడు ముక్తుడై జీవించును.

మృత్యువు దేహమునకు గాని, జీవునకు గాదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భక్తి రెండు విధములు. అవి ముఖ్యభక్తి. గౌణభక్తి. ముఖ్యభక్తి అనగా భగవంతుని యందు ఆసక్తి, ప్రేమ, అనురక్తి. దైవ స్మరణకు మరియొక కారణముండదు. ఎప్పుడును మనస్సు దైవము వైపునకు లాగుచుండును. ఇతర విషయములపై మనస్సు అంతంత మాత్రమే లగ్నమగును. నిత్యజీవితమంతయు భగవత్ పరముగనే ఉండును.

భజించుట, కీర్తించుట, పూజించుట, గుర్చుంచుకొనుటకు ప్రయత్నించుట వంటి భక్తి గౌణభక్తి. అనగా భగవంతుని కొంత సమయము స్మరించుట, ఇతర సమయముల యందు తమదైన విషయముల యందు నిమగ్నమగుట ఉండును. ఈ భక్తి సర్వ సామాన్యము. భగవంతుని యందు ప్రేమ జనించినపుడే ముఖ్య భక్తి అను బీజము అంకురించును. అవసరములకై భగవంతుని ప్రార్థించు వారికి గౌణభక్తియే మిగులును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

అహింసకు ప్రేమయే మూలము. తమ జీవన సౌఖ్యమునకు జీవములను హింసించుట అధర్మము. వృక్షములను, పశువులను, పక్షులను, మానవులను హింసించ కుండుట మన కర్తవ్యము. 

సమస్త జీవులు దైవ రూపమే కాబట్టి జీవులను హింసించుట దైవమును హింసించుటయే అగును. జంతువులను బలి ఇచ్చి, దైవమును మెప్పించు చున్నామని భావించుట దురాచారము. 

Master K.P.K🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నాతో నీ అనుబంధము నిన్ను అనంతమగు శక్తికి, జ్ఞానమునకు వారసుని చేయును. ప్రార్థన యందు ఈ శక్తిని బడసి, జీవుల సేవకుడిగా ఉండుటయే నీ కర్తవ్యము. అనేక విధములైన సేవలు నిర్వర్తించుటకు నీవు సమర్థుడవు కాగలవు. నిజమునకు నీవు ఒక చక్రవర్తి కుమారుడగ అభయముతో మెలగవచ్చు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

శ్రద్ధ అనగా పరిపూర్ణ ఆసక్తితో కూడిన ఆచరణ. ఆసక్తి పూర్ణముగా ఉన్నచో మనసు పరిపూర్ణముగా ఒక పని యందు అర్పింపబడును. శ్రద్ధ గల మనసు సంయమము అను శక్తిని పొందును. ఎపుడైనను, ఎచట అయినను సూటిగా విషయములు గోచరించుట, అవగాహన అగుట ఉండును. సూక్ష్మమగు విషయములు గూడ సులభముగా అర్ధమగును. 

శ్రధ్ధ గలవానికి ఎదుటనున్న కర్తవ్యమే దైవము. శ్రద్ధ అను గుణము చిన్నతనముననే నేర్చినవారు కార్యములందు సులభముగ విజయమును సాధింపగలరు. మరపు గల వారందరు శ్రద్ధ లేనివారే. నిజమునకు *శ్రద్ధ* అను గుణము సమస్తమగు సిద్ధులను సాధింపచేయును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః**🙏

సంసారము అనగా సంసరణము చెందుట వలన కలుగు బద్ధత.  సంసరణ మనగా జారిపోవుట. ఇది మొహము వలన  కలుగును. మోహము మమకారమునకు  దారితీయును. మమకారము రాగద్వేషములకు దారితీయును. 

మోహము మాయ వలన కలుగును. మాయ నుండి పుట్టిన వారే సర్వజీవులు. సృష్టి యందు ఏ మోహము లేనివానికి ఏ భావ బంధము ఉండదు. తీరని కోరికల కారణముగా మరికొన్ని జన్మలు కలుగుచునే ఉండును. దీనికి అంతులేదు. పరిష్కారము కూడా దైవమే.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

ప్రార్థన నిర్వర్తించడం వలన క్రమముగ నిలకడ లభించును. మనస్సు సహకరించి స్థిరత్వము సిద్ధించును. ప్రార్థన నిత్యము సాగినచో కోరికలు సన్నగిల్లి, కర్తవ్యోన్ముఖత్వము పెరుగుచుండును. కర్తవ్యకర్మ, యజ్ఞార్థ కర్మ మాత్రమే చివరికి మిగులును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

గరుత్మంతుడు ఒక్కడే. సర్పములు అసంఖ్యాకములు. జీవుడొక్కడే, అతని స్వభావమున కలుగు భోగ భావములు అసంఖ్యాకమలు. గరుడుని వలె జీవునది ఒంటరి పోరాటము. ఒక సర్పమును వదిలించు కొనిన మరియొక సర్పము పట్టుచుండును. ఒక భావము నుండి విడుదల చెందిన జీవుడు మరియొక భావమున పడుచుండును.

 ఈ ఘర్షణ జన్మల తరబడి సాధకునకు జరుగుచుండును. అయినను సాధకుడు సహనముతో ప్రయత్నించు చుండవలెను. మరియొక మార్గము లేదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

సుఖమునకు గాని దుఃఖమునకు గాని ఎవరును కారణము గాదు. సుఖమందించిన వారిని మంచివారని, దుఃఖమందించిన వారిని చెడ్డవారని భావించుట భ్రాంతి. అది మనస్సు కారణముగా ఏర్పడుచున్నది. మన సుఖ దుఃఖములకు మనమే కారణము. లోకులు కాదు. 

లోకులే కారణమని గావించి మరికొన్ని అవివేకపు కార్యములు చేయగూడదు. స్వభావమును బట్టి సుఖ, దుఃఖములు ఉండును. ఆత్మనియతి తోనే మనసు నందలి సుఖ దుఃఖములను జయించవచ్చును.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

ప్రార్థనకు విశ్వాసము ముఖ్యము. విశ్వాసమే శ్వాసగా మీ జీవితము సాగవలెను. చెప్పినది చెప్పినట్లు చేసినచో నేనిచ్చిన వాగ్దానము నెరవేరును. తర్కముల వలన ప్రయోజనము లేదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

క్రమశిక్షణముతో కూడిన మనసు గల సాధకుడే సక్రమమైన సేవలను అందించ గలడు. క్రమశిక్షణము లేనిచో దీర్ఘకాలము ఒకే విధమైన భక్తి శ్రద్ధలతో పని చేయలేరు. 

మనసుకు శిక్షణ ఇచ్చి, సద్భావములకు కార్యరూపము నిచ్చి, శ్రద్ధతో అనుసరించుట జరుగుచుండవలెను. ఇట్లు చేసినప్పుడు ఒక విశిష్టమైన ప్రజ్ఞ మీ యందు మేల్కొనగలదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

పంచభూతములందు వాయువు నాలుగవది. అది నాలుగవది యైన బుద్ధిలోకమునకు, మనలోని నాలుగవదియగు అనాహత కేంద్రమునకు సంబంధించినది. భూమి, జలము, అగ్ని అను మూడును వాయువు నుండి పుట్టుచున్నవి. వాయువు ఆకాశము నుండి పుట్టుచున్నది.

వాయువును చేరిన జీవప్రజ్ఞ క్రమముగ అంతఃకరణ శరీరమును నిర్మాణము చేసుకొనుచుండును. హృదయమున జరుగు సూక్ష్మ శరీర నిర్మాణము గొంగళి పురుగు, సీతాకోకచిలుకగ మారు ప్రక్రియ వంటిది. హృదయపుగుహ చేరుటకు అర్హతలు ఏమనగా ఆత్మావలోకనము, ఆత్మ విమర్శ, పరహిత బుద్ధి, స్వాధ్యాయము, దైవమును గూర్చిన ప్రార్థనాదికములు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సర్వ వ్యాపకుడగు దైవమునకు మన జీవనావాసరము లన్నియు తెలియును. వాటి కొరకై ప్రార్ధించుట అవివేకము. దైవ సాన్నిధ్యము కొఱకే ప్రార్థించుట నిజమగు వివేకము. అంతర్ముఖులై హృదయమున చేరి, దైవమును ప్రార్థించుట సదాచారము. 

నిజముగ దైవమును ఆశ్రయించిన వాడు మరి ఎవ్వరిని ఆశ్రయించ పనిలేదు. ప్రార్థన భక్తునికి, భగవంతునికి నడుమ వంతెన వంటిది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 6, 2025_*  🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *విదియ* రా12.54

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *మృగశిర* ఉ11.59

యోగం: *సాధ్యం* ఉ7.07

&

*శుభం* తె4.12

కరణం: *తైతుల* మ1.59

&

*గరజి* రా12.54

వర్జ్యం: *రా7.52-9.23*

దుర్ముహూర్తము: *ఉ6.19-7.48*

అమృతకాలం: *రా1.09-2.39*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *6.20*

సూర్యాస్తమయం: *5.21*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   ☘️🇮🇳🚩🙏🚩🇮🇳☘️

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ధనము, సంపద ప్రోగుచేసుకొను ప్రవృత్తి యున్నచో తీరుబడి లేక  ప్రపంచమున మునిగి యుందువు. 

కర్తవ్యమున సదా నిలచి యుండనిచో జీవన పరిస్థితులు తరచు గుర్తునకు వచ్చి స్వభావమునకు లోనగుట జరుగును.

మనను గూర్చిన విచారమున మునిగియున్నచో హృదయము దుర్భరమగును. 

ఏకాంతము అభ్యసింపనించో మనయందలి పంచభూతములకు అలజడి ఏర్పడి, ప్రశాంతత యుండదు.

ఇహ పర సుఖములకు రెంటికిని ధీరత్వమే ప్రధానమై యున్నది. ఈ సూత్రములను ఏర్పరచుకొని జీవించుట ముఖ్యము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 5, 2025_*  🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *పాడ్యమి*

మర్నాడు తె3.04

వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

నక్షత్రం: *రోహిణి* మ1.34

యోగం: *సిద్ధం* ఉ10.14

కరణం: *బాలువ* సా4.07

&

*కౌలువ* మ3.04

వర్జ్యం: *ఉ.శే.వ.7.35 వరకు*

&

*రా6.47-8.17*

దుర్ముహూర్తము: *ఉ8.32-9.16*

&

*మ12.12-12.56*

అమృతకాలం: *ఉ10.35-12.04*

&

మర్నాడు *తె3.45-5.15*

రాహుకాలం: *ఉ10.30-12.00*

యమగండం: *మ3.00-4.30*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *వృషభం*

సూర్యోదయం: *6.20*

సూర్యాస్తమయం: *5.21*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ధనార్జనము, అసత్యభాషణము కవల పిల్లల వంటివి. ధనమున్న చోట అసత్యభాషణము మిక్కుటముగా ఉండును. అమ్మకము, కొనుగోలుల యందు అసత్యమే ప్రధానముగా తాండవ మాడుచుండును.  వ్యాపారము పేరున తెలివిగ దొంగలించుట కూడా దొంగతనమే. 

ధనము కలిగించు పతనము మరి ఏదియు కలిగించలేదు. మంత్రములు, వేదములు, భక్తి, యోగము అను అత్యుత్తమ అంశముల చుట్టును ధనము చేరినచో సమస్తము భ్రష్టమగును. దివ్యమైన విషయములకు ధనము ఒక యోజనము దూరముండవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

క్రమశిక్షణ పొందిన మనసునకు, క్రమశిక్షణ లేని మనసునకు యోగ సాధనమున చాలా వ్యత్యాసము ఉండును. క్రమశిక్షణతో కూడిన మనసు పటిష్టమగు నావ వంటిది. జీవితము అను సాగరమున పయనించునపుడు మనస్సును పటిష్టమగు నావ ఆవలి గట్టుకు చేర్చును. 

చాలా మంది సాధకులు మనో పటిష్టతకు గల విశిష్టతను గుర్తింపరు. వీరికి సాధన యందు చాలా అంతరాయములు కలుగుచుండును. నిర్మలమగు మనస్సుతో పటిష్టమగు వేదికను ఏర్పరచుకొనవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

ఎవరికైనా అస్వస్థతగా ఉన్నప్పుడు నన్ను స్మరించి, నాతో ముడిపడి ఆకాశపు నీల కాంతిని నీ ఆజ్ఞా కేంద్రము నుండి రోగికి ప్రసరింప చేయుము. నేను, నీవు, రోగి ఒక త్రిభుజమై యెట్టి వ్యాధులనైనను నివృత్తి చేయవచ్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 8, 2025_*  🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *చవితి* రా9.20

వారం: *ఇందువాసరే*

(సోమవారం)

నక్షత్రం: *పునర్వసు* ఉ9.25

యోగం: *బ్రహ్మం* రా10.55

కరణం: *బవ* ఉ10.09

&

*బాలువ* రా9.20

వర్జ్యం: *సా5.08-6.40*

దుర్ముహూర్తము: *మ12.13-12.57*

&

*మ2.26-3.09*

అమృతకాలం: *ఉ7.08-8.39*

&

*రా2.23-3.56*

రాహుకాలం: *ఉ7.30-9.00*

యమగండం: *ఉ10.30-12.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *6.22*

సూర్యాస్తమయం: *5.22*

 ⚜️ *సంకష్టహర చతుర్థీ* ⚜️

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   🔱🇮🇳🚩🙏🚩🇮🇳🔱

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

అనవసరమగు భాషణము, తిరుగుడు విసర్జించి, కేవలము కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు సమయమును సద్వినియోగము చేసినచో  ప్రాథమికమైన వైరాగ్యము అబ్బును. దాని వలన మనస్సు చిందులు తొక్కక ఏకోన్ముఖమై ఉండి, సాధన సిద్ధించును. 

ఏది నిత్యము, ఏది అనిత్యము  అను విచక్షణ లేనపుడు వైరాగ్యమునకు తావులేదు. తానొక్కడే నిత్యుడు. దేహముతో పాటు తనకేర్పడినవన్నీ అనిత్యము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

నగవుల నవిద్యపోడిమి, నగుబాటుగ జేయనేర్చు నగవరి యంతన్ 

నగుమొగముతోడ మెల్లన, నగుమొగములసతుల జూచి నగనేర్చె నృపా!

నవ్వులతోనే సకల విద్యలలోని సారమును గ్రహించి, పండితుల మనుకొనువారి గర్వమును హరించి, వారిని లోకులు పరిహసించునట్లు చేయగల నేర్పు గలవాడు శ్రీకృష్ణుడు.

అట్టి బాలకృష్ణుడు  చిరునవ్వు గల మోముతో తనను చూసి సంతసించువారిని చూసి నవ్వెనట. అత్యంత ఆకర్షణీయమైన శ్రీకృష్ణుని కన్నులు, నవ్వులు చూసి అందరును మోహపడిరి. ఆహా! లోకమునకు పిచ్చి యెంత హెచ్చుగా ఉన్నది? తాము వేరని, నేను వేరని భావించుచూ నన్ను చూసి నగుచున్న వీరిని చూడగనే నాకు నవ్వు వచ్చుచున్నది.

*భాగవతము Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 7, 2025_*  🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *తదియ* రా10.58

వారం: *భానువాసరే*

(ఆదివారం)

నక్షత్రం: *ఆర్ద్ర* ఉ10.34

యోగం: *శుక్లం* రా1.26

కరణం: *వణిజ* ఉ11.56

&

*విష్ఠి* రా10.58

వర్జ్యం: *రా9.59-11.30*

దుర్ముహూర్తము: *సా3.53-4.37*

అమృతకాలం: *లేదు*

రాహుకాలం: *సా4.30-6.00*

యమగండం: *మ12.00-1.30*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *6.21*

సూర్యాస్తమయం: *5.21*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   🌞🇮🇳🚩🙏🚩🇮🇳🌞

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సర్వ వ్యాపకుడగు దైవమునకు మన జీవనావాసరము లన్నియు తెలియును. వాటి కొరకై ప్రార్ధించుట అవివేకము. దైవ సాన్నిధ్యము కొఱకే ప్రార్థించుట నిజమగు వివేకము. అంతర్ముఖులై హృదయమున చేరి, దైవమును ప్రార్థించుట సదాచారము. 

నిజముగ దైవమును ఆశ్రయించిన వాడు మరి ఎవ్వరిని ఆశ్రయించ పనిలేదు. ప్రార్థన భక్తునికి, భగవంతునికి నడుమ వంతెన వంటిది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 6, 2025_*  🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *విదియ* రా12.54

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *మృగశిర* ఉ11.59

యోగం: *సాధ్యం* ఉ7.07

&

*శుభం* తె4.12

కరణం: *తైతుల* మ1.59

&

*గరజి* రా12.54

వర్జ్యం: *రా7.52-9.23*

దుర్ముహూర్తము: *ఉ6.19-7.48*

అమృతకాలం: *రా1.09-2.39*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *6.20*

సూర్యాస్తమయం: *5.21*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   ☘️🇮🇳🚩🙏🚩🇮🇳☘️

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవము అంతటా నిండి యున్నప్పుడు చూచుట దైవమును చూచుటగనే ఉండవలెను. వినుట దైవమును వినుటగనే ఉండవలెను. సేవ చేయుట దైవమునకే అని తెలిసి చేయవలెను. 

అర్జునునికి బోధ చేయు సమయమున కృష్ణుడు తాను అంతర్యామిగా బోధించెనే గాని, ఒక వ్యక్తిగా బోధించలేదు. ఇది సాధనల కన్నిటికన్నను ఉత్తమమైన సాధన. జీవితమందు మిళితమైన సాధన.  ఇట్టి వానికి దైవముతో అవినాభావ సంబంధము ఏర్పడును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 12, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *అష్టమి* సా6.50

వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

నక్షత్రం: *పుబ్బ* ఉ8.33

యోగం: *ప్రీతి* సా4.00

కరణం: *బాలువ* ఉ6.47

&

*కౌలువ* సా6.50

వర్జ్యం: *సా4.02-5.42*

దుర్ముహూర్తము: *ఉ8.35-9.19*

&

*మ12.15-12.59*

అమృతకాలం: *రా2.01-3.41*

రాహుకాలం: *ఉ10.30-12.00*

యమగండం: *మ3.00-4.30*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *సింహం*

సూర్యోదయం: *6.24*

సూర్యాస్తమయం: *5.23*

    🙏 *కాలభైరవాష్టమి* 🙏

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దినచర్యలో తనకు గోచరించు సమస్త జీవుల యందును, వస్తువుల యందును, ప్రకృతి యందును దైవమును దర్శించుట నిజమగు వాసుదేవోపాసన. ఇట్టి సాధన చేయువారికి దినచర్యయే యోగసాధనగా సాగును. యోగజీవనము అలవడును.

 ఇట్టి వారు ప్రత్యేకముగ క్రతువులు, ఆరాధనలు, అభిషేకములు, హోమములు చేయు అగత్యము లేదు. చేయుట వారి ముచ్చట. యోగసాధనము వేరుగా, యోగజీవనము వేరుగాను భావించువారు అజ్ఞానమున పడినవారు. వారు యోగసాధన పేరిట  మోహము చెంది మాయలో పడుదురు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 11, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *సప్తమి* సా6.44

వారం: *బృహస్పతివాసరే*

(గురువారం)

నక్షత్రం: *మఖ* ఉ8.05

యోగం: *విష్కంభం* సా5.11

కరణం: *భద్ర* ఉ6.57

&

*బవ* సా6.44

వర్జ్యం: *సా4.14-5.52*

దుర్ముహూర్తము: *ఉ10.03-10.47*

&

*మ2.27-3.11*

అమృతకాలం: *ఉ7.17 వరకు*

&

*రా2.01-3.39*

రాహుకాలం: *మ1.30-3.00*

యమగండం: *ఉ6.00-7.30*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *సింహం*

సూర్యోదయం: *6.24*

సూర్యాస్తమయం: *5.23*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   🌼🇮🇳🚩🙏🚩🇮🇳🌼

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జీవుడు కర్మబద్ధుడు. కారణము ఫలాసక్తియే. ఫలము నందు ఆసక్తి గొన్న మనసును, కర్తవ్యము నందు ఆసక్తి కలుగునట్లు చేయుట ముఖ్యము. నిజమగు జ్ఞానము ఇదియే. చేయు విషయము నందు మోహము కలుగుట, ఆ కార్యములు తనవిగా భావించుట, అందలి ఫలితమును గూడా ద్రవ్య రూపమున గాని, కీర్తి రూపమున గాని తనకే దక్కవలె ననిపించుట యివన్నియు బంధములే. 

సత్కార్యములు చేయువారు కూడా బంధ విముక్తులు కాలేక పోతున్నారు. ఇది ప్రకృతి చేయు ఇంద్రజాలము. దానికి కృష్ణుడు అందించిన పరిష్కారము యజ్ఞార్థకర్మ లేక పరహితము.

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

*E.K.*           🕉️           *C.V.V.*

*卐  ఓం శ్రీ గురుభ్యోనమః  卐*

🌞 *_డిసెంబరు 10, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *షష్ఠి* రా7.08

వారం: *సౌమ్యవాసరే*

(బుధవారం)

నక్షత్రం: *ఆశ్లేష* ఉ8.06

యోగం: *వైధృతి* సా6.44

కరణం: *గరజి* ఉ7.36

&

*వణిజ* రా7.08

వర్జ్యం: *రా8.05-9.41*

దుర్ముహూర్తము: *ఉ11.30-12.14*

అమృతకాలం: *ఉ6.32-8.06*

&

మర్నాడు *తె5.40 నుండి*

రాహుకాలం: *మ12.00-1.30*

యమగండం: *ఉ7.30-9.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *6.23*

సూర్యాస్తమయం: *5.22*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   ☘️🇮🇳🚩🙏🚩🇮🇳☘️

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

కర్మ నిర్వహణము సక్రమముగా నిర్వర్తించాలి. కర్మ కారణముగా పుట్టేవారే ఎక్కువగా ఉంటారు. హరి భక్తి ఉన్నచోట కర్తవ్యము నిర్వహించడములో  ధర్మము తప్పే పరిస్థితి ఉండదు. కర్తవ్య కర్మ నిర్వర్తించేటపుడు వంకరచేయడం, సొంత లాభము కోసము తప్పుడు పనులు చేయడము వలన మరల కర్మ పెరుగుతుంది. అందుచేత తెమలదు. ధర్మాన్ని అనుసరించి నిర్వర్తిస్తూ ఉంటే పర్యవసానాలు రావు. 

కామ్యకర్మ వదిలేసి, కర్తవ్య కర్మే నిర్వర్తిస్తూ ఉంటే అట్టి వాడి కర్మ తొందరగా శిధిలమై పోతుంది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్గుణములు సహజముగా ఉండడం భగవత్ అనుగ్రహము. ఒక సద్గుణము ఆచరణలో ఉంటే మరియొక సద్గుణము చేరుతూ ఉంటుంది. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని నిర్వర్తించే పద్ధతిని బట్టి, త్రికరణ శుద్ధిని బట్టి మన దగ్గరకు సద్గుణములు చేరుతాయి. 

ఈ మూడింటి తోటి హితకార్యము చేస్తే సద్గుణములే దైవముగా మన యందు స్థిరపడతాయి. సద్గుణముల వలన మనకు, ఇతరులకు కూడా వికాసము కలుగుతుంది.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

మాస్టర్ *C.V.V.* మాట

భౌతిక శరీరము నుండి, సూక్ష్మ శరీరమును వెలికితీయుట, సూక్ష్మ శరీరము నుండి కారణ శరీరమును వెలికితీయుట తద్వారా అమరత్వమునకు చేరుకొనుట ఈ యోగమార్గమున జరుగును. ఈ మార్గము తెలిసిన వారికి జనన, మరణ రహస్యములు తెలియగలవు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవ జీవితములందు అజ్ఞానము వలన పొరపాట్లు జరుగుచుండును. పొరపడుట సహజమే. దానిని గుర్తించి అంగీకరించుట, పశ్చాత్తప్తులగుట వలననే ఎట్టి వారైనను మార్గమున నిలుతురు. పొరపాట్లను సమర్ధించు కొనువారికి దివ్యలోకముల ప్రవేశము ఉండదు. పశ్చాత్తప్తులను దైవము కరుణించి, అనుగ్రహించును.

 ఋజు వర్తనము, ధర్మప్రవర్తనము గలవారిని దైవమే కాపాడుకొనును. అసత్యభాషణము, మోసము నరక ద్వారములను తెరచును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నా యోగమున వాహిక అయిన శిష్యుడు తాను సమానాంతరముగ వ్యాప్తి చెందుచు, తన సాన్నిధ్య ప్రభావముచే తోటివారు కూడా ఊర్ధ్వముఖు లగుచుండ, వారితో పాటు తాను కూడా ఊర్ధ్వముగా ప్రయాణము చేయుట యుండును. దీనినే కుండలిని చైతన్యము మేల్కాంచుట అందురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విషధరరిపు గమనునికిని 

విషగళ సఖునికిని విమల విషశయునునికిన్ 

విష భవ భవ జనకునికిని 

విషచను విషము గొనుట విషమే తలపన్.

విషము గల పాములకు శత్రువైన గరుడుడు వాహనముగా గలవాడు, విషము మ్రింగి కంఠమున ధరించిన శివుని స్నేహితునిగా గలవాడు, విషము గల పామే శయ్యగా గలవాడు అగు శ్రీకృష్ణునికి పూతన విషపు చన్నుల నుండి వచ్చిన విషమును గొనుట కష్టమైన పనా? అది విషమమైన విషయము కాదు గదా!

విష భయము కలవారికి ఈ పద్యము ఎంతయో నుపకరించును.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శని గ్రహము మనకు పునాది రాయి. ఆయన మనలో మూలాధారములో ఉంటాడు. అక్కడ నుంచి కట్టుకొచ్చారు ఏడు అంతస్తులు. (షట్చక్రములు, సహస్రారము.) శని గ్రహము మనకు చాలా ఓపికనిస్తుంది. ఓపిక లేని వాడికి ఏదీ అందదు. శని మనలను మూడు ప్రశ్నలు అడుగుతాడు.

నువ్వు ఏదైనా సహించగలవా!

ఏదైనా భరించగలవా!

భూమికున్నంత క్షమ ఉన్నదా!

శని అనుగ్రహిస్తే ఇక అందరూ అనుగ్రహించినట్లే. 

స్వాధిష్ఠానములో కుజుడు, మణిపూరకములో చంద్రుడు, అనాహతములో శుక్రుడు, విశుద్ధియందు బుధుడు, ఆజ్ఞా చక్రమునందు సూర్యుడు, సహస్రారము నందు బృహస్పతి ఉంటారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జ్ఞానము నందు జిజ్ఞాస భగవద్ అనుగ్రహముగా లభించాలి. మన యందు జిజ్ఞాస ఉన్నదా! లేదా అని దైవము చూస్తాడు. తదనుగుణముగా నడిపిస్తాడు. అలాగే శిష్యుని జిజ్ఞాసను బట్టి గురువు ప్రతిస్పందిస్తాడు.అడిగిన వానికి, అడగని వానికి ఏమీ చెప్పడు. ఆకలి లేనివానికి అన్నము పెట్టినట్లవుతుంది.

జ్ఞానము వలన ఏది నిత్యం, ఏది అనిత్యము అనే విషయము తెలుస్తుంది. దేనితో కూడి లేకపోతే మనము అన్నీ ఉండి కూడా ఆనందము లేకుండా ఉంటాము అనేది తెలుస్తుంది. ఎంత జ్ఞానముంటే అంత సుఖము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

కలియుగ ఆరంభముననే శ్రీకృష్ణ పరమాత్మ బృందజీవనమునకు కావలసిన బీజములు స్థిరపరచి నాడు. బృందములు, బృందములుగనే తరించు మార్గమును సూచించినాడు. తన గురించి ఆలోచించు మానవుడు, తన శ్రేయస్సుకై, తన మోక్షమునకై  ఆరాధనలు చేయువారు అంతంత మాత్రముగనే అనుగ్రహము పొందుదురు. 

అందరి కొరకు *తాను* అను నిశ్చయ భావముతో , అందరి వృద్ధికై తపన చెందుచు, కృషి సల్పువారు అనూహ్యముగ, అమితమగు వికాసము చెందగలరు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఐదు ఇంద్రియముల నుండి (ఐదు ద్వారముల నుంచి)  ప్రజ్ఞ బాహ్యమునకు పరుగెత్తుచుండును. అపుడు మానవుడు నిర్వీర్యుడగును. ఐదు చిల్లుల గల కుండకు ఎంత జలమందించినను కుండ నిర్జలముగనే ఉండును. ఇట్లు మానవుడు ఇంద్రియార్థముల వెంట పరువెత్తుచు దుర్బలుడై కాలక్రమమున కృశించును. 

కనుక మనస్సు నందలి ప్రజ్ఞను అంతర్ముఖము చేయవలెను. అందుకొరకు కర్తవ్య నిర్వహణము  పూర్తియగు నంతనే మనస్సును శ్వాసతో చేర్చి హృదయమున స్థిరపరచ వలెను. ఇది నిజమగు సిద్ధి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భూమి మీద పుట్టడం అంటే ఏడు లోకములలో అతి నాసి అనే లోకములో పుట్టడము. భూమిపై మనము గొప్పవాళ్ళమని అనుకోవడానికి వీల్లేదు. సూర్య కాంతిలో ఏడవ వంతు కాంతి మాత్రమే భూమి మీద ఉంటుంది. అది గూడ మన ప్రవర్తనతో ఆర్పేసుకుంటున్నాము. భూమి కన్నా ఇతర గ్రహములు ఎక్కువ కాంతివంతములు. శుక్రుని కాంతి ఇక్కడ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. బుధుని కాంతి ఆరు రెట్లు ఎక్కువ. 

భూమి జనులకు ఉద్ధారణ కలిగించుట సామాన్యమైన విషయము కాదు. ఈ విషయము గురించే పరమగురువులు  ఎక్కువ కృషి చేస్తున్నారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మన ఎరుకతో సంబంధము లేకుండా నిర్వర్తింపబడుతున్నటు వంటి స్పందనముతో మనము కూడి ఉంటే, ఆత్మప్రజ్ఞ వలయమునకు దగ్గరగా ఉంటాము. స్పందనము సోహం శబ్దము చేస్తూ ఉంటుంది. అలా ఎక్కువ సమయము గడిపిన వారిని హంసలు అంటారు. ఆ స్పందన వారిని ఊర్ధ్వగతికి తీసుకొని వెళ్ళి సూక్ష్మ లోకాలను పరిచయము చేస్తుంది. కారణ లోకాలను పరిచయము చేస్తుంది. అంతేకాదు తనలో ఉన్న మూలమైన పరమాత్మ తత్త్వముతో అనుసంధానము చేస్తుంది.

కర్తవ్యము మేరకు పని చేసుకుంటూ, ఇతర సమయములో వాక్కుని, ఇంద్రియములను వృధా చేయకుండా పైన చెప్పినది నిత్య సాధనగా జరగాలి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నాతో నీ అనుబంధము నిన్ను అనంతమగు శక్తికి, జ్ఞానమునకు వారసుని చేయును. ప్రార్థన యందు ఈ శక్తిని బడసి సేవకుడిగా ఉండుటయే నీకర్తవ్యము. అనేక విధములైన సేవలు నిర్వర్తించుటకు నీవు సమర్థుడవు కాగలవు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శనీశ్వరుడు క్రమబద్ధత నిచ్చును. నూనెధారవలె నిరంతరత్వము నిచ్చును. ఒకే పనిని, ఒకే విధముగా ఒకే సమయమున దశాబ్దముల తరబడి నిర్వర్తించు శక్తి శని దేవుడే ఇయ్యగలడు. ఎచ్చట శని బలముగా ఉండునో అచ్చట కార్యములన్నియు సిద్ధించును. శని బలము లేనిచోట కార్యములకు శాశ్వతత్వం, స్థిరత్వము ఉండదు. నిరంతరత్వము, క్రమశిక్షణ కరువై ఉండును.

ఒక సత్కార్యము అవతరించి, భూమిపై దీర్ఘకాలము ప్రభావితముగా ఉండుటకు శనితరంగములు అవసరము. శని శిక్షణము, శని స్పర్శ లేకపోతే తిరుగుబోతుగా, మాటలనేర్పరిగ,  చిక్కక, దొరకక వ్యర్థుడగు ప్రమాదము ఉన్నది. శని లేని సౌరమండలము గూడ సూత్రము లేని గాలిపటము వంటిది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

పలు పాటులబడు జనులకు

నిలనొకచో నుండగలదె యేరుల వెంటన్

గలసి చనుమ్రాకు లన్నియు 

బలువెంటలబోవుగాక పాయక యున్నే.

నదీప్రవాహమున కొట్టుకొని పోవుచున్న దుంగలు వేటి దారిన అవి పోవునవే గాని ఎడబాయక వుండునా? అటులనే చపలచిత్తుల జీవితము నిలకడలేక, గమ్యము లేక, పలు శ్రమల నందుచు నశించును. తీరికలేక జన్మలెత్తుచు విధి వ్రాత పడి సాగిపోవు చుండును. అట్టి వారికి నామస్మరణే తరుణోపాయము. 

భాగవతము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దేహము ధర్మ సాధనమునకు వినియోగించుట తెలియనప్పుడు  జీవుడు బంధింపబడు చున్నాడు. తెలిసినప్పుడు మోక్షము. తెలియనిచో బంధము. 

ప్రకృతిని గూర్చిన విజ్ఞాన మెరిగి, తనను గూర్చిన జ్ఞానమెరిగి జీవించువానికి ఏమియును బంధము కాదు. దేహము లేకుండుట కన్నా దేహముండుట సదుపాయము. దేహమును సమర్ధతతో నిర్వహించుట మరియొక సదుపాయము. జీవుడు బుద్ధి నదిష్టించి దేహమును పాలించినచో జీవితము కళ్యాణప్రదమై, వైభవోపేతమై యుండును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

అంతరంగమున సద్గురువు నందు నిర్లక్ష్యము చోటు చేసుకున్నచో ఆత్మవికాసమునకు గల అవకాశములు జారిపోవును. సద్గురువును నిరాకరించుచు అతనిని అనుసరిస్తున్నట్లుగ జీవించు వారి వలన అపాయములు సంభవించును. గురు శిష్య సంప్రదాయమున అచంచలమగు విశ్వాసము ప్రధానము. అట్టి విశ్వాసమునకు విఘాతము కలిగించుట కలియుగ లక్షణము. 

తత్కారణముగా అత్యంతపవిత్రమగు గురు శిష్య సంప్రదాయము నశించు అవకాశమున్నది. దీనిని అరికట్టుటకు పరమ గురువులు కృషి చేయుచున్నారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శుభాశుభ విషయములు వచ్చిపోవు చుండును. సమస్త సన్నివేశములు కాలప్రభావమున ఒకింత సేపు ఉండి, అటుపై లేకపోవును. అట్టి వానియందు ఆసక్తి కలిగి యుండుట లేక అనాసక్తి కలిగి యుండుట తెలియని తనమే. వాని యందు తాత్కాలికముగా ప్రతిస్పందించి మరచు వాడు స్థిత ప్రజ్ఞుడు.

స్థిత ప్రజ్ఞ అను బుద్ధి ఆత్మతత్త్వము నందు రతిగొనుట వలన చిల్లర విషయముల యందు ఆసక్తి గాని, అనాసక్తి గాని  యుండదు. ఇదే స్థితప్రజ్ఞుని లక్షణము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవారాధనము ధర్మ ప్రవర్తనకు దారి చూపును. ధర్మ ప్రవర్తన లేని దైవారాధన వలననే దైవము పైన విశ్వాసము సన్నగిల్లుచున్నది. కాని ధర్మప్రవర్తనముతో కూడి  దైవారాధనము చేయుచున్న వారు కూడా భూమిపై బహు సంఖ్యాకులున్నారు. వారి ప్రార్థనల వలనే ఊర్ద్వము, సూక్ష్మము అగు లోకముల నుండి సహాయ సహకారములు అందుచున్నవి. 

స్వప్రయోజన కాంక్ష లేకుండా వారు చేసే ప్రార్థనల వలననే ఈ భూమి నిలచి ఉన్నది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

స్ఫూర్తి అనునది సున్నితమగు విషయము. స్పూర్తి  గలవారికి ఆటుపోట్లు ఎక్కువ. ఊర్ధ్వము, ఉత్తమము అగు లోకముల కేగుచున్న కొద్ది రకరకముల తాకిడి, ఒత్తిడి పెరుగుచుండును. లతా గుల్మములకు ఎట్లు ఆసరా ఉండవలెనో అట్లే ఆత్మస్పూర్తికి కూడా లోబలము అత్యవసరమై ఉన్నది. 

సున్నితము, సూక్ష్మము, దివ్యము అగు విషయములకు ప్రకృతి యందు రక్షణమున్నది. దివ్యమగు బోధనలను, గ్రంథములను, పురుషులను ప్రకృతియే రక్షించు చుండును. దివ్యత్వము రక్షణ కొరకై వెదకి కొనదు. దానిని రక్షించు కొను బాధ్యత ప్రకృతిదే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

*శ్రీగురుభ్యోనమః*🙏

కనకాగారకళత్ర మిత్రసుత సంఘాతంబులన్ ముందటం

గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నేకాలంబు దుర్లంగ్యమై దుర్లంగ్యమై

యనివార్య స్థితి జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ

చ్చె నుపాంతంబున మాఱు దీనికి మదిం జింతిపు ధాత్రీశ్వరా!

బంగారము, భవనములు, భార్య, మిత్రులు, సంతానము అను వానిని ఎదుట పెట్టుకొని ఆడుకొనుచున్న మానవులకు ఆ వస్తువుల మీద గల తీపిచే ప్రాణముల మీద తీపి విడువరు. ఇంకనూ జీవించవలెనని ముచ్చట  కలిగి యుందురు. కాని కాలము క్రమముగా మృత్యువు రూపమున వచ్చును. తప్పించుకొనుచున్న సన్నివేశ మాసన్నమయినది. దీనికి మార్గమేమైనా ఆలోచించితివా?

పై బోధ విదురుడు ధృతరాష్ట్రున కొసగెను.  ఈ బోధ మానవులందరికిని వర్తించును.

 *భాగవతము Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

నవ బీజములలో రెండవ బీజము ధనము.  ధనము నందు నీకున్న ఆసక్తి గూడ  భౌతిక లోకమున నిన్ను బద్ధుని చేయును. జీవితము సరళముగా సాగిపోవుటకు ధనము ఆవశ్యకము. మితిమీరిన ఆసక్తి ధనము నందు ఉండుటచే జీవితమంతయు ధనార్జనమున తగులపడి పోగలదు. 

ధనమును నీ వాశ్రయించు స్థితి నుంచి, ధనము నిన్నాశ్రయించు స్థితికి స్వాభావికముగా  ఎదగవలెను. అట్లు కానిచో ధనార్జనమునకు బానిసయై జీవించుట అగును. సత్సాధనకు అవరోధమేర్పడును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విష్ణు కథా రతుడగు నరు 

విష్ణుకథల్చెప్పు నరుని, వినుచుండు నరున్ 

విష్ణు కథా సంప్రశ్నము

విష్ణునదీ జలము భంగి, విమలుల జేయున్.

విష్ణు వనగా వ్యాపనము చెందిన ప్రజ్ఞ. అంతర్యామి ప్రజ్ఞ. అంతర్యామి యందు నిలబడి, అంతర్యామి యందు జరుగు సృష్టి, స్థితి, లయములను చెప్పువారు, వినువారు పవిత్రు లగుదురని భావము. 

ప్రతి దినము భాగవత కథలను సాయం సమయమున పఠించుట వలన దైనందిన జీవితమున ఏర్పడు కాలుష్యముల నుండి భక్త జనుడు నిర్మలుడు కాగలడు.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నన్ను చూడవలెనని నీవు తలచుకొను నప్పుడల్లా నీవు నన్ను చూడలేవు. ఆ తాళము చెవి నా వద్ద ఉన్నది. నాకు అవసరమని తోచినప్పుడు మాత్రమే ప్రార్థనా సమయమందు నన్ను చూడగలవు. నేను నీలో సూక్ష్మరూపమున ప్రవేశించువరకు, నిన్ను కొంతకాలము పాటు కావాలనియే పరీక్షార్థము ఉంచెదను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దురాశ కారణముగా ద్వేషము ఏర్పడును. ద్వేషము కారణముగా మానవుడు యుక్తాయుక్తములను మరచును. తనకు ఎవరిపై ద్వేషమున్నను, ఆ ద్వేషము తను నడచు మార్గమునకు తీవ్రమైన అవరోధమని గుర్తింపవలెను. తనలోని ప్రాణ హానికరమగు ఈ ద్వేష బీజమును అంతర్యామి భావనతో నిర్మూలించు కొనవలెను. తాను ద్వేషించు వాని యందు గూడ అంతర్యామిగా భగవంతుడున్నాడు కదా! 

అంతర్యామిని దర్శించుట సాధనగా ఏర్పరచు కొనునంతవరకు కామలోకము నుండి విముక్తి ఉండదు. ద్వేషమునకు విరుగుడు ప్రేమ. మహాత్ములు ద్వేషమును ప్రేమతో ఎదుర్కొను చుందురు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

సాధకులు కూడా తాము సాధకులమని ప్రత్యేక భావము వహించుట సాధన యందు పెద్ద అవరోధము. సాధన చేయుచున్నానను భావన  వదిలి సాధన యందుండుట అతి ముఖ్యము. తన శక్తి సామర్థ్యముల గురించి తాను భావన చేయునంత సేపు సాధన ఉండదు. 

తన కీర్తి ప్రతిష్టలను పెంపొందించు కొనుటకు పడు తాపత్రయము ప్రత్యేకతకు దారితీయును. ప్రత్యేకత వేర్పాటుకు దారితీయును. వేర్పాటు ఆత్మసాధన మను ప్రయత్నమునకు మృత్యువు వంటిది.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

నూతన సంవత్సరము ప్రవేశించినది. వసంత ఋతువు, చైత్రమాసమువచ్చినది. సూర్యుడు ఈ ఋతువులో  వసంతుని వలె ప్రకాశిస్తాడు. ఆత్మ తత్వానికి అత్యంత ప్రీతిపాత్రమైన ఋతువు వసంతము. నూతన సంవత్సరము నిజముగా నూతన సంవత్సరము కావాలని భావించేవారు సత్సంకల్పములను ఆశ్రయించి, ఆచరిస్తూ, చవకబారు భావములను వదిలివేయాలి. ఆహార విహారముల యందు నియమపాలన స్వీకరించాలి. 

ఉదాత్తమైన భావములు ఆత్మకు వస్త్రము వంటివి. ఆత్మకు గూడ రుచి కలిగేటట్లు ప్రార్ధనాదికములు గావించుకోవాలి. స్వభావ పరము,  దేహపరము అయిన  ఆలోచనల నుండి, నిన్ను నీవే ఆత్మపర

మయిన భావపరంపర లోని కి ఉద్దరించుకోవాలి. అప్పుడే జీవన సమన్వయము లభిస్తుంది. నిన్ను నీవు తెలుసుకో, గురుబోధలు పఠించాలి. ఈ సంవత్సరము సూర్యారాధన చాలా ముఖ్యము. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

రాముడే పరమ దైవము. శ్రీరాముడుగా సూర్యవంశములో జన్మించి, ఒక తల్లికి, తండ్రికి పుట్టి, మానవుడై, సుశీలుడై మనలను అనుగ్రహించాడు. *రమ్* అని సంస్కృతములో ఒక ధాతువున్నది. ఆనందము అని దానికి అర్థము.

*రామ* అన్న నామము రమ్ అను ధాతువు నుండి వచ్చినది. మిగిలిన వన్నియు ఒక ఎత్తు. రామనామము ఒక ఎత్తు. రామా  అనిన చాలును. ఆ నామమే ఆనందమునిచ్చును. శ్రీరాముడు ఆనందమే తానైన వాడు. ఆనందము కలవాడు. ఆనందము నిచ్చువాడు. ఆనందింప చేయువాడు. ఆ ధశరథుడు ఎంత భాగ్యశాలియో, దశరథునకు పుత్రుడయినాడు. ఎందుకు? కర్మ చేతనా? కాదు. దేవతల ప్రార్థన చేతనా?  కాదు, రావణుని చంపుటకా? కాదు. మానవులమై జన్మించి, శరీరమే నేనని భావించుచు, సముద్రములో మునిగి పోవుచున్న జీవుల బాధలను చూచి, జాలికలిగి, వారిని తరింపచేయవలెనని, దశరధుని పుత్రునిగా జన్మించాడు. ఎంతటి దయ!

భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

రఘువంశమున జన్మించిన శ్రీరాముడు దయామయుడు. మనసును, జ్ఞానేంద్రియములను తప్పుగా ప్రవర్తింపకుండ నిగ్రహింపగల జితేంద్రియుడు. పరుషమాట పలికినను బదులు పలుకని శాంతుడు. క్షమాగుణమునకు. రామునకు రాముడే సాటి. నూరు అపకారములుచేసినను, ఒక్క అపకారము గూడా అతనికి గుర్తుండదు. రావణుని కంటే అపకారము చేసిన వాడుండడు.

రావణుడు చనిపోయిన తరువాత  విభీషణుడు సంస్కారము చేయుటకు జంకినాడు. ఏవగించుకొనినాడు. రాముడు "విభీషణా! నీవు నాకు మిత్రుడవు. ఇతడు నీకు సోదరుడు. మిత్రుని సోదరుడు సోదరుడే కదా! కావున నేను సంస్కారము చేతునని సిద్ధపడినాడు" అది రాముని క్షమాగుణము.

భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

స్వామీ! రామా! నీ నామములో ఎంతటి అమృతరసము నిండి ఉన్నదయ్యా!  రామా నీ కథయే అమృతము. సముద్రమును మధించి తీసిన అమృతము నిజమైన అమృతము గాదు. దేవతలు త్రాగిన అమృతము రామకధామృతము వంటిది కాదు. ఇది ఆత్మనే మహదానందములో ఉంచును. 

అందుచే ఓ రామా! నీ కథామృతమును జుర్రెదను. అబ్బా!  ఎంత రుచి, ఏమి రుచి అని ఒక జుర్రు కంటే ఒక జుర్రులో ఒక్కొక్క రుచిని అనుభవించెడి మహాపురుషులతో కలయికను నాకు ప్రసాదింపుము. మానవ జీవితమునకు సత్సంఘమే ప్రధానము. 

నీ స్మరణ యందు వైముఖ్యము కలవారితో కలిసి ఉండుట కంటే వేరొక నరకము లేదు. అట్టి వారితో నాకు పొత్తు లేకుండా చేయుము. కారుణ్యమూర్తివి కదా! హే రామా! నా యందు దయచూపి, నన్ను అనుగ్రహింపుము.

భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

అగ్నిహోత్రము ఎంత అల్పముగా ఉన్నను, ఎంత దూది రాశిని అయినను దహింపచేయగలదు. అట్లే రామనామము చాలా చిన్నది. దానిని ఉచ్చరించుటకు పెద్ద ప్రయత్నము అక్కరలేదు. ఉచ్చరించుట సులభము. అదృష్ట వశముచే గాని, నాలుకకు రామ నామము రుచింపదు. ఆ జిహ్వకు  రుచించుటకు ఎంతో భాగ్యము ఉండవలెను. ఓ రామా! నేను ఎన్నో పాపములొనర్చినాను. ఆ పాపములకు నీ నామమే మందు. 

నా అదృష్టము వలన రామనామము నా నాలుకకు పానకము వలె రుచించినది. నీ నామము ఏపాపమున్నను పోగొట్టి పవిత్రము చేయును.

 ఒక చిలుక  అర్థము కాకపోయినను, ఎవరో నేర్పిన మాటను నేర్చుకొని, "రామా కావుము" అని పలికెను. వెంటనే సద్గతి చెందినది. రాముని రూపము, గుణములు దానికి తెలియవు. రాముని ధ్యానించుట తెలియదు. కారుణ్యసముద్రుడవైన ఓ రామా! నేను గూడ ఉచ్చరించినంత మాత్రమున  నన్ను గూడా అనుగ్రహించి, మోక్షమును ప్రసాదింపవా!

భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

శ్రీరామనవమి రోజు ఎవరికి తోచిన పద్ధతులలో వారు రాముని స్మరణ చేస్తారు. మర్నాడు మరచిపోతాము. మనము పిలిచినా, పిలవకపోయినా హృదయము నందు స్పందించే ప్రజ్ఞ రామప్రజ్ఞ. అందుకనే ఆత్మారాముడని పిలుస్తాము. 

రాముడు ఎంత ధర్మమూర్తో అంత కృతజ్ఞుడు. రాముని కృతజ్ఞతకు అంతులేదు. రామునియందు గల ప్రత్యేకమైన విశేషమేమిటంటే ఆయన ప్రవచనము చెప్పలేదు. ప్రవర్తన చూపించాడు. రాముని ప్రవర్తనమే ప్రవచనము.

రామాయణము మొత్తములో  తక్కువ మాట్లాడినది రాముడే. మితభాషి, పూర్వ భాషి.  మరల చైత్రమాసము, నవమి తిథి వస్తుంది. ఈ లోపల  మనము ఎంత సేపు రామునితో కూడి ఉన్నామన్నది ప్రశ్న.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

ఈ భౌతిక దేహమును ఇంకా అధికమగు స్వచ్ఛమగు జ్ఞాన ప్రాణ శక్తులతో నింపవలసి ఉన్నది. అస్థిరత్వము నుండి స్థిరత్వమునకు మళ్ళించి, పూర్తి జాగృతావస్థ యందు పూర్ణప్రజ్ఞను పొందుట ఈ యోగమున జరుగును. 

తన తొంటి కర్మరాశికి,

అనుచరమై బహు వికారమై

మనము వడింజను నింద్రియముల తెరవుల

తనువులు పెక్కైనజెటవు తన కర్మమితుల్!

ప్రారబ్దము ననుసరించియే తలపులు, కార్యములు జీవిని నడిపించు చుండును. తనకెంత తెలిసినను, ప్రవర్తన తెలిసిన దానిని అనుసరించక, స్వభావమునే అనుసరించు చుండును. బుద్ధిలోకమున గ్రహించిన సద్విషయములు ఆచరణ సమయమున అదృశ్యమగుచుండును. అదియే ప్రారబ్ధకర్మ  ఫలము.

 ఈ విషవలయం నుంచి బయటపడవలె నన్నచో  సత్సాంగత్య మొక్కటే ఉపాయము. బుద్ధిమంతుని సాన్నిధ్యమున స్వభావము పనిచేయక, దివ్యస్వభావమైన బుద్ధి పనిచేయును.

 *భాగవతము Master K.P.K*.🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

మన సౌరకుటుంబము లోని గ్రహములు తమ బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించడము లేదు. వానిని చక్కదిద్దుటకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. లోపములను తెలుసుకొని, సవరించి, పూరించుటకు అందుకు అవసరమగు మార్గమును ఎప్పుడు, ఎలా అవలంభించాలో నిర్ణయించడానికి భూమిపై అవతరించాను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

పవిత్రమైన కార్యములు నిర్వర్తించుటకు, తద్వారా పరిపూర్ణ ఫలితములను పొందుటకు అపవిత్రమైన దేహపుంజము ఉపయోగపడదు. దేహపుంజమనగా మనోమయ, ప్రాణమయ, అన్నమయ శరీరముల గుత్తి. 

సాధకుడు కేవలము బహిర్గత క్రతువులచే పవిత్రీకరింప బడడు. అంతరంగమున దివ్యత్వమును స్మరించుచు, బహిరంగమున లోకహిత కార్యములను నిర్వర్తించుచు, సద్గ్రంథములను నిత్యము పఠించుచు ముందుకు సాగవలెను. మరియొక మార్గము లేదు. మేడిపండు జీవనము విసర్జించ వలెను.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీ గురుభ్యో నమః🙏*

నిజమైన సేవ వికాసము నిచ్చి, సత్యమునకు దగ్గరగ చేర్చవలెను. సత్యమునకు సేవకుడు దగ్గర అవుతున్న కొలది, కరడు గట్టిన అభిప్రాయములు తొలగును. సేవ కన్నా సేవను గూర్చిన అభిప్రాయములు మిన్నగా ఏర్పడ రాదు.

సేవ మానసిక కక్ష్యలలో అవసరమగు మార్పు తెచ్చి, మనస్సును నిర్మలముగను, ప్రశాంతముగను మలచవలెను. ప్రశాంతము అయిన మనస్సు నందు నిజతత్వము ప్రతిబింబించును. అది కారణముగ ద్విగుణీకృతమైన స్ఫూర్తితో ప్రతిఫలాపేక్ష లేని సేవ జరుగ గలదు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

*సేవను వినయంగా నిర్వర్తించుము*.  అని పెద్దలు బోధించిరి. వినయము లేని సేవ డాంబికమగును. అహంకారపూరిత మగును. అట్టి సందర్భమున హృదయ కవాటములు తాళము వేయబడును. నిర్మలమైన సేవకు ఆవేశపూరితమైన ప్రచారము మాలిన్యము కలిగించును.

సేవ పేరున ఇతరులను వ్యక్తిగతముగ ఉపయోగించు కొనుట వక్రమార్గము. అట్టి వారికి భవిష్యత్తున ఆపదలు కలుగ గలవు. ఎవరికి సేవలందించు చున్నావో వారియందు నారాయణుని భావన చేయుము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

అంతటను నిండియుండు బ్రహ్మమును ఈ శరీరములో మనకుగా మనము ఎరుగునట్లు చేయుటయే ఈ యోగాశయము. అపుడు జీవుడు, బ్రహ్మము ఏకమై జీవబ్రహ్మైక్యము అగును. అపుడు మనము వారుగా అగుదుము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

ప్రాతః సంధ్య, సాయంసంధ్య చాలా ముఖ్యము. సంధ్యా సమయములో చేసే ప్రార్థనకు వెయ్యి రెట్లు ఫలితముంటుంది. ఆ సమయములో వ్యక్తా వ్యక్త తత్త్వము ఆవరించి ఉంటుంది

చీకటి పగలుగా మారే సమయము, పగలు చీకటిగా మారే సమయము మనలో సంస్కారము లను పెంచేదిగా ఉంటుంది.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రిగురుభ్యోనమః*🙏

 *తే౹౹*  అన్యఁమెఱుగఁడు తనయంత నాడుచుండు

మంచివాఁ డీతఁ  డెగ్గులు మానరమ్మ

రామలార త్రిలోకాభిరామలార

తల్లులార గుణవతీమతల్లులార.

*తాత్పర్యము:* "అన్య మెరుగడు. తనయంత తా నాడుకొనుచుండును. మంచివాడు. ఇతనిపై ఆరోపణలు చేయుట మానుడు." అని యశోదాదేవి పలికినది.

*వివరణ:* ఈ సమస్తము భగవంతుడే. "సర్వం ఖల్విదం బ్రహ్మ", "పురుష  ఏవేదగం సర్వం" అను వాక్యములు అద్వైతమును ప్రతిపాదించు  మహావాక్యములు. భగవంతునకు తానొక్కడే ఉన్నాడు. తనతో తానే క్రీడించుచున్నాడు. కాని, అతనికి ఇతరులెవరు? అందరును తానే. అతడు మంచివాడు. ఇది భగవంతుని ఐశ్వర్యము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

వైశాఖమాసము వృషభరాశి తత్వముతో కూడియున్నది. యుగపురుషులైన ఆది శంకరులు, గౌతమబుద్ధుడు ఈ రాశి యందు జన్మించి, మానవజాతికి జ్ఞానబిక్షను, యోగ జీవనమును అందించిరి. కోరికలకు,  ఆశయములకు వలసిన బలము నిచ్చి, సిద్ధికి తోడ్పడు స్వభావము వైశాఖమాసమున మెండుగా లభించును.

ముఖ్యముగా ఈ మాసమందు సాధకులు ఉభయ సంధ్యల యందు సూర్య కాంతిని ఆస్వాదించుచు, శ్వాసను లోతుగా పీల్చి వదిలినచో శరీరము నందు ప్రాణమునకు బలము కల్గును. శరీర ధాతువుల యందలి రుగ్మతలు నశించును.

*Master K.P.K🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సూర్యుడు తూర్పున ఉదయించిన సందర్భమున లక్షలాది దీపములన్నియు  వెలవెల పోయినట్లు, బుద్ధి ప్రచోదనమైన జీవునికి లక్షలాది మనో భావములు అదృశ్యమై బుధ్ధి మార్గమున సమస్త కార్యములు నిర్వర్తింపబడగలవు. మనో ప్రయత్నమను మెరమెర కూడ నశించును. కార్యములు అప్రయత్నముగ సిద్ధించును. (కార్యములు తన నుండి జరుగు చున్నప్పటికి తాను చేయుచున్నానని భావన లేకుండును.) 

ఇట్టి స్థితి చేరిన జీవుడు శమమును పొందును. శమమును పొందిన జీవుని యందు తర్కముండదు. ఆనందముండును. అన్ని సన్నివేశములయందు అనుభూతి  యుండును. ఇంద్రియార్థముల యందు ప్రత్యేకమైన ఆకర్షణ వుండదు. ఏనుగు నడిచివచ్చు దారిన కుక్కలకు తావులేదు. గజ దర్శనంతో కుక్కలు పరువెత్తినట్లు బుద్ధి ప్రచోదనమైన మనస్సును ఇంద్రియ వ్యాపారము సోకలేదు. దరిదాపులకు కూడ చేరలేదు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఆత్మవిచారము లేని మనుజుడు మోహము అను మత్తు యందు ఉండును. బంధములు నలువైపులనుండి అలముకుని దిక్కు తెలియని స్థితి యందు పడును. సంసారమున తరించుటకు నిత్యము ఆత్మవిచారము చేయుట ముఖ్యము. అట్లు విచారము చేయువారే జీవితమున దివ్య విభూతిని  ఆస్వాదించగలరు. 

సంపదలు, భోగములు, కీర్తి, యశస్సు కలిగినను వానియందు బంధింపబడరు. వారి మనోసరోవరమున ఆత్మ విచారము అని పద్మములను వికసింపచేసుకుని హిమాలయమువలె శోభిల్లుచుందురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

ప్రపంచమున మాటలు నేర్చిన వాడు మనిషి. మాటను పలుకుటలో  సత్య, అసత్యముల మిశ్రమ భాషణముండును. అట్టి భాషణమే తిక మక పెట్టును. సత్య భాషణము చేయు వారు అరుదు. నాలుక లౌక్యమును ప్రదర్శించు చుండును.  నాలుకను వినుట లోతులేని ప్రక్రియ. హృదయమును వినుట లోతైన ప్రక్రియ. మాటాడుట కన్న వినుటను ముందు అభ్యాసము చేయవలయును. 

భాషించుట, వినుట వాఙ్మయ తపస్సునకు సంబంధించినవి. ఈ తపస్సు చేయని వారికి కలవరము, కల్లోలము తప్పదు.

*Master K.P.K. 🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భౌతిక లోకములకు, దివ్యలోకములకు బేధం కలదు. ఈ లోకమున గల ధనవంతుడు ఆ లోకమున కనిపింపక పోవచ్చును. ఈ లోకమున గల దరిద్రుడు ఆ లోకములో సంపన్నుడిగా గోచరింప వచ్చును. దివ్యలోక వైభవమునకు కావలసినది సద్గుణ సముదాయము. 

దివ్యలోక స్రవంతి భౌతిక లోకమున అపుడపుడు అవతరించుటకు కారణము సద్గుణములు. అవన్నియు అకస్మాత్తుగా, అసాధారణము గా జరుగును. చైతన్య వికాసమునకు భౌతిక విస్తరణ ఆవశ్యకము కాదు

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్.*C.V.V* మాట

నేను దిగి వచ్చిన పని మొదటగా అమెరికా, ఐరోపా భూఖండములలో ప్రారంభమగును. అటుపైన భారత దేశముచేరును. నేను చేయు కార్యక్రమము మొత్తము మానవ జాతికి, భూమికి సంబంధించినది. మీకిపుడు అవగాహన కాదు. ప్రస్తుతము మీరు నన్ను అనుసరించుటకు నమ్మకమే ఆధారము. నేనందించు యోగము 240 సంవత్సరములకు గాని పరిపూర్ణముగా తెలియరాదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

త్రికరణ శుద్ధి యోగి యొక్క ముఖ్య లక్షణము. అతని భావన, మాట, చేత సూటిగా ఉండును. మర్మము ఉండదు. యోగి నుండి దుర్భాష వెలువడదు. వాక్కుగా భగవంతుడే దిగి వచ్చును కావున తన నుండి వెలువడు వాక్కును దుర్వినియోగం చేయు వాడు నమ్మక ద్రోహి. వాక్కును వినగలిగి, దానికి ప్రణాళికను అవతరింప చేయుటలో యోగి జీవనము సార్థక్యత చెందుచుండును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

.

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

"ఎప్పుడైనను, ఎవరికైనను, ఎక్కడైనను, ఏదైనను జరుగ వచ్చును." ఈ వాక్యమున గుర్తు ఎరిగి యుండుట తెలివి. అంతర్యామి దర్శనము సాధన చేయుచు, ఈ మహావాక్యము నందలి సత్యమును అంగీకరించి, జీవించి యుండుట వలన ఆశ్చర్యపడుట, అదిరిపడుట అనునవి లేక జీవించు స్థిరచిత్తము క్రమశః అలవడును.

అట్లు అలవడినచో ఉన్నత స్థితి యందు యిదియే కాలజ్ఞానముగ సిద్ధించును. స్థిరచిత్తునకు అదృశ్యము దృశ్యమగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జీవుడు, దేవుడు విడదీయరాని సంబంధము కలవారు. అజ్ఞానముచే జీవుడు దైవమును మరచును. కాని మరిచిన వానిలో గూడ ప్రాణముగను, తెలివిగను దైవమే ఉన్నాడు. తాను వేరుగా ఉన్నాననుకున్న వాడు తాను లేనివాడగును. అల లేని సముద్రముండ వచ్చును గాని, సముద్రము లేని అల ఉండదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

 సత్సాధకుడు తన మనస్సును పరిమితమగు విషయముల నుండి, శాశ్వతమగు విషయముల యందు మరల్చి ప్రతి నిత్యము యోచన చేయుట అభ్యాసము చేయవలెను. అపుడు మానవ ప్రజ్ఞ దివ్యలోకములను దర్శింపగలదు.

దివ్యమగు ప్రదేశమును గాని, దివ్యమైన రూపమును గాని, మనస్సున తలచి, ధారణ చేసినచో దివ్యమైన విషయములు గోచరించుటకు అవకాశమేర్పడును. ఇది సత్యము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

*మాస్టర్ C.V.V. మాట*

నా యోగము వలన ప్రకృతి ధర్మములకు విరుద్ధము కలుగకుండా మానవుని ఆధ్యాత్మిక పరిణామము, పరిపక్వత, కొలది జన్మలలోనే సుసాధ్యమగును. అందులకై దివ్య కక్ష్యలలో ఉన్న ప్రజ్ఞలను, శక్తులను సాధకులు అందుకొనుటకు సులభతర మార్గమును ఏర్పరచితిని. అదియే ప్రార్థన.

Namaskarms Master to your lotus feet.

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

లోకహితుని మార్గము క్లిష్టముగను, కష్టతరముగను, అగ్ని శిఖల నుండి నడుచుచున్నట్లు యుండును. దైవమును ఆధారము జేసుకొని ధర్మము ననుసరించుచు ముందుకు సాగుటయే గాని, మరియొక విధానము అతనికి ఉండదు. ఈ మార్గమున సౌకర్యముల కొరకు ఎదురుచూచుట ఉండక కర్తవ్యములను నిర్వర్తించుట ఒక్కటియే ఉండును. దృఢ సంకల్పముతో ఇట్టి మార్గమున నడచుటయే గాని సహాయమును ఎదురుచూచుట ఉండదు. 

 అప్పుడు మాత్రమే ద్వంద్వములను దాటుటకు వీలుపడును. అప్పుడు *లో* వెలుగు ఏర్పడి, చీకటి వెలుగుల ప్రభావము దాటి, వెలుగు మార్గమున నడిచి, వెలుగులోకములయందు ప్రవేశించుట ఉండును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

పనులు చేయక ఊరక నేర్చుకొను వాడు చేయుచు నేర్చుకొనని వాడివలె నిష్ప్రయోజనం. చాలా మంది ఈ ఉపాయము తెలియక నేర్చుకొనుటకు చేయుట ఆపుదురు. చేయని వాని జ్ఞానము అనుభవైక జ్ఞానము కాదు. శరీరమును, ఇంద్రియములను, మనసును సద్వినియోగం చేయుటకే దైవమందించినాడు. వాటిని సరియైన మార్గములో నియమించుట నిజమైన యోగము.

పనులు నేర్చుకొనకుండా చేయువాడు దుఃఖ పడును. నేర్చుకొనుచు చేయువాడు సుఖపడును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ధర్మము దేశ, కాలములను బట్టి మారునది కాదు. ధర్మము యందు విశ్వాసము, ప్రీతి, గౌరవము కలిగి ఉన్న వాడిపై కాలము తన ప్రభావమును అంతగా చూపదు. ధర్మమును ఆశ్రయించిన వాడు దైవమును ఆశ్రయించి నట్లే. 

ధర్మము అను గుంజకు కట్టు బడిన వాడు గాలికి, వానకు, వరదకు కొట్టుకొని పోడు. అతడే సాధకుడు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జ్యేష్ఠ మాసము సత్సాధకులకు ప్రత్యేకమైన అవకాశము నిచ్చు మార్గము. వాయుతత్త్వపు మాసము అగుటవలన వాయువు అనుగ్రహము పొంది, సత్సాధకులు భూవలయము నుండి ఊర్ధ్వగతి చెందుటకు చక్కని అవకాశము ఈ మాసము.  విశుద్ధి చక్రమును బలపరుచుకొనుటకు జ్యేష్ఠమాసమును వినియోగించు కొనుట బుద్ధిమంతుల లక్షణము. విశుద్ధి బలపడినచో మణిపూరకము, స్వాధిష్ఠానము, మూలాధారము నియమింప బడుట జరుగును. దీనికి ప్రధానముగా శ్వాసను గమనించుచు ప్రాణాయామము చేయుట, వాక్కును సద్వినియోగం చేయుట చేయవలెను.

జ్యేష్ట పౌర్ణమి నాడు పరమ గురువు మైత్రేయ మహర్షి మానవులకు ప్రేమ జ్ఞానములను సంతర్పణము చేయును. జ్యేష్ట మాసపు ప్రజ్ఞకు ప్రతీకగా పరమగురువు జ్వాలాకూలుడు శత సంవత్సరముల నుండి జీవులను సిద్ధులుగా తయారు చేయు మహాయజ్ఞమునకు ఋత్విక్కుగా నిలబడి ఉన్నాడు. మాస్టర్ సి.వి.వి. కుంభ చైతన్యమును ప్రసరింప చేసి, జీవులను ఉద్ధరించు కార్యక్రమమునకు శంకుస్థాపన చేసెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 07:55] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్సాధకులకు ఆత్మవిచారమే ప్రథమ సాధన. సంసారమను దీర్ఘరోగమునకు ఆత్మవిచారమే పరమౌషధము. ఆత్మవిచారము వలన బుద్ధి పవిత్రమగును. నిశితమగును. ఎడతెరిపిలేని వ్యామోహమును చిగుళ్లతో పాటు పెరకివేయుటకు ఆత్మవిచారమును నిరంతరము చేయవలెను.

అందువలన బలము, బుద్ధి, సమయోచితమగు స్ఫురణ, సమర్ధవంతమగు కర్మానుష్టానము లభించు చుండును. అప్పుడే శ్రేష్టమగు ఫలములను పొందుదురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ధర్మమునకు జీవితమును సమర్పించుటకై ప్రయత్నింపుము. ఇది ఒక ఉత్తమమగు దీక్ష. ఎట్టి పరిస్థితుల లోను ధర్మమునే అనుసరించుటకు కృషి సలుపుము. ఈ కృషి నిన్ను ఎన్నో జన్మ పరంపరల నుండి తరింపచేయును. ధర్మాచరణము మహత్మ్యం ఇంతదని చెప్పుట కష్టము. అందరూ ధర్మమమును గూర్చి తెలుపుదురే గాని ఆచరించువారు  దాదాపు మృగ్యమే. ధర్మమును తు.చ. తప్పని వానిని మృత్యువు గూడ స్పృశింపలేదు.

ఎంత ధర్మమమును ఆచరింతువో అంత రక్షింపబడుదువు. ఇతరములు రక్షింపలేవు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

యోగవిద్య సత్వగుణ సంబంధితము. రజస్సు, తమస్సుల కది అందదు. రజో గుణప్రేరితుడైన వాని నుండి నిత్యము సంకల్పములు కోకొల్లలుగ వచ్చుచుండును. అవి మానవుని బాహ్యప్రపంచము లోనికి నెట్టుచుండును.  అపుడు యోగము పేరున కర్తవ్య నిర్వహణము మానివేయును. 

యోగమునకు కర్మయోగ సిద్దాంతము మొదటి మెట్టు. యజ్ఞార్ధ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. సోపానక్రమము పాటింపక అడ్డదిడ్డముగా తోచినది చేయువారు యోగసాధకులమని  భ్రమపడుటయే గాని, యోగము సిద్ధింప నేరదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్వము, రజస్సు,  తమస్సు, త్రిగుణములు. ఇవి సంగదోషము చేత మూడు విధములైన మలములుగ పరిణమించును. 

తమోగుణ మలము సోమరితనము గను, కోపముగను పరిణమించును. అపరిశుభ్రత గూడా ఉండును.

రజోగుణ మలము చాంచల్యమును, చికాకును కలిగించును. 

సత్వగుణ మలము కర్మవైముఖ్యము, ఉత్సాహము చచ్చుట,  ప్రయత్నము నుంచి తప్పుకొనుట మొదలగు లక్షణములతో కూడియుండును. 

ఈ మలములు విడువ వలెనన్నచో అంతరంగమున విష్ణుభావన ఉండవలెనని భాగవతము చెపుతున్నది.

*భాగవతము Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రార్థన, పరహితము, స్వాధ్యాయము ఒక సమకోణ త్రిభుజము. ఈ మూడును ప్రతిదినము సక్రమముగా నిర్వర్తించు కొనవలెను. వీటికి సమయము దైనందినముగ పెరుగుచున్నచో పరిణామము చక్కగా సాగును. వీటికి అంతరాయములు కలుగుచున్నచో జీవితము నాణ్యత  కోల్పోవుతున్నదని గ్రహించవలెను. 

ఇతర విషయములను సర్దుబాటు చేసుకొని ప్రార్థనకు, పరహితమునకు, స్వాధ్యాయమునకు సమయమును కేటాయించవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సూర్యకాంతి సూర్యుని వలె పరిపూర్ణమైనది. ఆ కాంతి గంగ నీటిని స్పృశించినను, మురికి నీటిని స్పృశించినను సూర్యకాంతికి మాలిన్యము అంటదు. ఎచ్చట ప్రసరించినను తాను తాను గానే ఉండును. అగ్ని, వాయువు గూడ అట్లే. 

తమ పరిసరముల ప్రభావము తమపై లేక, తమ ప్రభావము పరిసరములపై ప్రసరింపచేయుట ఆత్మవంతుల లక్షణము. మహాత్ములందరూ అట్టివారే. వారు తాము గానే ప్రకాశించు చుందురు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్గురువులు ప్రతి చిన్న విషయమందును శ్రద్ధ కలిగి ఉందురు. శిష్యులు పెద్ద విషయము లందు శ్రద్ధ కలిగి, చిన్న విషయములను అశ్రద్ధ చేయుదురు. ఒక్కొక్క సారి చిన్న విషయముల యందు గల అశ్రద్ధ పెద్దవిషయములకు గూడా ప్రాకును. శ్రద్ధ లేని వారికి దేనియందును శ్రద్ధ ఉండదు. 

చిన్న చిరుగుకు వెంటనే కుట్టు వేసినచో చిరుగు పెద్దదియగు అవకాశముండదు. పరమ గురువులు అప్రమత్తతకు ప్రాధాన్యమిచ్చుదురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్సాధకుడు తనతో కూడి సాధన చేయువారిని ఎన్నుకొని, వారితో సహ అధ్యయనం, సత్సాంగత్యము ప్రతి రోజు చేయుచుండవలెను. ఇది సహజీవనమునకు ప్రాతి పదిక. సహజీవనమునకు లొంగని మనస్సు ఆత్మసాధనకు పనికి రాదు. సహజీవనమునకు ఉత్సహించవలెనే గాని, వ్యతిరేకత పనికి రాదు. తనను తాను విడిగాను, ప్రత్యేకముగను అభిమానించు వాడు తెలియకనే అహంకారమును పోషించు చుండును. అపుడు దివ్యచైతన్యము గాని, గురు చైతన్యము గాని ప్రవేశించుటకు వీలుపడదు. ఎన్ని చేసినను ఆత్మ వికాసము కల్గుట దుర్లభము.

వికసించు బుద్ధిగల వానికే  వికాసము. పూవు వికసించుట వలననే కాంతివంతమగుచున్నది. కనుక సత్సాంగత్యం, సహ అధ్యయనము, సామూహిక ప్రార్థనలు ఆత్మ సాధనకు ముఖ్యము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విష్ణువనగా జీవుడిగా ఉన్న దేవుడు. అన్నిటియందు *నేను* గా ఉన్నవాడు. అతనిని అంతట అన్నిట చూసినచో వైభవము గోచరించును. అంతేకాదు, అన్నిట, అంతట వానినే భావించుట, వినుట, సేవించుట, వర్ణించుట చేయవలెను. అట్లు చేయువానికి విష్ణువే గోచరించి, ఇతరములు గోచరించవు. 

అదియే మోక్షస్థితి.

*భాగవతము Master K.P.K*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నువ్వు కోరికలు ప్రక్కన  పెట్టు. నేను నిన్ను దివ్యముగా తయారుచేస్తాను. అపుడు అవన్నీ సులభముగా తీరిపోతాయి. లేనిచో సూక్ష్మ శరీరము సన్నగిల్లి, భౌతిక శరీరానికి దెబ్బతగిలి సాధన జరుగదు.

                          *ఇది నా మాట*

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రపంచమున అన్నిరకముల జన్మలకంటెను మానవజన్మ ఒక అదృష్టము. అట్టి మానవ జన్మ  శ్రీమంతుల కుటుంబమున జన్మించుట కన్నా యోగుల కుటుంబమున జరిగినచో అంతకన్నా గొప్ప అవకాశము జీవునకు మరియొకటి లేదు. యోగుల కుటుంబము నందు దైవీ వాతావరణము సహజముగా ఉండును. భక్తి జ్ఞానము లుండును. చిల్లర విషయముల గూర్చి చర్చ గాని, చేష్ట గాని ఉండదు. 

భాగవత రామాయణాది పఠనము, యోగాభ్యాసపరమైన ప్రవర్తన ఉండును. యోగము కొనసాగుట కంతకన్నా ఉత్తమమైన వాతావరణము ఏమి కావలయును?  ఇంద్రుని జన్మ కన్న కూడా యోగి జన్మ గొప్పది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

క్షమ గలవాడే లోతైన వాడు. ధరించుట, భరించుట, సహించుట, క్షమించుట ఇత్యాది లక్షణములు లేని వాడు అకస్మాత్తు సన్నివేశముల యందు రాణించక, కలవరపడుచు అందరిని కలవరపెట్టును. క్షమ గలవారిని సూక్ష్మలోకములందు ఆదరింతురు, గౌరవింతురు.

క్షమను బట్టే హృదయము వికసించును. క్షమ లేనివానిని అవిద్య ఆవరించును. దుష్టశక్తులు వినియోగించు కొనును. క్షమ గలవాని పరిశ్రమ మూడు లోకములందు కీర్తింపబడు చున్నది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవారాధన, ధర్మాచరణము ఆధారముగ దివ్య వరములు దేవతలచే ప్రసాదింపబడును. అహంకరించినచో పొందిన వరములన్నియు నిష్ఫలమగును. అధర్మము వలన రజస్తమస్సులు ఆవరించి సత్యదర్శనము మరుగున పడి, తామెరిగినదే సత్యమని పొరపాటు పడుట ఉండును. 

ఎత్తు పల్లముల జీవితము కన్న సమతూకమగు జీవితము నందు రస స్వరూపుడగు దైవము అనుభూతిని మెండుగా ఈయగలడు. రజస్తమసులు ఆకర్షణముగా ప్రపంచమున గోచరించినను, అవి తాత్కాలిక సుఖమే నిచ్చును. కనుకనే సత్వగుణము ప్రధానముగా గల భాగవతమూర్తులను ఆశ్రయించుట ధర్మ సూక్ష్మములలో ఒకటి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవ ప్రజ్ఞ పృధ్వీ తత్త్వమున బంధింపబడి ఉన్నది. మనసు ద్వారా మానవుడు పదార్ధమయుడై పదార్ధములోనికి చొరబడి పదార్థముచే బంధింపబడి ఉన్నాడు. కోరికలున్నంత కాలము పదార్థ బంధనముండును. కోరికల కొరకు పనిచేయుట కన్న ఒక ఆశయము కొరకు పనిచేయుట వలన జీవితమొక చక్కని మలుపు తిరుగును. 

ఆశయము కొరకు పరిశ్రమించు వాడు కోరికలకు తన జీవితమును ఫణము పెట్టడు. ఆశయమున ప్రజ్ఞ పరిశ్రమించు చుండగ, కోరికల సమూహములన్నియు ఆవిరియై అత్యవసరమగునవి మాత్రమే మిగులును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

నేను మూడు రకములుగా యోగమును అందిస్తున్నాను.1. ప్రాణతరంగాలను నూతన పద్ధతిలో ప్రవేశపెట్టి, కామశరీరమును దగ్ధము చేసే కార్యక్రమము,2. సూక్ష్మశరీరమును పటిష్టం చేసే కార్యక్రమము.3. భౌతిక శరీరము ఏ అడ్డంకి లేకుండా పనిచేసే కార్యక్రమము.

                                *ఇది నా మాట*

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

సద్గురు పాదములపై పడువారు మెండు. ఆ పాదములు నడచు మార్గమున నడచు వారు కొందరే. పాదములపై పడుటకన్న ఆ పాదముల జాడలను అనుసరించుట శ్రేష్టమైన పని. కేవలము నమస్కరించివారు  అచటనే ఉండిపోయిరి. పాద నమస్కారమునకు ప్రయోజనము అనుసరణమే. 

అనుసరణ లేని నమస్కారములు ఒక ఆచారముగ మిగిలిపోయి ఉన్నవి.  సద్గురు మార్గమున నడచు బాధ్యతను స్వీకరించుట వలన నమస్కారమునకు ప్రయోజనముండును. సద్గురువు ననుసరించుటలో సమస్తము పరిష్కరించబడి తారణ స్థితి లభించును.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవస్మరణము ధర్మాచరణమునకు దారి చూపును. ధర్మాచరణము దైవమునకు దారి చూపును. ధర్మాచరణము లేని దైవారాధన, దైవారాధన లేని ధర్మాచరణము అసంపూర్ణములే. దైవము, ధర్మము నాణెమునకు బొమ్మ, బొరుసు వంటివి. 

ధర్మముతో కూడని అర్ధము, ధర్మముతో కూడని కామము పతన హేతువు. శ్రీరాముని స్మరణము దైవారాధనతో కూడిన ధర్మాచరణము నిచ్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్యవాక్కు నుండి వెలుగు జనించును. దానిని దాచు ప్రయత్నము వ్యర్ధము. ఎంత దాచినను దాగపడనిదే సత్యము. అసత్యముతో కప్పిననూ, పూడ్చిననూ సత్యప్రకాశము మరుగున పడదు. 

నీ లోని సత్యము నీ అసత్య ప్రవర్తనమును పదే పదే ప్రకటించు చుండును. నిర్భీతితో  సత్యమునే అనుసరింపుము. సత్యమును అనుసరించినచో ఘర్షణ ఉండదు. కప్పిపుచ్చు ప్రయత్నములే ఘర్షణమునకు కారణము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సూర్యోపాసనము చేయువారు హృదయమున సూర్యుని భావించుచూ  సూర్యకాంతి దేహమంతటను వ్యాప్తి చెంది ఉన్నట్లుగా ధ్యానింపవలెను. ఉదయించే సూర్యుని చూచి  "అతని యందు వెలుగెట్లు ప్రసరించు చున్నదో నాయందు అట్లే ప్రసరించు చున్నది. నా యందలి ఎరుకయే వెలుగు. నేను ఆ ఎరుక యందే వశింతును." ఇట్టి భావము మీకు పరిపుష్టి నిచ్చును. ఉత్సాహము నిచ్చును. శక్తిని ఇనుమడింప చేయును. 

అతి ప్రాచీన కాలము నుండి చేయబడుచున్న సూర్యోపాసనము యొక్క అంతరార్థమిదియే. వెలుగు ధ్యానమును మాని, ఇతర రూప ధ్యానము చేయుట వలన ప్రయోజనము లేదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

యోగస్థితి భౌతిక శరీరముండగనే సిద్దింప చేసుకొనవలెను. స్థూలదేహముతో కూడి సమస్త కోశములు పటిష్టముగా ఉండి, దివ్య చైతన్యమును సహస్రారము నుండి మూలాధారము వరకు పరిపూర్ణముగా అనుభూతి చెందుచు జీవించుట నా దృష్టిలో పరిపూర్ణత్వము. ఇదియే నా సమగ్ర యోగము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భావముల యందు స్ఫూర్తివంతము, కాంతివంతము అగు భావములు తరుగుట వలన, పదార్థమయమగు భావములు పెరుగుట వలన జీవుడు స్థూలము లోనికి జారును. మరల సూక్ష్మము లోనికి పెరుగుటకు కాంతివంతమగు భావములను ఆశ్రయింపవలెను. అందులకే అగ్ని ఆరాధన, సూర్యారాధన,  గాయత్రీ ఆరాధన.  

భావమున కాంతి నింపుకొనుటకై దీపాలు పెట్టుకోవడం, పుష్పాలు అలంకరించుకోవడం, కాంతివంతమగు దేవతావిగ్రహాలకి పూజ చేయడము. లో కాంతి పెరిగిన కొలది జీవుడు సూక్ష్మము లోనికి ఎదుగును.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దివ్యపురుషులు, ఋషులు తమ చెంత నున్న వారి ప్రవర్తనమున అధర్మము గోచరించినపుడు వెనువెంటనే శిక్షను విధింతురు. అట్లు శిక్షించుట నిజముగ ఒక అనుగ్రహము. రక్షించుటకై ఋషులు శిక్షింతురు. అట్లు చేయనిచో చేసిన అధర్మమునకు భవిష్యత్తులో కలుగు ఆపదలు ఎక్కువగా ఉండును. 

ప్రవర్తనమున అధర్మము దొరలినపుడు శిక్షను ప్రభువు దగ్గరగాని, గురువు దగ్గర గాని కోరుట అత్యుత్తమ మని మహాభారతమున వేదవ్యాస మహర్షి తెలిపి ఉన్నాడు. కాని అట్టి అత్యుత్తమ ధర్మము నాచరించు వారు అరుదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రతి సద్గురువు శతాధికముగ శిష్యులకు బోధ చేయును. అందులో శ్రద్ధ గలవారికి శిక్షణ ఇచ్చును. శిక్షణమున శ్రద్ధ చూపు వారికి దీక్ష నిచ్చును. దీక్ష యందున్న వారిని కలిపి నడిపించును. సద్గురువు కలిపి నడిపించు చుండగ శిష్యులు కలిసి నడచుట నేర్వవలెను. కలిసి నడచుట, ఒకరినొకరు తోడ్పడుట, ఒకరితో ఒకరు శ్రుతి కలియుట శిష్యులకు సాధ్యము కాని పని. అట్లని అసాధ్యము కాదు. 

సహనము పెంచుకొనుచు, అహమును 

సమర్పించు కొనుచు కలిసి యుండుటకు, కలిసి పనిచేయుటకు, కలిసి భుజించుటకు, ప్రయత్నింప వలెను. అట్టివారి హృదయములందే సద్గురువు వసించి జ్ఞాన వికాసమునకు నాంది పలుకును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఆత్మ సాధకులకు ఆడంబరములపై వ్యామోహము హరింపబడవలెను. ఆడంబరములకై ఎగబ్రాకు మనసు సత్యమునకు దూరమై నిలచును. ధనకాంక్ష, పదవీ కాంక్ష, వాహనాది సౌకర్యముల కాంక్ష , వస్త్రా భరణములపై కాంక్ష  మొదలగునవి మనస్సుని మలినము చేయును. 

అప్రయత్నముగ ఆడంబరములు చేరినను వాటిపై వ్యామోహం చెందక తన కర్తవ్యము తాను నిర్వర్తించుకొనుట ప్రధానము. అవి ఉన్నను, లేకున్నను తాను తానుగానే ఉండుట నిజమగు నిరాడంబరత్వము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః 🙏*

  కర్మలను మానక వాటియందు హరిని నింపు మార్గము తెలిసినచో చేయు కర్మలనుండియే దివ్యానుభూతి కలుగును. కేవలము ఫలము కొరకు పనిచేయుట వలన పరితుష్టి కలుగదు. ఈశ్వర సమర్పణముగ చేసినపుడే హృదయమున ఈశ్వరుడు సంతోషించును. దేహము తోను, కర్మలతోను సంబంధము లేని జ్ఞానము శోభించదు.

*భాగవతము Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

సద్గురువను వీణకు సప్తతంతువుల వలె అన్యోన్యత కలిగిన శిష్యులు ఉన్నప్పుడు సద్గురువు దివ్యత్వమును అవతరింపచేయును. సాధకులకు సద్గురువెంత ముఖ్యమో, సద్గురువునకు కూడా సాధకులు అంతే ముఖ్యము. సద్గురువునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము వలె శిష్యులేర్పడినచో, సదా బుద్ధి లోకమున  ఉండు సద్గురువు దివ్య సంకల్పమును భూమిపై నిర్వర్తింపగలడు.

 అట్టి సద్గురువు పరిపూర్ణుడు. అట్లేర్పడిన శిష్యులకు  కూడా పరిపూర్ణత సద్గురువు ఏర్పరచగలడు. ఎట్టి విద్యలనైన అట్టి శిష్యబృందమునకు అందించుట సద్గురువునకు సులభము. అందుకొనుట శిష్యబృందమునకు కూడా సులభము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*  

సద్గురువును అనుసరించువారనగా సద్గురువుతో భౌతికముగా  కలిసి మెలసి తిరుగు వారుకాదు. ఆయన బోధనలను అనుసరించే వారే ఆయన్ని అనుసరించు వారు. 

అసత్యము, అధర్మము, కపటము, మోసము, లౌక్యము కలిగి సద్గురువును అనుసరించినను, సద్గురువు సామ్రాజ్యము లోనికి అడుగుపెట్టలేరు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శివునిది దివ్య ప్రజ్ఞ. వేదములో రుద్రుడు అంటారు. బ్రహ్మదేవుని ఫాలభాగములో రుద్రుడుంటాడు.  మనకీ ఫాలభాగములో ఉంటాడు. సృష్టికి దేహము, జీవునకు దేహము ఏర్పడడానికి ప్రాతిపదిక రుద్రుడు. 

పంచేంద్రియాలు బాగా పనిచేయాలంటే పంచాక్షరి పట్టుకోవాలి. రుద్రశక్తి వలన మొత్తము చీకటంతా వెలుగై పోతుంది. 

*ఓం నమః శివాయ*

ఈ మంత్రము నందు ఓం కారమును ఆజ్ఞ యందును, నమః శివాయ అను ఐదు అక్షరములను ఐదు కేంద్రముల యందును దర్శిస్తూ రుద్రుని ధ్యానించవలెను. అప్పుడు మన షట్చక్రములు ప్రభావితమగును.

*Master K.P.K.🙏*

 నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

తోటమాలి విత్తనము నాటిన తరువాత వేచియుండవలెను. సద్గురువు బోధ విత్తనము వంటిది. దానిని హృదయమున పదిలపరచుకొని వేచియుండవలెను. వేచి ఉండుట గొప్ప లక్షణము. సహనము కలవారికే సర్వము లభించును. సహనముతో వేచి యున్నచో విత్తనము  నుండి మొలక ఏర్పడును.

మొలకెత్తిన విత్తనము విషయమున  అప్రమత్తమై ఉండవలెను. దాని పెరుగుదలకు యేర్పడు అవరోధములను తొలగించుకొనుచుండ వలెను. సాధకుడు గూడ సహనముతో అవరోధములను నిర్మూలించుకొన వలెను. అప్పుడు లౌకికమగు స్వభావము అదృశ్యమై, నూతనము, దివ్యము అగు స్వభావము ఏర్పడి, ఫల, పుష్పములు లోకమునకు అందించబడును.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

ఆకాశమార్గాన పోవడానికి ఏడు వీధులున్నాయి. ఏడు వీధులంటే ఏడు లోకాలు. ధాన్యము తినే పిచ్చుకలు భూమికి ఎత్తున కాకుండా మొదటి వీధిన ఎగురుతూ ఉంటాయి. వృక్షాల మీద గల పండ్లు, కాయలు తినే కాకులు , మొదలగు పక్షులు రెండవ వీధిలోనూ;  క్రౌంచ పక్షులు, లకుముకి పిట్టలు మూడవ వీధిలోనూ; డేగలు మొదలగు పక్షులు నాల్గవ వీధిలోనూ; గద్ద జాతి పక్షులు ఐదవ వీధిలోనూ;  బలపరాక్రమముతోను, సౌందర్యముతోను తిరిగే హంసలు ఆకాశమార్గాన ఆరవ వీధిలోనూ; అంతకన్నా ఎత్తైన ఏడవ వీధిలో వినత పుత్రుడైన గరుడుడు, అరుణుడు అవలీలగా పోతూ ఉంటారు. 

అదే పుష్కర ద్వీపము. ఒక్కొక్క వీధి ఒక్కొక్క ద్వీపము. ఒక్కొక్క ద్వీపము ఒక్కొక్క లోకము. ఏడవదే శ్వేత దీపము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

తల్లితండ్రుల నుండి పొందిన జన్మ కంటే గురువు వలన కలిగిన జ్ఞానము వలన ఏర్పడు మరియొక జన్మ శ్రేష్టమైనది. దేహమందు పుట్టినవాడు మరల జ్ఞానము నందు పుట్టవలెను. ముందుగా పరిపూర్ణమైన విశ్వాసముతో గురువాజ్ఞను పాలించుచు, సేవించుచు, ఆచార్యానుగ్రహము పొందవలెను. 

సద్గురువు అభిమానము శిష్యునిపై ప్రసరించిననాడు భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యములు ఆచార్యకృపగా అందివచ్చి మోక్షస్థితిని కలుగచేయును.

ఇట్టి మార్గమునకు విశ్వాసమే ప్రధానము. కేవలము సద్గురువు అనుగ్రహము వలన జాతి, మత, కులములతో సంబంధము లేకయే సమస్త బంధముల నుండి బయల్పడ వచ్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

ధర్మము నతిక్రమించిన ప్రతి చర్యయు దుశ్చర్యయే అగును. దుశ్చర్య వలన జ్ఞానము ఆరిపోవును. ఇంద్రియము లెప్పుడును ఇంద్రియార్థములపై ప్రసరించుచు జీవుని నాకర్షింప చూచును. అట్టి ఆకర్షణమునకు లోనైన వాడు శాంతిని కొల్పోవును. ఎంత జ్ఞానము విన్నను, చదివినను అది మరుక్షణమున హరింపబడును.

సత్యవచనము, దర్మచరితము లేనివానికి మనసున ప్రశాంతత ఉండ జాలదు. స్థిరచిత్తము, ఇంద్రియ నిగ్రహము పొందుటకు, వలసిన నియమావళిని స్వభావమున ఏర్పాటు చేసుకొనవలెను. అందుకే యోగము నందు యమ నియమాదులు పునాదులుగా తెలుపబడినవి. బలమైన పునాదులు లేక కట్టబడిన భవనములు కూలుట తప్పదు. సత్ప్రవర్తనము లేని అమరత్వము మృగ్యము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

మాస్టర్ *C.V.V.* మాట

గుణాత్మకమగు ప్రకృతికి గుణాతీతమగు ఆదికిని నడుమ ఒక వంతెనను నిర్మాణము చేయుట నా యోగములో ఒక ముఖ్య కార్యము.  ఏమీ లేనట్లున్న స్థితి నుండి అన్నీ ఉన్నట్టి స్థితి వరకు ఏర్పరచబడిన దారి ఇది. ఈ దారి తెలిసినవారికి సృష్టి నిర్మాణ రహస్యము, జనన మరణ రహస్యములు తెలియును. కనుక ప్రార్థన మరువకుము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భగవంతుడి బాణమే *ఓంకారము*. పూజ సమయములో ఓం కారాన్ని ఉచ్చరిస్తూ గంట వాయించాలి. దానితో మనలో ఉన్న అసుర కేంద్రములన్నీ మూతబడి, సురకేంద్రములు తెరుచుకుంటాయి. శరీరములోని అన్నిధాతువులకి ఆత్మసంపద, జ్ఞాన సంపద అబ్బుతుంది. ఓం కారము చేయడము వలన శరీరము, మనస్సు పరిశుద్ధమయి, పవిత్ర మవుతాయి.

మనచుట్టూ పరిసరాలలో ఉన్న మహాత్ములు ఆకర్షింప బడతారు. సద్గురువుతో అనుసంధానం దొరుకుతుంది. మహాత్ములు మహత్కార్యాలు చేసేటప్పుడు ఓం కారాన్ని తప్పకుండా ఉచ్చరిస్తారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భాగవత మార్గమున వసించువారు తమ చుట్టూ జరుగుచున్న సన్నివేశములను దైవముగా భావింతురు. దైవముగనే దర్శింతురు. ఇట్లు జరుగవలెనని, అట్లు జరుగవలెనని అభిలషింపరు. ఇట్లెందుకు జరిగినదని ప్రశ్నింపరు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఏమి జరుగుచున్నను దైవమే అని భావింతురు. దైవము కానిదేదియు వారికి గోచరింపదు. తమ అతి, గతి, ఉనికి దైవమే అని వారి నిశ్చయము. 

హృదయము నందు ఈశ్వరుని నింపుకొని యుందురు. అట్టి వారిని ఈశ్వరుడు తన హృదయమున నింపుకొనును. 

*భాగవతము Master K.P.K. 🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జీవితమొక పడవ ప్రయాణం వంటిది. పడవ బరువెక్కుచున్నచో , విలువ లేని వస్తువులను విసర్జించుట నేర్వవలెను. అత్యంత విలువైనది మాత్రమే ధరించి ఇతరములన్ని విడువ వలెను.  అదే విధముగా జీవితమున కూడా ద్వితీయార్ధమునందు ఆత్మ సాధనకై తపన చెందు సాధకుడు అత్యంత విలువైన విషయములందే శ్రద్ధ వహించి  ఇతర విషయములను క్రమముగా  విసర్జించ వలెను. లేనిచో కాలహరణమై  ప్రాణము గతి తప్పు సందర్భమున మోసపోయితినని బాధ పడవలసి యుండును. 

జీవితములో ఏ యే విషయములను వదిలి పెట్టవలెనని నిత్యము పరిశీలించు కొనుచు ముందుకు సాగవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవ ప్రజ్ఞ బాహ్యము లోనికి ప్రవహించు చున్నంత కాలము అతడు శక్తి హీనుడగును. ఇట్టి వారికి సర్పములు సంకేతములుగ తెలుపబడినవి. మానవ ప్రజ్ఞ అంతర్ముఖముగా సాగి, ఊర్ధ్వ గతి చెంది, దైవస్పర్శను, దైవ దర్శనమును పొందిన వారికి శక్తి సామర్ధ్యములు ఇనుమడించి మహత్కార్యములు నిర్వర్తించుటకు తోడ్పడును. ఇట్టి వారి ప్రజ్ఞ గరుత్మంతుని ప్రజ్ఞతో పోల్చుదురు. సర్పములు పొట్టపై ప్రాకుచు  జీవించుచుండును. గరుడపక్షి ఆకాశమునకు ఎగురుటకు ఉత్సహించు చుండును. 

మానవ ప్రజ్ఞ ఇనుమడించి దైవీప్రజ్ఞ అగుట ఒక మార్గము కాగా, పదార్థ సముపార్జనకై పాటుపడుచు పశుప్రాయుడుగా జీవించుట మరియొక మార్గము. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

*ఓం నమః* అనునది పెద్ద మంత్రము. ఓం నమః అంటే అర్ధము నేను లేను అని. మనలో మనవలె ఉన్న దైవము మనలను మేల్కొలిపితే మనము నిద్రలేస్తున్నాము. నేనే లేచాను అనుకుంటే పూర్తి అజ్ఞానము. ఓం నమః అని నిద్ర లేవగానే అనుకోవాలి. దైవము పనే నా పనిగా సాయంత్రము వరకు పని చేసుకుంటాను. అతడి కోసమే జీవిస్తాను. అన్నిటిలో అతనినే దర్శనము చేస్తాను అని ప్రార్థన చేయాలి. 

అదే ఇదిగా ఉన్నది కాబట్టి జరుగుతున్న దానిలో దైవమును చూడాలి. ఇలా ఒక ప్రయత్నము చేయడం భాగవత మార్గములో పరాకాష్ట.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

*యుగాది* ప్రారంభమే *ఉగాది* పర్వదినం. కలియుగము చైత్రశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమైనదని పెద్దలు సూచించినారు. సృష్టి కి గూడ ఇదియే  *ఆది* అని అందురు. ఈ దినము నుంచి ఉన్నతమగు భావములను, ఆశయములను కలిగి ఉండుట కర్తవ్యము. వీనిని ఆచరణమున నిలిపిన జీవితము కూడా ఉన్నతము, నూతనము అగును. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి, చైత్రపౌర్ణమి తిథి అంతము వరకు 16రోజుల పాటు ఆహార విహారముల యందు, ఆలోచనల యందు మలినములు లేకుండునట్లుగా దీక్ష వహించడము ముఖ్యకర్తవ్యముగా ఆర్యులు సూచించిరి. 

అట్టివారు కాలపురుషుని చేత ఆశీర్వాదము పొందెదరు. సత్సాధకులు హెచ్చరికగా ఉండవలెనని ఆశంసనము. సద్గురువులు అందించిన మార్గమున ప్రవర్తనమును  పటిష్టము గావించుకొనుచు ముందుకి సాగవలెను. మరి యొక మార్గము లేదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుడు ఏమియు నేర్చుకొనక, ఏ అనుభూతియు పొందక, ఏ పరిణతి చెందక జీవించుట వ్యర్ధము.  జీవితమున స్ఫూర్తి ఉండవలెను. చురుకుదనముండవలెను. ఉన్నతమగు ఆశయముండ వలెను. ఆశయమునకై కృషి ఉండవలెను. కేవలము పొట్టపోసుకొనుటకే జీవించుటకు మానవునిగ జన్మించవలసిన అవసరము లేదు. 

మానవుడు అగ్నిశిఖ వంటివాడు. అతడు తన జీవితమున ఇంద్రధనుస్సు వలె వెలుగొంద వచ్చును. దీక్షతో కృషి సల్పిన, అతనికి అందుబాటు కాని దేదియు లేదు. బుద్ధిని ఆధారము చేసుకొని అతను ఎంతయో ఎదుగ వచ్చును. మానవుని విలువ ఇదియే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుడు ఏమియు నేర్చుకొనక, ఏ అనుభూతియు పొందక, ఏ పరిణతి చెందక జీవించుట వ్యర్ధము.  జీవితమున స్ఫూర్తి ఉండవలెను. చురుకుదనముండవలెను. ఉన్నతమగు ఆశయముండ వలెను. ఆశయమునకై కృషి ఉండవలెను. కేవలము పొట్టపోసుకొనుటకే జీవించుటకు మానవునిగ జన్మించవలసిన అవసరము లేదు. 

మానవుడు అగ్నిశిఖ వంటివాడు. అతడు తన జీవితమున ఇంద్రధనుస్సు వలె వెలుగొంద వచ్చును. దీక్షతో కృషి సల్పిన, అతనికి అందుబాటు కాని దేదియు లేదు. బుద్ధిని ఆధారము చేసుకొని అతను ఎంతయో ఎదుగ వచ్చును. మానవుని విలువ ఇదియే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

ఎవ్వరికిని ఏనాడు అపచారము చేయకుండుట నిజమగు భాగవత ధర్మము. తనకు శ్రత్రుత్వము లేకుండుటయే భాగవత మార్గము. కొట్టినను, తిట్టినను, సూటిపోటి మాటలాడినను తిరిగి ప్రతీకారము చేయుటకు యిష్టము లేకుండుటయే నిజమగు భాగవత దర్మము. ఇతరులు తనను శత్రువుగా చూచినను, దూషించినను భగవద్ భక్తుడు సంఘటనల యందు అంతర్యామిని దర్శించుచు తన కర్తవ్యమును తాను నిర్వర్తించుకొనును.

అట్టివానిని హింసింప జూచినచో హింసించు వాని జాతి, కులము నశించును.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఒక వ్యక్తికి బంగారముపై ఎంత మోజు ఉన్నచో ఆ వ్యక్తి అంత కామశరీరమున ఉన్నాడని ఋషుల అవగాహన. మానవ ప్రజ్ఞ తూర్పుయందున్నప్పుడు బంగారు కాంతి యందు  మోజు కలిగి ఉండును. మానవ ప్రజ్ఞ పశ్చిమమున ఉన్నప్పుడు అనగా పదార్థమున బంధింపబడి ఉన్నప్పుడు బంగారు లోహముపై మోజు కలిగి ఉండును. 

బంగారు లోహమునకై  ప్రాకులాడుట కన్నా బంగారు కాంతికై ప్రాకులాడుట వివేకము. లోహమును కోరుట కన్నా కాంతిని కోరుట ఉత్తమమని, తరుణోపాయమని జ్వాల్ కూల్ మహర్షి సూచన.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రపంచము మంచి చెడులతో కూడి ఉండును. మంచిని పెంపొందించుటకు గురుపరంపర ఉన్నట్లే, చెడును పెంపొందించుటకు కూడా పరంపర ఉన్నది. దానధర్మములు చేయువారెట్లున్నారో అట్లే దొంగతనము, దోపిడీలు చేయువారు కూడా కలరు. విద్యాపరమగు కార్యమెంత సాగుచున్నదో అవిద్యాపరమగు కార్యము కూడా అంతకంతకూ సాగుచు నుండును. 

అవిద్య విద్య నెదిరించుచుండును. ధిక్కరించు చుండును. కారణము అవిద్యయే.  ఇదంతా అవిద్యా తత్త్వము. నిందింపబడినపుడు మౌనముగా ఉండుట పరిపూర్ణమగు విద్య.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

యోగవిద్య ఒక రసాయన విద్య వంటిది. యోగ సాధకుడు ఉన్న స్థితి నుంచి ఉత్తమస్థితి కొరకై సాధనా మార్గమున యత్నించు చుండగా అతనిలో కొన్ని మార్పులు జరుగును. యోగ విద్యలో మానవుని పాశవిక స్వభావము హరించబడును. మానవ స్వభావము సంస్కరింపబడును. దైవీ స్వభావము ఆవిష్కరింప బడును. గొంగళి పురుగు దేహముపై ప్రాకిన కంపరము కలుగును. సీతాకోక చిలుక మేనుపై వ్రాలిన ఆహ్లాదం కలుగును. ఇట్టి రసాయనమే యోగవిద్య యందు ఉన్నది. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రపంచము మంచి చెడులతో కూడి ఉండును. మంచిని పెంపొందించుటకు గురుపరంపర ఉన్నట్లే, చెడును పెంపొందించుటకు కూడా పరంపర ఉన్నది. దానధర్మములు చేయువారెట్లున్నారో అట్లే దొంగతనము, దోపిడీలు చేయువారు కూడా కలరు. విద్యాపరమగు కార్యమెంత సాగుచున్నదో అవిద్యాపరమగు కార్యము కూడా అంతకంతకూ సాగుచు నుండును. 

అవిద్య విద్య నెదిరించుచుండును. ధిక్కరించు చుండును. కారణము అవిద్యయే.  ఇదంతా అవిద్యా తత్త్వము. నిందింపబడినపుడు మౌనముగా ఉండుట పరిపూర్ణమగు విద్య.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

కోరికలు కోరుచు దేవుని ప్రార్థించువారు తమకు తెలియకయే దేవునికాజ్ఞలు పెట్టుచుందురు. కనుక వారి కోరికలు తీరవు. అట్లుగాక భక్తితో దాసులైన వారికి దేవుడు దాస్యము చేయును. ఈ రహస్యము గమనింపలేక సంసారజీవులు భక్తి సాధనలో మోసపోవు చుందురు.

భగవదారాధన భగవంతునికి దాసునిగ పనిచేయుటకే అని తెలియవలెను. తాను దైవమునకు దాసుడై మెలగినచో దైవము గూడ వాత్సల్యముతో, వేడుకతో దాస్యము చేయును. అర్జునుడు శ్రీకృష్ణునికి దాసుడు. అతనిని రక్షించుట తన దర్మమని నిర్ణయించి శ్రీకృష్ణుడు రథసారధ్యము చేపట్టెను. ఇది ఒక భాగవత రహస్యము.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమ🙏*

మాస్టర్ *C.V.V.* మాట 

జీవుడు భౌతిక శరీరము వదలు సమయమున యాతనా శరీరమున ప్రవేశించును. ప్రార్థన వలన యాతనా శరీరములో ఉండగానే జీవునికి పిండాండ, బ్రహ్మాండ జ్ఞానము అందించబడి, ఆ జ్ఞానముతో మరల భౌతికలోకమున వలసిన పరిపూర్ణతను త్వరితగతిని పొందవచ్చు. అందుకని ప్రార్థనా సమయము అత్యంత విలువైనది.

                              *ఇది నా మాట*

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

అభ్యాసము, వైరాగ్యము అనునవి ఆత్మ సాధనకు అత్యున్నతమైన సాధనములు. అభ్యాసమనగా అంతరాయములు లేక నిరంతరము కృషి సల్పుట. అట్లు సలిపిన వారికి ఏ పనియైనను సిద్ధించును. అక్షరాభ్యాసమనగా అక్షరములను నిరంతరము అభ్యసించుట. అభ్యాసమునకు శ్రద్ధ, నిరంతరత్వము ముఖ్యము. 

ప్రతి దినము ఒకే సమయమున, ఒకే పనిని శ్రద్ధతో చేయుట వలన విషయము పై పట్టుచిక్కును. శ్రద్ధ గలవానికే సిద్ధి. అశ్రద్ధ గలవాడు అసమర్థుడుగనే ఉండిపోవును. శరీరము, శిరస్సు, కంఠము తిన్నగ నిలిపి స్థిరముగ కూర్చుండి, ప్రశాంత చిత్తుడై భ్రూమధ్యమున స్థిరమైన జ్యోతిని దర్శించు చుండవలెను. ఇది మనస్సుకు ఈయవలసిన శిక్షణ.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః 🙏*

సృష్టి ధర్మములను పరిశీలించినచో పుచ్చుకొనుట నేర్చినచో పరిపూర్ణత పొందలేమని, ఇచ్చుట నేర్చినచో పరిపూర్ణత దిశగా సాగుదమని తెలియును. ఇచ్చుచుండుట వలనే సూర్యుడు సూర్యమండలానికి అధిపతియై ఉన్నాడు. అన్ని గ్రహములు అతని చుట్టును తిరుగుతున్నవి. పుచ్చుకొనుట వలన చంద్రుడు భూమి చుట్టును తిరుగుచున్నాడు.

 మనసు ప్రధానముగా గాక బుద్ధి ప్రధానముగా జీవించినచో, బుధుని వలె సూర్యుని చుట్టును తిరుగవచ్చు. దీనినే యజ్ఞార్థ జీవనము అందురు. అట్టి జీవనము గావించు యోగులు *అపరిగ్రహమను* దీక్షలో ఉందురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః 🙏*

మానవునికి, మానవ జాతికి పరిష్కారము ఆత్మ పరిశీలన మార్గము నుండియే లభించును. ఆత్మ పరిశీలనము లేని మానవుడు పశుప్రాయుడే. ఆత్మపరిశీలన మున్నచోట అంతరాత్మ ప్రబోధముండును. ఎచ్చట అంతరాత్మ జీవ స్వభావమును అనునిత్యము ప్రశ్నించునో, అచ్చట జీవుడు బాధ్యతాయుతుడై జీవించగలడు. బాధ్యత ప్రధానమని తెలిసిన వాడికి జీవన నౌకకి చుక్కాని దొరికినట్లగును. 

ఎప్పటికేది ప్రస్తుతమో తాత్కాలికముగ దాని నాశ్రయించి జీవించువాడు జీవితమున యెట్టి పురోగతి సాధించలేడు. కేవలము మాటకారియై సన్నివేశములందు తప్పించుకు తిరుగుచు తన్ను తాను మోసము చేసుకొనుచు బ్రతుకును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

హరి మాయను అర్ధము చేసుకొన యత్నింపకుము. ఆ బుద్ధి మాని, సేవించు బుద్ధి అలవరచుకొనుము. అనురాగముతో సృష్టి జీవులను సేవించినచో, హరిని దర్శింప వీలగును గాని, అనురాగ మార్గము విడిచినచో ఆదిశేషువు గూడ హరి మాయను గ్రహింప లేడు.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

అద్భుతముల కాకర్షించువారు  సత్యమును ఎరుగలేరు. సత్యమునకు  ఆకర్షింపబడినవారు అద్భుతములకు విలువనీయరు. సత్యమెరిగిన వారికి అద్భుతములు పిల్ల చేష్టలుగా ఉండును. సత్యదర్శనము నాశించుట వలన జీవుడు సత్యమార్గమున ప్రవేశించి, సత్యదర్శనులగుదురు. 

అద్భుతములను నాశించువారు ప్రకృతి శక్తులకు లోనై మాయను బడుదురు. అద్భుతములకు అచ్చెరువొందుటకన్న ఆచరణాత్మకమగు యోగమున ప్రవేశించుట శ్రేష్టము. సత్యదర్శనమున పయనించువానికి  పరిశ్రమించుటే గాని, ఆశించుట అనునది విసర్జింతురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

ధర్మమునకు జీవితమును సమర్పించుట ఒక ఉత్తమమగు దీక్ష. ఎట్టి పరిస్థితులు ఎదురైనను ధర్మమునే అనుసరింపవలెను. ఈ కృషి నిన్ను ఎన్నో జన్మపరంపరల నుండి తరింపచేయును. ధర్మాచరణ మహాత్మ్యము యింతదని చెప్పుట కష్టము. ధర్మమును తు. చ. తప్పని వానిని మృత్యువు గూడ స్పృశింప లేదు. 

యుధిష్ఠిరు డొక్కడే ధర్మమునకు దీటుగా నిలిచి బొందితో స్వర్గమును చేరెను. ఎంత ధర్మమమును ఆచరింతువో అంత రక్షింపబడుదువు. ఇతరములు రక్షింపలేవు. అధర్మమున్న చోట శత్రువులు ఉందురు. ధర్మమునకు సూర్యదేవుడే ప్రమాణము. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

ఆషాఢమాసము మొదటి రెండు రోజులు పునర్వసు నక్షత్రప్రభావము ఉంటుంది. పునర్వసు అంటే మళ్ళీ ఉండడానికి వస్తున్నట్లు. దైవమే గురువై దిగివచ్చి, మన హృదయములో  ఉపస్థితుడై ఉండడానికి వచ్చే అద్భుతమైన రోజు గురుపౌర్ణమి. పునర్వసు నక్షత్రం తరువాత పుష్యమి నక్షత్ర ప్రభావము 13రోజులుంటుంది. పుష్యమి నక్షత్రము అతి కాంతివంతమైన నక్షత్రము. (భరతుని నక్షత్రము. భరతుడు రామునితో సరి సమానమైన వాడు.) ఈ మాసములో  ఆకాంతిని మన హృదయములో పదిలపరచుకోవడానికి కృషి చేసుకుంటూ ఉండాలి. 

పునర్వసు తత్త్వాన్ని, పుష్యమీ కాంతిని అందుకోలేకపోతే ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశిస్తాము. ఈ నక్షత్రము పెద్ద పాము.  దాని తోక మూలా నక్షత్రములో ఉంటుంది. కాలముచే మింగబడిన వాడిలాగా బతుకుతాము.  సద్గురువు స్పర్శ, అనుగ్రహము పొందితే మూలా నక్షత్రము నుంచి బయటకు వచ్చి పూర్వాషాడా ద్వారా ఉత్తరగతి చెందవచ్చు. తెలిసి చేసుకొనేదానికి అనుభూతి ఎక్కువ ఉంటుంది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్గురువు శిష్యులలో ఒక్కటి చూస్తాడు. తన వద్దకు వచ్చిన వారిలో ఎవరు తమ అవసరానికి వంగి ఉన్నారు? ఎవరు లోపల వంగి ఉన్నారు? అవసరానికి వంగిన వారి తల అహంకారముతో ఎప్పుడైనా లేవవచ్చు. నీ విశ్వాసమే నీకు గురువు. నీ నమ్మకమే నీకు గురువు. *గురువాక్యము తక్షణ కర్తవ్యము* గురుపూజలలో సేవ చేసేవారిని (ఎవరూ గుర్తించని వారిని) సద్గురువు గుర్తిస్తారు. చేసే సేవలో ఎంత శ్రద్ధ, నాణ్యత ఉన్నది?  అన్నది ముఖ్యం.

నాకున్న అన్ని కర్తవ్యాలలో ముఖ్యమైన కర్తవ్యము ఏమిటంటే నాకు నా గురువుగారు అప్పచెప్పిన పనే. దానివలనే నా జీవితము కడతేరుతుందన్న విశ్వాసము ఉండాలి.  ఆకర్తవ్యాన్ని ఆచరించినపుడు సద్గురువు మనకున్న భయంకరమైన సమస్యల నుంచి మనలను దాటించేస్తాడు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

గురుత్రయము అంతా వారి గురించి జీవించిన వారు కాదు. అలా జీవించారు కాబట్టి వారు సద్గురువులు అయ్యారు. గురుపౌర్ణమికి  చాలా రోజుల ముందు నుంచే గురువును ఆవాహనం చేసుకోవాలి. దైవమే గురువుగా మన ఇంటికి వచ్చే సమయము. మనము ఉన్ముఖముగా ఉంటే మనలను తనతో పాటు పట్టుకెళ్ళి, భూమి మీద సంచరించే దారులలో మనము చిక్కుబడకుండా తీసుకొని వెడతాడు.

కర్కాటక సంక్రమణం నుంచి, మకర సంక్రమణము వరకు రాజతోరణము అంటారు. మన జీవితము ఒక రాజ మార్గముగా నడుస్తుంది. మార్గశిరమాసము నుంచి దివ్యతోరణము (divine arch) అనగా దివ్యపథము వైపు ప్రయాణం మొదలగును. ప్రతి సంవత్సరము మనలోనికి వచ్చిన సద్గురువు మనతో పాటు వసించి, మనకు అన్నీ నేర్పి, మనలని చక్కగా తయారుచేసి ఊర్ధ్వగతిలో ప్రయాణము చేయించడానికి సహకరిస్తాడు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము.

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

నా మార్గము మహిమలు చూపించి , మురిపించే మార్గము కాదు. ప్రార్ధన నిరంతరము చేసుకుంటూ ఉండడమే.  నేనే నీ నుంచి నిర్వర్తించుకుంటాను. మౌనముగా నిన్ను ఆశీర్వదిస్తాను.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:18] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః 🙏* 

సృష్టి యందు సముద్రమునకు ఒక విశిష్టస్థానమున్నది. నదుల నుండి, వాగుల నుండి, వర్షపాతము నుండి ఎంత జలము చేరినను సముద్రము పొంగదు. ఎన్ని విషయములు సముద్రమున చేరినను సముద్రమట్లే ఉండును. దానికి స్థిరమైన, హద్దుమీరని ఉనికి కలదు. 

అట్లే శాంతిని పొంది, బుద్ధియందు స్థిరపడిన వానిని మరి యే భోగ్య విషయములు శాంతిని, తృప్తిని కలిగించవు. పొంగుట, క్రుంగుట అనునవి సముద్రమునకు, శాంతి చిత్తునకు లేవు. ఇదియే బ్రహ్మానంద స్థితి. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

తాబేలు ఆధ్యాత్మిక సాధకునకు చక్కని సందేశమిచ్చు చున్నది. పరిస్థితులను బట్టి తాబేలు తన సర్వాంగములను తన లోనికి ఉపసంహరించుకుని, అనుకూల పరిస్థితులేర్పడినపుడు మరల అంగములను విస్తరించును. పురోగమనము, తిరోగమనము తెలిసిన ప్రజ్ఞ  తాబేలుది. 

మానవుడు కూడా అట్లే అవసరమును బట్టి బహిర్గతుడగుట, అవసరము లేనపుడు అంతర్గతుడగుట నేర్చు కొనవలెను. దైవ స్మరణ నిలచినచో ఇంద్రియార్థముల వెంట ఇంద్రియములు పరుగెత్తవు. అప్పుడు ప్రజ్ఞ స్థిరమగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

శని గ్రహము భౌతిక శరీరానికి సంబంధించినది. శుక్రగ్రహము మనలో ఉండే సూక్ష్మ శరీరానికి సంబంధించినది. ప్రతి వారి భౌతిక శరీరము నుండి, సూక్ష్మ శరీరం విడదీసి దానిలో ఉండే జన్మ జన్మల రహస్యాలను పట్టుకొని వారికి దాని ప్రకారము యోగము ను అందిస్తాను.  శనిగ్రహము ఒప్పుకోకపోతే శుక్రగ్రహము ఏమీ చేయలేదు. శనిగ్రహానికి సంబంధించిన శిక్షణ, శుక్రగ్రహానికి సంబంధించిన అనుభూతి నా యోగము వలన కలుగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

జ్ఞానము సూర్యోదయము వంటిది. సూర్యుడు ఉదయించు చున్నకొలది  చీకటి తొలగిపోవు చుండును. అట్లే జ్ఞానము కలుగుచున్న కొలది చిత్త భ్రమలు, భ్రాంతులు నశించు చుండును. 

దైవమును గూర్చిన సదవగాహన జ్ఞానముచే తెలియబడినట్లు అజ్ఞానమున తెలియబడదు. జ్ఞానము కలుగుచున్న కొలది తన స్వరూప స్వభావములు తెలిసి, తానున్నానని భ్రమ చెందక, దైవమే తానుగా నున్నాడని తెలిసియుండును.

*Master K P K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*

మాస్టర్ *C.V.V.* మాట 

ప్రార్థనకు విశ్వాసము ముఖ్యము. విశ్వాసమే శ్వాసగా మీ జీవితము సాగవలెను. చెప్పినది చెప్పినట్లు చేసినచో నేనిచ్చిన వాగ్దానము నెరవేరును. తర్కముల వలన ప్రయోజనము లేదు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

*శంఖం* లో  శం, ఖం అను రెండు శబ్దాలున్నాయి. సృష్టిలో శని గ్రహానికి సంబంధించిన తత్త్వమంతా  శం అనే శబ్దములోనూ లోనూ, బృహస్పతికి సంబంధించిన తత్త్వమంతా ఖం అనే శబ్దములో లోనూ ఉన్నది. బృహస్పతి అంటే విప్పారేటటువంటి చైతన్యము. శని దానిని స్థాపనము చేయగలిగిన చైతన్యము. 

మనలో వికాసము కలిగి, ఒక స్థిరత్వము ఏర్పడాలంటే ఈ రెండు ప్రజ్ఞలు మనలో పనిచేయాలి. దానినే మిత్రా వరుణులుగా చెప్పారు. కనుక నారాయణుని చేతిలోఉండే శంఖమును ధ్యానము చేయాలి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

గురుపరంపర లోని మహాత్ములందరూ మొదట సాధారణ మానవులే. కష్టసుఖములను అనుభవించిన వారే. తప్పు, ఒప్పులు చేసినవారే. నిందా స్థుతులను భరించిన వారే. సత్సాధనా మార్గమున వ్యక్తిగత కర్మను దగ్ధం చేసుకొనుచు, దివ్యకర్మను పెంపొందింప చేసుకొనుచు వెలుగు లోకమును నిర్మించుకొని అమృతత్వమును సాధించి, మానవ శరీరములందు స్వచ్ఛందంగా జీవించుచు, లోకహితములైన  కార్యములను  ఒనరించుచున్నారు.

*Master K.P.K🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవము, గురువు యథార్థముగా వేరుగాదు. దారిచూపు గురువు అంతర్యామి యొక్క సగుణమూర్తి అని తెలియుము. అతడు చూపిన దారిని సందేహింపక నడచు చుండుటయే నీ కర్తవ్యము. గురువాఙ్ఞ తక్షణ కర్తవ్యమని భావింపుము. అనగా వెంటనే నిర్వర్తింప వలసినది కాని, ఆలస్యము చేయదగినది కాదు. గురువు నీకొసంగిన బాధ్యతను మౌనముగా నిర్వర్తించుటయే నీ వంతు గాని, చర్చనీయాంశం కాదు. 

ప్రక్కచూపులు లేక ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించుట అనుగ్రహమునకు దారితీయును. నీ తెలివి తేటలు, సమయస్ఫూర్తి ఆ కార్యమునకే వినియోగించ వలెను. గురువాక్యము ననుసరించుట అనగా రైలు బండి ఎక్కుట వంటిది. బండియే గమ్యమునకు చేర్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుని మనస్సు పరిపరి విధములుగా పోయి షడ్వికారములకు గురియగు చుండును. అట్టి మనస్సు సుఖదుఃఖాది ద్వంద్వముల యందు కొట్టుమిట్టాడుచుండును. అట్టివానికే శాంతియు ఉండదు. ఇది మానవుని ప్రధానమగు సమస్య. 

ఈ సమస్యకు పరిష్కార మొక్కటే. తనకు కలుగు భావముల యందు దైవమును చూచుట. ఈ అభ్యాసము సిద్ధించినచో మనిషి స్థిరమతి అగును. మనో నిగ్రహము పేర ఎన్ని ఇతర సాధనలు చేసినను మనస్సు నిగ్రహింప బడదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V* మాట 

సమయపాలనము, వినయము, విధేయత, శీలము నా యోగమున ప్రధానమగు అంశములు. సమయపాలనము లేనివారు ఏమియును సాధించలేరు. యోగ నియమములను నీ వ్యక్తిగత సౌకెర్యమునకై మార్పుచేయకుము. అది కుటిలత్వము. నియమములకు నీవు లొంగవలసినదే గాని, నియమములు నీకు లొంగవు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*

మాస్టర్ *C.V.V.* మాట 

ప్రార్థనకు విశ్వాసము ముఖ్యము. విశ్వాసమే శ్వాసగా మీ జీవితము సాగవలెను. చెప్పినది చెప్పినట్లు చేసినచో నేనిచ్చిన వాగ్దానము నెరవేరును. తర్కముల వలన ప్రయోజనము లేదు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దాచుకొనుట, ప్రోగుచేసుకొనుట కన్న పదిమందికి పంచుట యోగమునకు అత్యంత ఆవశ్యకం. కర్మ బంధము సడలును. పెంచుకొను వానికి బంధములుండును. ప్రోగు చేసిన ఆస్తులను, కీర్తిని, పరివారమును రక్షించుకొనుటలో జీవి సతమతమగుచున్నాడు. పరులహితమునకై జీవించువారికి రక్షణ సహజముగా కలుగును. ఇది సృష్టి ధర్మము. 

రక్షించుకొనుట కాక పరిరక్షించుట నేర్వవలెను. పరిరక్షించు వాని రక్షణ దైవమే కలుగచేయును. ఈ విషయమునకు సంబంధించి భాగవతమున ఒక పద్యమున్నది.

ధనము వీధిపడిన దైవవశమున నుండు.

 పోవు మూలనున్ననైన 

అడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు

రక్షితుండు మందిరమున జచ్చు.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

నా శిక్షణా విధానము గాని, బోధనా విధానము గాని నిత్యనూతనములు. వాని విలువ దశాబ్దము ప్రార్థన చేసిన వారికే కొంత తెలియగలదు. కనుక ప్రార్థనను ప్రశ్నింపక నిర్వర్తించు కొనుము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సదాచారమనగా మన ఆచరణము ఇతరులకు శ్రేయస్సు కలిగించునదిగా ఉండవలెను. పవిత్ర గ్రంథములను వల్లె వేయుట, దేవాలయుల యందు ప్రదక్షిణము చేయుట, గుంజీలు తీయుట, ప్రత్యేకమగు వస్త్ర

ధారణము ఇత్యాది వన్నియు సదాచారమని భ్రమపడుట అజ్ఞానము. తోటి జీవునకు చేయు హితమే సదాచారము. అహితము దురాచారము. 

దురాచారము కలుపు విత్తనము వంటిది. అది తోటను చెరచును. కలుపు ఎవ్వరికిని పనిరాదు. ఇతరుల రక్షణ, పోషణలకు చేయు కృషి అంతయు సదాచారమే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భూమి మీద ప్రార్థనా మందిరములు, దేవాలయములు, మసీదులు, చర్చిలు, లెక్కకు  అందనంతగా ఏర్పడుతున్నవి. కాని దైవము మాత్రము ఎవ్వరికిని లభ్యమగుట లేదు. బాహ్యమున దేవాలయ నిర్మాణము లెన్ని జరిగిన ఏమి ప్రయోజనము?

దేవాలయములు నిర్మించు వారి లోపల సంస్కారములు పరిశుద్ది పొందవలెను. దేవాలయమున దేవుని ప్రతిమను ప్రతిష్టించు లోపల మన లోపల దేవాలయమున దైవము యొక్క ప్రతిమగ, మిమ్మల్ని మీరే గుర్తింపవలెను. దైవము దైవప్రతిమ నుండి ప్రకాశించుచున్నట్లుగ నీ యందలి దైవము నీ నుండి ప్రకాశింప వలెను. దేవాలయమును శుచిగా ఉంచునట్లే స్వభావమును శుచిగా ఉంచుకొన వలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నీలో ఉండే కోరికలు ధర్మాన్ని అతిక్రమించి ఉంటే కామశరీరము అనే తుప్పు  సూక్ష్మ శరీరం చుట్టూ చేరుతుంది. నీ సాధన అంతా సూక్ష్మ శరీరము యొక్క పటిష్టతను బట్టి ఉంటుంది. నీ సమస్త సౌకర్యాలను చూసేవాడినని నమ్మకము ఉంటే ఇంక ఏమీ కోరుకోవద్దు.

*Master K.P.K🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జీవితములో ఎంత సాధించినను, ఇంకను సాధింపవలసినది ఎంతైనను ఉండును. చాలా చేసితినని, ఇక చాలు అనుకొనుట తమోగుణ లక్షణము. తమోగుణము గలవాడు పనులు ఎప్పుడంతమగునో  అని వేచి యుండును. విముఖతతో కార్యములు చేయును. 

 పనులను నిశితమైన దృష్టితో నిర్వర్తించుచు, ఉన్నత ఆశయ సిద్ధికై  పాటుపడుచు జీవించువారి యందు పరమగురువులకు ఆసక్తి మెండు. అట్టి వారికి అదృశ్యముగా సహాయము అందించుదురు. వారి పనులు స్వల్ప ప్రయత్నముతోనే సిద్ధించుటకు కారణమిదియే. క్రియాశూన్యు లగువారి యందు (సేవ చేయని) వారి యందు పరమగురువులకు ఆసక్తి తక్కువగా ఉండును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుని సంస్కారమును అతని వినయమును బట్టి పరమగురువులు అంచనా వేస్తారు. విద్యలు వినయమును పెంచవలెను. వినయము పెరిగిన కొలది అహంకారము తరుగును. ఎచ్చట నిరహంకారము, విద్య, వినయము ఉండునో అచ్చట పరమగురువులు సాన్నిధ్యమిత్తురు. 

ఈ మూడును ఉన్నచోట హృదయము వికసించుటకు సిద్ధమై ఉండును. వినయము సారవంతమగు భూమిగ, విద్య బీజముగ, నిరహంకారము నీరుగ హృదయ పుష్పవనములు పెరుగుచుండును. కలుపు అను అహంకారము పెరుగకుండ చూచుకొన వలెను. 

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విష్ణువుని గూర్చిన కథలు సంతాపమును తొలగించును. పాపబుద్ధిని పోగొట్టును. ఇహమునకు, పరమునకు కూడా మేలు కలుగును. కావలసిన సంపదలు సిద్ధించుట జరుగును. విష్ణు కథలను వినునపుడు మనసు నిర్మలమగును. వానిని వివరించుటయు, వినుటయు అదృష్టము. అట్టివారి సంస్కారములు ఉత్తమగతి కలిగించును. నారాయణుని గుణములను, మహిమను వర్ణింపలేక అతనిని అనంతుడనిరి.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవులలో  తనను గూర్చిన భావము మిక్కుటమైనపుడు ఇతరులను లక్ష్యపెట్టని స్వభావము ఏర్పడును. ఇతరుల యందు నిర్లక్ష్యము, చులకన భావము సహజముగ ఏర్పడి ఉండును. ఇట్టి వారు హృదయమును చేరుట దుర్లభము. తీరని కష్టనష్టములు పెరిగి పశ్చాత్తాపము కలిగిన తరువాత గాని అహంకారము తగ్గదు.

బృందముగా జీవించువారి యందు గూడా అహంకారము కారణముగా బృందములు విచ్చిన్నమగుచున్నవి. అహంకారమును ప్రతి నిత్యము నిర్మూలించుకొనుట ప్రార్థన యందు భాగమై ఉండవలెను.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

సూర్యుడు ఉదయింపగనే లోకాన్ని వెలుగుతో నింపినట్లు, నా సంకల్పముతో, కేవలము శబ్దోచ్చారణతోనే సౌరమండలము నందలి ప్రాణమయ తరంగములను ధారగా ప్రవహించు ఏర్పాటు చేసితిని.  నా నామాక్షరములతో కూడిన మంత్రము మిక్కిలి ప్రారంభదశ నుండి పరిపూర్ణత్వము సాధించువరకు సరిపోవును. కనుక ప్రార్థన మరువకుము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రతి దినము రెండు ముఖ్య సన్నివేశములు జరుగుతున్నవి. చీకటి వెలుగు అగుట, వెలుగు చీకటి అగుట. ఇవి వరుసగా ఉదయపు సంధ్య, సాయం సంధ్య. అవి పవిత్ర సమయములు కనుక ఈ సంధ్యలకు వందనము సమర్పించ వలయునని, సంధ్యా వందన ప్రక్రియను పెద్దలు ప్రభోదించిరి. అట్లు చేయవలెనని కోరిక ఉన్నను తీరిక లేదు గనుక, గురుప్రార్థనము చేసుకోమని సుగమ మార్గమును సూచించిరి. 

వారు ఆచరించి మార్గదర్శకులైనారు. సంధ్యా సమయమును సద్వినియోగ పరచుకొనవలెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సూర్యుడు నిర్విరామ, నిష్కామ కార్యనిర్వహణమునకు మార్గదర్శకుడు. వాపీ కూప తటాక నదీ నద సముద్రజలముల సారమును తన కిరణముల ద్వారా గ్రహించి, దానిని పవిత్రీకరించి, తిరిగి వర్షరూపముగా ప్రసాదించు చున్నాడు.

సద్గురువు గూడా తన శోధన, సాధన, ఆరాధనల ఫలితముగా కలిగిన జ్ఞానమును, ఆనందానుభూతిని అర్హులైన వారికి, ఆశ్రయించిన వారికి బోధించుచు, విస్తృతి చెందును. అట్లు మార్గమున తాను నిలిచి మనలను చీకటి నుండి వెలుగునకు దారి చూపించి, చేయి అందించి, పయనింప చేయు వాడు గురువు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుని దేహము భూమి వంటిది. దేహము, భూమి నరప్రజ్ఞకు వేదికలు. అపవిత్రమగు వేదికపై ప్రజ్ఞావికాసము, పురోభివృద్ధి కలుగనేరవు. భూమిపై సంచలనములకు  గూడ మానవులే ఎక్కువ కారణము. కోరికలు, ఆలోచనలు, భాషణముల యందు పవిత్రత పెంచుకొను చుండుట సాధకుల కర్తవ్యము. అటుపైన ప్రార్థన, పూజాది క్రతువులు, సద్గోష్టి, సద్గ్రంథ పఠనము, సంకీర్తనము ఏర్పరచుకొనవలెను. 

 వీటి యందు విశ్వాసమేర్పడుట అదృష్టము. ఏర్పడకుండుట దురదృష్టము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

నిజమైన భక్తులు భగవంతునికి నచ్చిన విధముగ వర్తించుచు నుందురే గాని, తమ కొరకేమియు ఆశింపరు. అట్టి వారికి భగవంతుడు సాన్నిధ్యమిచ్చి, తనవారిని చేసుకొనును. తమ కొరకై దైవమును ప్రార్థించు వారికి కోరికలు తీరుట, మరల కోరికలు కలుగుట జరుగుచుండును. కాని భగవత్ సాన్నిధ్యము లభించదు. తృప్తి ఏర్పడదు. రసానుభూతి ఉండదు. 

కృష్ణుని భార్యలు భౌతికముగా సమీపమున ఉన్నను, వారికన్నా, సమర్పణ బుద్ధి చూపిన గోపికలు కృష్ణ సాన్నిధ్యమును అమితముగ పొందిరి.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః 🙏*

మాస్టర్  *C.V.V.* మాట 

ఒక చక్రవర్తి తన విశాల సామ్రాజ్యములోని బహు ప్రాంతములలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోడానికి రహస్యముగా పర్యటించును. అటులనే ఈ భూమి మీద ఎలాంటిమార్పులు మానవునికి అవసరము అని అన్ని సంగతులు తెలుసుకొనడం లాంటిది నా ఈ ఉనికి. నేనిప్పుడా పని చేస్తున్నాను.

*Master K.P.K🙏*

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్గురువులు సామాన్యులను స్పృశింపరు. వారితో కలిసిమెలిసి మెలిగినను, తన స్పర్శ సత్యాన్వేషులకే నొసగును. అతని స్పర్శ తగిలిన సాధకుని జీవితము అందమును, ఆనందమును, వికాసమును పొందును. అతను శిక్షణ ఇచ్చునే గాని, శిక్షించడు. 

ఇతరుల ఉద్దేశములు, భావములను బట్టి వారియందు ప్రతిస్పందించుచు, వారి బలహీనతలను క్రమముగా తొలగించును. అహంకారులయందు, విషయాసక్తుల యందు మౌనము వహించును. జ్ఞానాసక్తి ఉన్న చోట ప్రతిస్పందించును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః 🙏*

మానవునికి కనువిప్పు కలిగిన నాటి నుండి జీవితము మరియొక మలుపు తిరుగును. గానుగెద్దు జీవితము నుండి మరొక జీవితమునకు ఉత్సాహమేర్పడును. అనిత్యమగు విషయముల యందు, విలువల యందు ఆసక్తి తగ్గి, శాశ్వత విలువల యందు ఆసక్తి పెరుగు చుండును. జీవుల సేవ యందు రుచి పెరుగును. పరహితమునకు జీవితమును సమర్పించుకొను చుండును. 

అట్టి సమయమున అదే విధమగు జీవలక్షణములు గల సజ్జనుల సాంగత్యము లభించి, సత్సంగ బలముతో ముందుకు సాగును. తన స్వభావమును అనునిత్యము పరిశీలించు కొనుచుండగా జీవితము దివ్యమైన మరియొక మలుపు తిరిగి, సత్యదర్శనములు జరుగును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమ*🙏

పరిమితము నుండి అపరిమితము లోనికి ప్రవేశించవలెనన్నచో జీవునకు పరహిత జీవనము తప్పనిసరి. తనను, తనవారిని పోషించుకొనుట, తన సంపదను తాను కాపాడుకొనుట మాత్రమే చేయువారు సంఘమున గౌరవముగా బ్రదుకుతురే గాని, తమ సంసారము నుండి తరింపరు. తనవారు, తన ఆస్తిపాస్తులు తనను చుట్టుముట్టి యుండగా ఇతరుల హితము కొరకు జీవించు బుద్ధి కలుగదు. కలిగినను ఆచరణ ఉండదు. 

ప్రేమయే పునాదిగా యితరులకు సేవ

చేయడము వలన పవిత్రత పెరుగును.  పవిత్రత ఏర్పడు చుండగ నిర్మలత్వము ఏర్పడును. ప్రజ్ఞ యొక్క పరిధి పెరుగును.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

లోకమున శిష్యులు తలచు విధముగ పరమగురువు తన అనుయాయులకు  గోరుముద్దలు తినిపింపరు. కర్తవ్యము లోనుండి అందవలెను. ప్రతి శిష్యుడును సేవ, శ్రద్ధ, భక్తి, క్రమశిక్షణము, స్వాధ్యాయము, అను సాధనాంశముల ద్వారా కాలక్రమమున ఒక పరమగురువు పదవి నందగలడు. ఈ నాటి పరమగురువులందరూ ఒక నాటి సాధకులే. 

ఈ నాటి సాధకులందరూ ఒక నాటి సామాన్య మానవులే.  పైన చెప్పిన సాధనా అంశములు నిర్విరామముగా నిర్వర్తింపబడినపుడు పరిణతి జరుగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రతి మన్వంతరమునకు ఒక ప్రత్యేకత ఉన్నది. వైవస్వత మనువు అనగా చక్కటి ఆలోచనా సరళితో జీవితాన్ని ధర్మమైన మార్గములో నిర్వహించే టటువంటి మనువు. ఒక విషయము లోపల అందితే ఆవిషయాన్ని కూలంకషముగా అవగాహన చేసుకొని, పరిష్కారము ఇచ్చేటటువంటి  బుద్ధి ప్రజ్ఞ. 

ఒక సంకల్పాన్ని చక్కగా విడదీసుకొని, వివరించుకొని, మంచి చెడ్డలు చూసుకొని, ధర్మాన్ని ప్రధానముగ అన్వయించుకొని, ధర్మము ఆధారముగా, అర్ధకామములు నిర్వర్తించుకోవడము అనే వివేచన ఇచ్చేవాడు వైవస్వత మనువు.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

మాస్టర్ *C.V.V.* మాట 

ప్రాణము అనంతమయినను, అది వసించు ఉపాధులు ప్రాణమును నిలుపుకొనలేక పోవుచున్నవి. అందుకని  దేహమునకు మరమ్మత్తును గావించి, ప్రాణములను నిలిపి, యోగమున నిలబెడుదును.  ఇది నాప్రార్ధన ద్వారా పొందవచ్చును. ఇది నా వాగ్దానం. 

*Master K P K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఒక మారు పరమగురువుల బృందము నందలి ఒక సభ్యునికి ప్రపంచమున అమితమైన గుర్తింపు కలిగి, అది కారణముగ మిక్కిలి జనాకర్షణ కలిగి, సత్కార్యముల యొక్క జరుగుబాటు కుంటుపడినది. అప్పుడు ప్రపంచమునకు అతడు మరణించినట్లుగా  పరమగురువులు సమాచారమందించితిరి. ఆ సభ్యుడు మరియొక ముప్పది సంవత్సరములు నిరాటంకముగా దివ్యప్రణాళికను నిర్వర్తించెను. 

గుర్తింపు గురువులకు పొట్టు వంటిది. సత్కర్మాచరణము గింజ వంటిది. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సాధనా మార్గమున పయనించు సాధకునకు సద్గుణములే బలము. విస్తృతముగా సత్కార్యములు నిర్వర్తిస్తున్నప్పటికి,  కార్యముల యొక్క విస్తారము గాక గుణము మాత్రమే గమనింపబడును. మనస్సు యొక్క నిర్మలత్వమును బట్టి పురోభివృద్ధి ఉండును గాని, సాధించిన కార్యములను బట్టి కాదు. 

సద్గుణముల బలము వలన, సాధనా మార్గమున సాధకునకు వేగము పెరుగును. అట్టివారికి దైవానుగ్రహము తోడై, వారి వలన పరిసరములు ప్రభావితమగుచుండును.  సాధనా మార్గమున సద్గుణములు పెంచుకొనుట దొడ్డ బుద్ధి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

గురువాక్యము చెట్టు నీడ వంటిది. చెట్టు నీడ ఆహ్లాదమును, చల్లదనమును కలిగించును. గొప్పకొరకు, నలుగురి ప్రశంసల కొరకు,  గుర్తింపుకొరకు నీడను వదిలి పోకుము. నీడను వదిలి వచ్చిన వానిని వేడిమి ఏ విధముగా బాధించునో,  అట్లే గురువాఙ్ఞను వీడిన వానికి జీవితమున సమస్యలు, బాధలు చుట్టుముట్టును. 

వివేకి అయినచో నీడన ఉండి, స్వామికార్యము, స్వకార్యము చక్కపెట్టుకొనును. పులి నోటబడినది యెట్లు తిరిగిరాదో, గురువాక్యము నందు శ్రద్ధ కలిగినచో తిరిగిరాని పురోగతి తథ్యమని తెలుసుకొనుము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సాధకుడు చైతన్యవంతు డగుచున్న కొలది మంచితము, లోకహితము, వాక్కునందు పవిత్రత, పనితనము పెరుగుచుండును. పదముల వినియోగము నందు లోతు పెరుగును.

భావము నందు, వాక్కు యందు , చేతన యందు స్పష్టత పెరుగు చుండును. వాక్కు యొక్క దుర్వినియోగము తగ్గుచుండును. "నా భావములు సరియైనవే, తేడా ఇతరులలోనే ఉన్నది" అని అనుకొనుట తగ్గుచుండును. మంచి చెడులను బేరీజు వేసుకొని ముందుకు సాగుటయే ఉండును. ఇదియే మార్గసూచి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భాగవతము అనన్య భక్తి మార్గమునే ప్రతిపాదించును. భాగవత మార్గమున ఉండు మాధుర్యము, భగవత్ తత్త్వము ఇతర మార్గముల యందు ఉండజాలదు. లక్ష్మీ నాథుడైన శ్రీమహావిష్ణువు భక్తిచేత తనతో అనవరతము జతపడిన వారికి బద్ధుడైనట్లుగా జ్ఞానులకు, మునులకు, దాతలకు, యోగసాధనము చేయువారికి పట్టుపడడు.

భాగవతము *Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

Master *C.V.V.* మాట 

నాతో నీ అనుబంధము నిన్ను అనంతమగు శక్తికి, జ్ఞానమునకు వారసుని చేయును. ప్రార్ధన యందు ఈ శక్తిని పొంది, జీవుల సేవకుడిగా ఉండుటయే  నీ కర్తవ్యము. అనేక విధములైన సేవలు నిర్వర్తించుటకు నీవు సమర్ధుడవు కాగలవు. నిజమునకు నీవు ఒక చక్రవర్తి కుమారుడవుగ అభయముతో మెలగ వచ్చును. ప్రార్ధన మరువకుము.

                           *ఇది నా మాట*

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సాధకునకు సామాన్యముగా తన కుటుంబము నుండి, తన సన్నిహిత పరిసరముల నుండి, తన వారనుకున్న వారి నుండి తనకు సంబంధించిన సంచితకర్మ ప్రకటిత మగుచుండును. దానిని అంగీకరించి, కర్తవ్యమును నిర్వర్తించుటయే కాని సాధకునకు మరియొక మార్గము లేదు. తప్పించుకొన చూచినచో సాధన ఆగిపోయి, సమస్య మరింత జటిలమగును. 

సాధకునకు ఎంత కఠినమైన సమస్యకు కూడా బుద్ధిలోకముల నుండి దారి దొరకగలదు. నిరాశ, నిస్పృహ వదిలి, చేయవలసినది అహర్నిశలు చేయుచుండుట ఒక్కటియే దారి దొరకుటకు ఉపాయము. కర్మను తప్పించుకొనుట కన్న అంగీకరించి పరిష్కరించుకొనుట నిజమైన తెలివి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీమాత కామధేనువు మరియు కల్పవృక్షము. ఆమె సకల దేవతా మూర్తి. సర్వశక్తి మంతురాలు. అష్ట ఐశ్వర్యములు ఆమె కనుసన్నలలో ఉండును. కోరికలను తీర్చుచు, జీవులకు వృద్ధి కలిగించు చుండును. కోరికల వలన హాని కలుగునని భావించినచో అట్టి కోరికల విషయమున మరపు కలిగించును. 

దేని వలన మనము వృద్ధి చెందుదుమో శ్రీమాతకు తెలియును. శ్రీమాత కరుణామయి గనుక తన్ను ఆరాధించిన వారి వాంఛితములను వారికి అనుగ్రహించు చుండును. ఇది సత్యము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

అమ్మవారికి సాధ్యము కాని పని లేదు. ఆమె ప్రసాదించలేని మేలు లేదు. అందరిని మంచి మార్గములో నడిపించి, జీవిత పరమావధిని అందుకొనేట్టు చేసే సర్వేశ్వరి అందరిలో ఉంటుంది. అందరితో ఉంటుంది. అంతటా ఉంటుంది. ఆమె సర్వాంతర్యామి. 

ఎక్కడెక్కడి నదులు చివరకు సముద్రములో చేరినట్లు, అన్ని మంత్రాలు, అన్ని యంత్రాలు, అన్ని తంత్రాలు ఆమెను ఆశ్రయించినవి. దేవతలందరూ ఆమెను పూజిస్తారు, సేవిస్తారు, ఆరాధిస్తారు. ఎవ్వరికీ అంతు చిక్కని తన మాయతో ఆమె ప్రపంచము లోని పాపపుంజాన్ని నశింప చేస్తుంది. ఎన్ని పాపాలు చేసినా  ఆమెకు తన బిడ్డలపై మమకారము తగ్గదు.

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: శ్రీగురుభ్యోనమః🙏

చంద్రమండలములో నివసించే అందాలరాశి అయిన పరమేశ్వరి చారుహాసిని. చక్కని చంద్రకళలను తనలో ఇముడ్చుకొన్న ఈ చంద్రకాంత చరాచర జగత్తును శాసిస్తుంది. చక్రరాజమైన శ్రీచక్రములో నివసించే శ్రీమాత, విచ్చుకున్న పద్మాలవలె, విప్పారిన కన్నులతో, విశాలమైన విశ్వాన్ని ఆమె తేరిపార చూసేసరికి ఆమె నయనాల నుండి పద్మరాగాలు ప్రసరిస్తాయి. 

బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు సదాశివుడు దిగ్భ్రమ చెంది నిశ్చేష్టులయి పోతారు. నేల, నీరు, వెలుతురు, గాలి, ఆకాశము అన్నీ ఆమె ఆజ్ఞను శిరసావహించేందుకు సిద్ధముగా ఉంటాయి. పంచ బ్రహ్మలకు, పంచభూతాలకు ఆమె అధీశ్వరి. ఆమె అనుగ్రహము లేకపోతే అవి నిష్ప్రయోజనము అయిపోతాయి. ప్రపంచానికే ఆమె ప్రాణము.

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

శ్రీమాతకు ఐదు అంకె ప్రీతికరము. జ్యోతిషమున ఐదవ రాశి (పంచమ భావము) సంతాన ప్రాప్తిని తెలియచేయును. తల్లికి సంతానముపై ప్రీతి అమితము. శ్రీమాత పంచమ భావము నందు ప్రీతి కలది. సంఖ్యా శాస్త్రము మొత్తము 9 అంకెలతో కూడి ఉన్నది. అంతకు మించి అంకెలు లేవు. అంకెలలో మధ్యమ స్థానమున ఉండునది ఐదు. 

ఐదు సర్వమును సమన్వయించును. సృష్టి మొత్తమును సమన్వయించునది శ్రీమాతయే. ఆమె పంచమీ తిథి యందు స్థిరపడి, అసంఖ్యాకమగు పంచకములను సృష్టి యందు ఏర్పరిచినది. పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య ఆమెకు ప్రీతి కలిగించు తిథులు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుల జిహ్వాగ్రమున శ్రీమాత సరస్వతియై నిలిచి యుండును. చైతన్య ప్రవాహమును సరస్వతి అని అందురు. శ్రీమాత చైతన్యము బ్రహ్మము నుండి పాతాళ లోకముల వరకు ప్రవహించుట వలన లోకములు ఏర్పడి జీవులేర్పడుట జరుగుచుండును. 

ఉత్తమ భావనలు, ఉత్తమ భాషణములు, ఉత్తమ ప్రవర్తనలు నిర్వర్తించు కొనువారిని శ్రీమాత సరస్వతీ రూపములో అనుగ్రహించును. వీరు ఉత్తర వాహిని యందు ప్రవేశింతురు. అధమ భాషణము, అధమ ప్రవర్తన గలవారు అధస్సుకు ప్రవహింతురు. 

శ్రీమాత యొక్క సరస్వతీ స్వరూపము నెరుగుట శ్రీమాత అనుగ్రహముననే జరుగును.

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

*దుం దుర్గాయై నమః*

దుర్గ నామమును స్మరించినను, తలచినను, ఉచ్ఛరించినను సంసార బంధము, దుష్కర్మ, దుఃఖము, మహాభయము,  అనారోగ్యము తొలగును. దృశ్యమానమైన ఈ సకలము దుర్గయే. దుర్గా సూక్తమునకు మహా ప్రాశస్త్యమున్నది. గ్రహ, రోగ, ప్రమాదాదుల నుండి సంరక్షించును. 

లలిత సహస్రనామములో *నిస్తులా* నామము మొదలు *సమానాధిక వర్జితా* అనెడి నామము వరకు గల నామములలో  దుర్గా నవార్ణ మంత్రము, *సర్వశక్తిమయీ* నామము నుండి *మృడప్రియ* వరకు గల నామములలో దుర్గా మాలా మంత్రము నిక్షిప్తమై ఉన్నది.

 మనము ఆర్తితో పిలిచిన ప్రతి పిలుపుకు దుర్గాదేవి వాత్సల్యముతో స్పందించును. అవసరములు తీర్చును. శుభములు కలిగించును. హృదయపూర్వకముగ ఆ తల్లిని స్మరించుదుము  గాక!

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

మహాత్ముల సూక్ష్మ శరీరము రెండు స్థితులలో నుండును. 

ఒకటి బంగారు వర్ణము గలది. (హిరణ్మయము). ఈ శరీరముతో భూమి వాతావరణమున సంచరించుచు, కార్యములను నిర్వర్తించుచుందురు. ఈ శరీరమును భూమి యందలి పదార్ధము, జలము, అగ్ని, వాయువు సంక్షోభ పెట్టలేవు. తీవ్రమైన వేడిమి, చలి గూడ ప్రభావము చూపలేవు. 

భౌగోళికముగ భూమి కార్యములను చక్కపెట్టుటకు ఈ శరీరమును మహాత్ములు వినియోగించు చుందురు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

మాస్టర్ *C.V.V.* మాట 

నా ప్రార్థన జరుగుతున్న కొలది సాధకుడు తన మనోభావముల పరిమితత్త్వము నుండి తన్ను తాను ఉద్ధరించుకొనుచుండును. దివ్య ప్రణాళికకు అంకిత మగుచుండును.  పునర్నిర్మాణమునకు శరీరము ఒక యజ్ఞవేదికగ మారును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మహాత్ముల సూక్ష్మ శరీరము యొక్క రెండవ స్థితి వజ్రశరీరము. 

ఇది తేజోమయము. సూర్యుని కాంతితో సమానము. ఈ వజ్ర శరీరము శాశ్వత శరీరము. దీని యందే మహాత్ములు శాశ్వతముగా స్థిరపడి దివ్యప్రణాళిక నొనర్చుచుందురు. ఈ దేహములను దీర్ఘకాలము సాధనచే క్రమముగా నిర్మించుకొనవలసినదే కాని, ఎవ్వరును అందించవలసినవి కావు. 

వజ్రశరీర బలము అత్యంత పటిష్టమైనది. హనుమంతుడు వజ్రశరీర బలము కలవాడు. ఇట్టి కాయములను నిర్మాణము చేసుకొనుటకు అతిప్రాముఖ్యమైన అంగములు దేహమునందున్నవి. అవియే నాసాపుటముల నుండి ఊపిరి తిత్తుల వరకు ఏర్పడి వున్న అవయవములు. వీనిని సాధనా పరముగా సద్వినియోగము చేసుకొనుట సాధకుని ప్రథమ కర్తవ్యం.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవుడు స్వార్ధపరుడైనప్పుడు అతని ప్రజ్ఞ ఉదరవితానమునకు క్రిందుగ వసించి ఉండును. అతని యందు మానవత్వము ప్రకాశించినపుడు ఉదరవితానమునకును, విశుద్ధికిని నడుమ అతని ప్రజ్ఞ వసించును. అతను దైవీ ప్రజ్ఞను చేరునపుడు ఆజ్ఞాకేంద్రమున వసించును. 

ఆజ్ఞను చేరినవాడు ద్వంద్వాతీతుడై వసించును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

నా ప్రార్థన వలన మానవ చైతన్య బిందువు మనస్సు అను కక్ష్య నుండి బుద్ధిలోనికి మరలి, ఊర్ధ్వ లోకములకు, అధో లోకములకు అనుసంధానము ఏర్పడును. ప్రార్ధన యందు భావములు  క్రమముగా అరికట్టబడి, గమనించువాడిగా ఒక నూతన స్థితి పొందును. 

ప్రార్ధన మరువకుము.

Master K.P.K.🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

ప్రతి సూర్యోదయము నూతనమే. ప్రతిదినము నూతనమే. కాని భావన మాత్రము నూతనము, వికాసవంతము కాకుండుటచే జీవితము పాతదిగా నడచును. యాంత్రిక జీవనమునకు నిష్కృతి లేదు. యాంత్రిక జీవితము కూడా ఆడుతూ పాడుతూ సృజనాత్మకముగా నిర్వర్తించుకొన్నచో కార్యము లందు నిపుణత పెరుగును. 

కొంత నూతనత్వమును చొప్పించుచు,  వర్జనీయమగు పాత భావములను విసర్జించుచు, పురోగతి సాధించవలెను. లేనియెడల జీవునికి పరిణామము సాగదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

ధర్మమును ఆచరిస్తూ వుంటే తాత్కాలికముగా దుఃఖము, బాధ కలిగినా, సుఖముగా బయటకి రావడం జరుగుతుంది. ఎంత ధర్మాన్ని ఆచరిస్తూ వుంటే అంత బలము. ఆ బలము ముందు మిగతావన్నీ తేలికే. లాభము కోసము, సౌకర్యము కోసము  ధర్మము తప్పవద్దు అని రామాయణము చెపుతున్నది. ఈ అద్భుతమైన గుణము ఏర్పడితే ఇంక ఆ జీవికి తిరుగులేదు. 

ధర్మాచరణలో ఉన్నవారే మంచి పనులు చేయగలరు. ధర్మమే దైవము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మనము పరమగురువుల చిత్రపటముల వద్ద దీపములు, అగరవత్తులు వెలిగించేటపుడు, పువ్వులు పెడుతున్నప్పుడు ఒక బాధ్యత ఉన్నది. వారు అగ్నిశిఖలంతటి పవిత్రమైనవారు. మనము గూడ ధర్మాన్ని ప్రతి చిన్న విషయము లోనూ ఆచరించాలి. మన భాషణలో త్రికరణ శుద్ధి ఉండాలి. వాక్కులో అసత్యము, మడతలు ఉండగూడదు.

ఆచరణలో ధర్మమునకు తేడాపడని వానికి జయము తథ్యము. ధర్మాన్ని అనుష్టిస్తూ ముందుకు పోవాలి. ఎన్ని పదవులు పొందాము, ఎంత సంపాదించాము, ఎంత కీర్తిప్రతిష్టలు వచ్చాయి అన్నది కొలబద్ద కాదు. ఎంత ధర్మాన్ని అనుసరించామన్నది ముఖ్యము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మానవ జీవితము మూడు రకములుగా గోచరించును. యోగమయము, భోగమయము, రోగమయము. భోగమయ జీవితము వర్జితము కాదు. యోగుల యందు భోగులు కూడా అనేకులు కలరు. యోగము లేని భోగమే రోగములకు కారణము. రోగములచే పీడింపబడు వారు ప్రయత్నించి సత్యము నందు, ధర్మము నందు నిలబడవలెను. 

యోగమయ జీవనమున యమనియమములు ఆచరింపబడుట వలన సంతోషముగా కర్తవ్యములను నిర్వర్తించు చుందురు. అంతరంగమున దైవముతో యోగము చెందుట, బహిరంగమున వైభవముగా జీవించుట దైవానుగ్రహముగా వీరికి లభించును.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్యమైన అనుభవము పొందదలచిన వాడు చేయుచున్న కర్మలయందు శ్రీహరిని నింపవలెను. అనగా తన వృత్తి శ్రీహరి. ఇల్లు, వాకిలి శ్రీహరి. ధనము శ్రీహరి. తనచుట్టును ఏర్పడిన వస్తువులు, జీవులు శ్రీహరియే. అంతయు హరిమయముగ భావించి కార్యము లొనర్చుట వలన క్రమముగా భావము నందు, బాహ్యము నందు శ్రీహరియే గోచరించును. 

ప్రపంచమును శ్రీహరిగా చూడని వానికి తన ఆస్తిపాస్తులు, సంసారము బంధమై, బరువై ఉండును. శ్రీహరిగ చూడనివాడు ఎరుగనివాడు. చూచువాడు ఎరిగిన వాడు. ఇది భాగవత రహస్యము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నా ప్రార్థన వలన ఈశ్వరుని చైతన్యము సాధకుని స్పృశించినపుడు, సాధకుని జీవితమున తనదైన ప్రణాళిక అదృశ్యమై, దైవీ ప్రణాళిక నిర్వర్తింపబడును. తనకు ముందు తెలియని విషయములు గూడా తన నుండి వెల్లువై ప్రవహించును. అప్పుడే అతనికి గూడ తెలియును. ముందు వెనుక తెలియక, మనసున్న స్థితి ఉండును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

 జరిగిపోయిన విషయముల యందు జీవించుట, జరుగబోవు విషయములను ఉహించుట కూడదని సాధకులకు నిర్దేశింపబడినది. ప్రస్తుతమున జీవించుచు, కర్తవ్యమును నిర్వర్తించుచు, పరిసరముల యందు పరహితము చేయుచు, హితకరముగ జీవించుట శ్రేయస్కరము. 

ఈ విషయమున యోగసాధకులు అప్రమత్తులై ఉండవలెను. ప్రస్తుతమున జీవించని వారు ప్రస్తుతమున మరణించినవారే. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జిజ్ఞాసువులు అంతరాత్మతో కూడియుండుట నిరంతర సాధనగా ఏర్పరచుకొనవలెను. అంతరంగమున రమించిన నాడే జిజ్ఞాసువుకి సత్యమగు జ్ఞానము కలిగి విముక్తుడగును. ఇట్టి జిజ్ఞాసువులకు శుక్రవారము అమితముగా తోడ్పడును. శుక్రవార దీక్షను భూమి నలుచెరగుల సద్గురువులు వ్యాప్తి గావించినారు. 

అంతరంగము చేరుటయే శుక్రవార ప్రయోజనము. శుక్రవార వైభవము, శుక్రుడందించు అంతరంగ విద్య కారణముగ జీవుడు అంతర్విశ్వమున ప్రవేశింపగలడు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

నా ప్రార్థన వలన మనస్సు, కాలము ఈశ్వర చైతన్యము నందు ఉండుటచే సమస్తము అప్రయత్నముగా సాగును. తెలియుట, జరుగుట ఏక కాలమున జరుగును. ఇది ఒక అపూర్వ వైభవము. దీని విధానము నిత్యనూతనము. కనుక ప్రార్థన మరువకుము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

 నిద్ర నుండి మేల్కాంచు క్షణము అత్యద్భుతమైనది. సూక్ష్మలోకముల నుండి స్థూల లోకములకు జీవుడు దిగివచ్చు అద్భుతమైన సమయములో జీవుడు అంతర్ బహిర్ ప్రపంచముల మధ్య ఉండును. ఆ క్షణమున జీవుని చైతన్య స్థితిని వజ్ర చైతన్య మందురు. ఈ చైతన్యమున నిలబడగలుగు సాధకుడు అద్భుత ప్రజ్ఞా వంతుడు కాగలడు. 

ఈ క్షణములు అత్యంత విలువైన క్షణములుగా సాధకుడు గుర్తించి ప్రతిదినము ఆ క్షణముల యందు ప్రశాంతముగా ఉండుటకు ప్రయత్నించినచో దివ్యలోక దర్శనము జరుగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

 మానవుడు ఏమియు నేర్చుకొనక, ఏ అనుభూతియు పొందక, ఏ పరిణితి చెందక జీవించుట వ్యర్ధము. జీవితమున స్ఫూర్తి, ఉన్నతమగు ఆశయము ఉండవలెను. ఆశయమునకై కృషి ఉండవలెను. కేవలము పొట్ట పోసుకొనుటకే జీవించుటకు మానవునిగా జన్మించనవసరము లేదు. వృక్షము, పశువు అయిన చాలును. 

మానవుడు అగ్ని శిఖ వంటి వాడు. దీక్షతో కృషి సల్పిన అతని కందుబాటు కాని దేదియు లేదు.మానవునికి గల మనస్సు, బుద్ధి ఆధారముగా అతనెంతయో ఎదుగ వచ్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః* 

పరహితార్థము జీవించుట, అందివచ్చిన సంపదను దానము చేయుట, తన లోపల, వెలుపల నిండివున్న ఈశ్వరునితో అనుసంధానము చేయుట గూడ కర్తవ్యములే. అట్టి కర్తవ్యముల యందు గూడా ఫలాసక్తి ఉండరాదు. అట్టివాడు విముక్తుడగును. విముక్తి అనగా విశిష్టమగు ముక్తి. 

ధీమంతులెవరైనను ఇట్టి మార్గముననే  పయనింప వలెను. అట్టి వాడే తనను చేరగలడని దైవము స్పష్టము చేసెను.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మంచిపని చేయాలనే ఉద్దేశము మాత్రము ఉంటుంది గాని, చేయడానికి కావలసిన ధైర్యము ఉండదు. ఒక మంచి పని మనలను రక్షిస్తుంది. జీవుడిగా మనము బాగుపడి, ఉద్ధరింపబడతాము అనే నమ్మకము ఉన్నవాడు దూకేస్తాడు. పరమగురువు గూడా To Dare, To Will, To Serve And To Be Silent. అని చెప్తాడు. ఎక్కువ చేసి, ఏమీ మాట్లాడక ఉండాలి. సంకల్పము ఉండి ధైర్యము లేక జీవించువారిపై ఆకస్మికముగా తోడేలు దుమికి, జంతువును పట్టినట్లు  అటువంటి వారిని కలి పట్టేస్తాడు.  (ఆచరణ లోకి ఇంకా దిగని వారిని) పొరపాటు చేయు వారి గురించే కలి వేచి ఉంటాడు.

*భాగవతము Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సోమరితనము కలిగిన వాడు గురువు తనకు చేసిపెట్టవలెనని ఎదురు చూచు చుండును. దారి చూపుటయే గురువు వంతు కాని, నడచుట శిష్యుని వంతుయే. ఉపాయమును చూపిన గురువు యందు సందేహపడుట కూడదు. 

సందేహమున్నచో గురువునే అడిగి పరిష్కరించు కొనవలెను గాని, ఇతరులతో చర్చించుట నీచము. గురుశిష్య సంబంధము అత్యంత పవిత్రము. దీనిని నిర్మలముగా ఉంచుకొనుట శ్రేయస్కరము. బజారుకెక్కించుట కుసంస్కారము.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సత్కర్మల వలన జీవితమందు సదుపాయమేర్పడును గాని, పరమార్థము లభింపదు. సత్కీర్తి ఏర్పడినంత మాత్రమున ప్రయోజనము లేదు. సత్కీర్తి యందు చిక్కుకొనుట మాత్రమే మిగులును. తన వంతు కర్తవ్యమును హరిసేవగా నిర్వర్తించుట వలన మాత్రమే జీవుడు పరితృప్తుడు కాగలడు. 

హరిస్మరణమున నరుడున్నప్పుడు అతని నేదియు బంధింపదు. విశ్వమును విష్ణువుగా దర్శించినవాడు  విష్ణువు నందుండి, విశ్వమును దర్శించుట నేర్చును.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

స్థిరచిత్తము లేనివారికి బ్రహ్మముతో యోగము చెందుట అశక్యము. చంచలమైన మనస్సు ఐహిక జీవనమునకు కూడా వినియోగపడదు. చిందులు వేయు మనస్సుకు ఎట్టి అవకాశము ఉండదు.  కార్యములను చక్కబెట్టలేరు. ఒక పని చేయుచున్నప్పుడు మరియొక పని గుర్తు వచ్చుచుండును. జీవ చైతన్యము ఒక ప్రవాహముగా సాగదు. 

అంతరంగమందు సుందర తేజోరూపమునో, జ్యోతినో లేక స్పందనాత్మక చర్యనో పట్టుట వలన క్రమముగా స్థిరమగు మనస్సు ఏర్పడును. అట్టి స్థిరమనస్సు అంతరంగమును శోధించుచు తన మూలము చేరుట వలన, యోగము పరిపూర్ణమగును.

*Master K.P.K.🙏*

నవ గోపిక సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

 ప్రస్తుత శతాబ్దము మానవ జీవితమును ఎంతయో మార్చినది. ఎన్ని మార్పులు కలిగినవో గమనించినచో ఆశ్చర్యము కలుగును. అకస్మాత్తుగా జరుగు మార్పులను గమనించి అంగీకరించువారు ప్రస్తుత కాలమున సుఖపడగలరు. తమ వంతు కర్తవ్యమును నిర్వర్తించుచు, పాత, క్రొత్తలను సరిచేసుకొనుచు, ముందుకు సాగవలెను. అట్లు సాగని వారిని ప్రకృతియే సాగదీయును గనుక సాగుటయే మేలు. ఇదియే శ్రీరామ రక్ష.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

పవిత్ర విషయము లందుకొనుటకు ఉపాధి కూడా పవిత్రముగా ఉండవలెను. చక్కని, చిక్కని పాలు మురికిపాత్రలో ఉంచినచో అవి యెట్లు ఉపయోగపడవో, అట్లే మనస్సు, ఇంద్రియములు, శరీరము అను మూడు పొరలు గల దేహములో మలినములు గలవారికి సద్విషయములు ఉపయోగపడవు. శ్రేష్టమైన ముడిపదార్ధము లున్నప్పటికి,  వండేవానిని బట్టి గదా అవి రుచి యిచ్చును.

కనుక అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములను పరిశుద్ధముగ ఉంచుకొను వారికి, ఆలోచనము వివేచనము ఆశయసిద్ధి కలుగును. ఇతరులకు కలుగవు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

విష్ణుమాయలో చిక్కుకున్న వారు భగవంతునుని రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు మరియు  గురువుల రూపములలో తలంతురు. వీరిని భాగవతము ఎరుకమాలిన వారుగ తెలుపుచున్నది. వీరివలన మూఢత్వము, మత ద్వేషములు పెరుగును. 

జ్ఞాన సంపన్నులు తమకు కనబడు, వినబడు రూపములు, సృష్టియందలి సమస్త రూపములు భగవంతుని రూపములు అని తెలిసియుందురు.సర్వరూపములను భగవంతుని రూపములుగా ధ్యానించుట భాగవత మార్గము. ఈ మార్గమున తన చుట్టును నిరంతరము భగవత్ సాన్నిధ్యమును రుచి చూచుటకు అవకాశమేర్పడును.

*భాగవతము Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

ఒక విద్యుత్ తీగల సముదాయమున విద్యుత్ క్షణకాలమున యెట్లు వ్యాపించునో,  ప్రార్థన వలన సాధకుని సమస్త నాడీమండలముల యందు చైతన్యము క్షణ కాలమున వ్యాపనము చెంది ఆక్రమించును. ఈ యోగము త్వరితగతిని జీవులనుద్ధరించు నూతన ప్రణాళిక. మానవజాతికి ఇవ్వబడిన దివ్యమైన కానుక.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

బయట ప్రపంచమున సాధించబడునది ఏదియు అంతరంగమున శాంతిని స్థాపించలేదు. అంతఃకరణ శుద్ధిచే పొందు ఆత్మాను భూతియే శాంతిని, తృప్తిని ఇచ్చును. ఈ విషయమున ప్రాచీనులు అప్రమత్తులై నిర్మలము, నిరాడంబరములగు జీవితములను ఏర్పరచుకొనినారు. 

నవీనయుగమున మానవుడు రజోగుణ దోషమున తృప్తిని వదిలి తృష్ణతో ఆరాటపడుచు, అమూల్యమైన జీవనమును వ్యర్ధము గావించు కొనుచున్నాడు. ప్రాచీనులకన్నా తనకు ఎక్కువ తెలుసునను గర్వమున పడినాడు. ఎక్కువ తెలిసి, తక్కువ సుఖపడుట మరింత మూర్ఖత్వము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

సాధకునకు దినచర్య క్లుప్తముగను, నిర్మలముగాను సాగవలెను. నిర్మలమైన గాలి, నీరు, ప్రశాంతమైన వాతావరణము, వెలుతురుతో కూడిన నివాసము సాధనకు ప్రాతిపదికగా ఏర్పడవలెను. సంఘమున డాంబికమైన విషయము యందు ఆసక్తి లేని జీవనము అలవరచుకొన వలెను. 

నిజముగా సాధన యందు ఆసక్తి గలవాడవైనచో, నిరూపయోగమైన మాట, చేత, తిరుగుడు వదిలి కర్తవ్యములను మాత్రమే నిర్వర్తించుము. ఇది సాధకునకు శాసనము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మనలో సహస్రారము నుంచి మూలాధారము వరకు సుషుమ్న నాడి అంతా వ్యాప్తి చెంది ఉన్నది. ఈ దారి అంతా ధగ ధగ మెరుస్తూ కాంతివంతమైన ఒక నిట్టనిలువు లింగాకరముగా ఉంటుంది. అదే మనలో శివస్థానము.  శివుడు కర్మేంద్రియములను, దేహేంద్రియములను ఆవేశించి ఉంటాడు. శివుని ధ్యానము చేస్తే చేయవలసిన పనులే తప్ప, ఇతరములకు పోనీయని బలము మనకు కలుగుతుంది. ఇంకొకరితో చెప్పించుకొనే పరిస్థితి రాదు. 

మన జీవితము దైవపరముగా నడవనప్పుడు మన శరీరము లోని దేవతలు బాధపడుతూ ఉంటారు. తరువాత మనలో నుండి నిష్క్ర మిస్తారు.

మన యందు శివ సాన్నిధ్యము పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్న అన్ని లోకముల యందు విభూతి ఏర్పడుతుంది.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

ఈ యోగమున సూక్ష్మ లోకముల నుండి స్థూల లోకములకు ప్రవహించు ప్రజ్ఞకు కాలక్రమమను పరిమితి ఉండదు. తెలియుట, జరుగుట ఏకకాలమున ఉండును. స్విచ్ వేయగనే బల్బ్ వెలుగుచున్నది కాని, స్విచ్ నుండి బల్బ్ వరకు ప్రవహించు విద్యుత్తు సమయమును కోరుటలేదు కదా! ఇచట కాలము - దూరము అను నిష్పత్తి ఉండదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః 🙏*

*నేను* అను ప్రజ్ఞకు మూలమేది? అను ప్రశ్నకు హృదయగుహయే మార్గమై ఉన్నది. అందు ప్రవేశించిన వారు మూలమును చేరుదురు. మూలము నుండియే ముగ్గురు సూర్యులు, ముగ్గురు అమ్మలు, త్రిమూర్తులు వచ్చిరి. మూలము నుండియే పరమాత్మ, జీవాత్మ, దేహాత్మ లేర్పడినవి. 

హృదయము ఒక మార్గము. మార్గము చేరినవారు గమ్యమునకై పయనించవలెను. హృదయమును చేరి, కాంతిరేఖ ఆధారముగా ఊర్ధ్వమునకు చనుట మార్గము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

పరహిత కార్యములు నిర్వర్తించుచు, తద్వారా దేవతల అనుగ్రహము పొందినవాడు విశేషమైన భోగ్యవిషయములు అనుభవించును.  లభించిన భోగ భాగ్యములను ఇతరుల శ్రేయస్సుకై వినియోగించువాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించువాడు మూర్ఖుడు. 

భోగ్య విషయము లభ్యము కాగానే పరహిత ధర్మము  మరచుట కృతఘ్నత్వ మగును. వృద్ధి ఆగును. తన దగ్గర ఉన్నటువంటి విద్య గాని, తెలివి గాని, ధనాదులు గాని ఇతరుల శ్రేయస్సు కొరకై వినియోగించువాడు సృష్టి యందు నిజమైన రాజుగా నిలచును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్గుణము లేకుండా సంఘమున పెరుగువారందరూ అపాయమునకు లోనగుదురు.  చిన్నతనము నుండి సద్గుణములను పెంచుకొనుచు, కర్తవ్యము నందు మాత్రమే ఆసక్తి కలిగి, తోటిజీవులకు సహకరించుచు జీవించు వానికి లోతులు పెరుగును. మనిషిలో లోతు పెరిగిన కొలది శాంతమెక్కువగా ఉండును. నిశ్చలత పెరుగును. సరస్సులు గూడా లోతుగా ఉన్నకొలది నిశ్చలముగా ఉండును. ఆటుపోట్లు కలత కలిగించవు. 

అట్టి జీవుని అంతశ్చేతనలో సూర్యచంద్రాత్మకమగు ప్రజ్ఞలు స్పష్టముగా గోచరించ గలవు. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భాగవతము అన్నిటికీ దైవస్మరణే ఉపాయము అని చెపుతుంది. మనిషిని దుఃఖములు యెట్లు ముంచుతాయో, సుఖములు గూడ అలాగే మనిషిని ముంచేస్తాయి. సుఖ దుఃఖముల యందు మనసు పెట్టక, దైవస్మరణ యందు చిత్తము తగులుకుని ఉండేటట్లుగా, విడదీసినా విడబడకుండా ఉండేటట్లుగా ప్రయత్నము చేయాలి. దానికి కావలసినది భాగవత మూర్తుల యొక్క సాన్నిధ్యము. 

అందువలన వారినుంచి అంటు కట్టినట్లుగా ఏర్పడుతుంది. అందుచేత సద్గురు సమాశ్రయము, సహవాసము, వారితో కూడిఉండి, శుశ్రూష చేయుట చేయవలెను.

*భాగవతము Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట 

నన్ను గురించి మొదటిసారి తెలియుటయే మీకు ఉపదేశము (Initiation) జరిగినట్లు. నా యోగమున చేరు సంకల్పము మీకు కలుగుట నా సంకల్పమే. నేను అంతటను వ్యాపించి ఉన్నాను. ఉపదేశము జరిగిన ప్రతి జీవి హృదయమున నేను ప్రవేశించి, నేను లో నుండియే సమస్తమును నడిపించు చుండును. నా దగ్గరకు చేరుట నీ వంతు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

పరహిత కార్యములు నిర్వర్తించుచు, తద్వారా దేవతల అనుగ్రహము పొందినవాడు విశేషమైన భోగ్యవిషయములు అనుభవించును.  లభించిన భోగ భాగ్యములను ఇతరుల శ్రేయస్సుకై వినియోగించువాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించువాడు మూర్ఖుడు. 

భోగ్య విషయము లభ్యము కాగానే పరహిత ధర్మము  మరచుట కృతఘ్నత్వ మగును. వృద్ధి ఆగును. తన దగ్గర ఉన్నటువంటి విద్య గాని, తెలివి గాని, ధనాదులు గాని ఇతరుల శ్రేయస్సు కొరకై వినియోగించువాడు సృష్టి యందు నిజమైన రాజుగా నిలచును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఎక్కువ సమయము నిద్ర కుత్సహించువాడు తమో ప్రధానుడు. తమస్సు సమస్తమును హరించును. ప్రాణమును గూడ హరించును. సోమరి జీవితమున ఏమియును సాధించలేడు. ఏ ఆనందమును పొందలేడు. సద్విషయముల యందు విముఖత ఉండును. సత్పురుషుల యందు విముఖత ఉండును. 

శరీరము, మనస్సు, ఇంద్రియములు మలినముతో కప్పబడి, మలిన విషయముల యందు ఆసక్తి ఉండును.  ఇతడు మొదటగా నేర్వవలసినది నిద్రను నియమించుట. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

సద్గురువు శిష్యుల నెన్నుకొనుటలో మూడు పరీక్షలు పెట్టును. మొదటిది, శిష్యుని యందు ఇతరుల శ్రేయస్సు, ఇతరులకు ఉపయోగపడవలెనను భావము ఎక్కువగా ఉన్నదా! లేక తన శ్రేయస్సు గురించిన భావమెక్కువగా ఉన్నదా!

రెండవది, ధర్మమును ఆచరించు బుద్ధి ఉన్నదా, లేదా? ధర్మమును సమర్ధించని వాడు దైవమును సమర్ధించని వాడే. ధర్మానుష్టానబుద్ధి లేనివారిని, శిష్యునిగా అంగీకరించుటలో చాలా అపాయము ఉన్నది.

మూడవది, కార్యనిర్వహణ దీక్ష ఉండవలెను. ఇది లేనివారు గురువునకు బరువే. పై మూడు విషయములను పరిశీలించి శిష్యునిగా అంగీకరించ వలెను.

*Master K.P K 🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రార్ధన చేయుచున్నను, హోమములు, అభిషేకములు నిర్వర్తించు చున్నను, తన మనోభావముల యందు మార్పు కలగవలెనని సంకల్పము చేయవలెను.   సహజముగా తనకు, తన వారికి విజయము కలుగ వలెనని సంకల్పింతురు. బాహ్య ప్రపంచమున ఒడిదుడుకులు సహజము. 

తనకు భగవద్భక్తి స్థిరపడవలెనని, మనో వికారములు తొలగవలెనని, జ్ఞానము, వైరాగ్యము కావలెనని, దైవయోగమున నిలువవలెనని కోరుట శ్రేయోమార్గము. శ్రేయోమార్గము ద్వారా మనోభావముల యందు మార్పు లభ్యము కాగలదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మన వయసు ఎంత ఉన్నదో అన్ని నిముషములు రోజూ ధ్యానము చేయగలగాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చేస్తే భావ పరంపరకు తెంపు వస్తుంది. భావస్థితి నుంచి *అభావ* అంటే భావము లేని స్థితికి రావాలి. శ్వాస కూడా తగ్గి, స్పందనము మాత్రము మిగలాలి. 

అప్పుడు మనసు, ఇంద్రియాలతో పాటు శరీరము కూడా పవిత్రీకరింప బడుతుంది. శ్వాస మీద ధ్యాస నిలపాలంటే ముందు ప్రశాంతత పొందాలి. శ్వాసను పట్టుకోవడము అంటే సద్గురువును, బ్రహ్మమును చేరడమే.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఆనందము కోరువారు తోటిజీవుల సమస్యలకు పరిష్కారము అందించుట ఒక్కటే మార్గము. జీవుల యందు వ్యక్తిగత అభిప్రాయమేర్పరచు కొనక, తగిన సహాయము చేయుటయే తన పని అని జీవించినచో, ఆనందము చేరువగును. చేయు సహాయము శక్తి వంచన లేక చేయవలెను.

ఆకు రాలు కాలమున వృక్షము ఆకులను సంతోషముగా విడచును. సంసిద్ధతయే వృక్షమునకు మరల క్రొత్త ఆకును చిగురింప చేయును. వృక్షమున కున్న ధైర్యము, సంసిద్ధత మనిషికి ఉన్నచో ఆనందము కొరకు ఆయాస పడనవసరం లేదు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాయ నుండి వెలుగునకు చేరుటకు మార్గము అవసరము. మార్గమును బోధించుచు, మార్గము నేర్పరచుచు, మార్గముగా నిలుచువాడు గురువు. అతడే సంధ్య. కావున గురు ప్రార్ధనము  సంధ్యల యందే తప్పక జరుగవలెనని తెలియుచున్నది. 

చీకటినుండి వెలుగుకు, వెలుగు నుంచి చీకటికి చేర్చునది సంధ్య. సంధ్యా మార్గము అమృతత్వమార్గము. అందుకని సంధ్యా సమయమును వ్యర్ధము చేసుకొనక సంధ్యలను దీక్షగా ఉపాసింపవలెను. సంధ్యావందన క్రతువు నందు ప్రధానముగా ఈ రహస్యము ఇమిడిఉన్నది.

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఓ యమ్మ నీకుమారుడు

మాయిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా 

పోయెద మెక్కడికైనను 

మాయన్నల సురభులాన మంజులవాణీ.

ఓ యశోదా! నీ కొడుకు మాఇండ్లలో పాలు, పెరుగు ఉండనీయడు. మా ఆవుల సాక్షిగ, మా వారి సాక్షిగ మే మెక్కడికైనను పోయెదము. ఇక్కడ ఉండలేము. ప్రమాణము చేసి పోవుచున్నాము.

భగవంతుడు అనుగ్రహింపదలచిన వారికి తమ పాలు, తమ పెరుగు, తమ ఆస్తి, తమ సంపద అని ఉండుటకు వీలులేదు. నిజమునకు సమస్తమును గోవిందునిదే. నాది, తమది అనుకొనుట మాయావరణము. దైవమే జీవుల రూపము ధరించి క్రీడించు చున్నాడు. అనుగ్రహవశమున జీవునికి ఈ సత్యము తెలియగానే అతడిక మనుష్య  జన్మమును పొందడు. దివ్యశరీరధారి అగును. మనుష్యలోకమున ఉండుటకు ఇష్టపడడు. ఇది ప్రమాణము. 

*భాగవతము. Master K. P.K*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

*మాస్టర్ C.V.V. మాట*

నా యోగమున ఉండదలచిన వారు ప్రార్థనా సమయమునకు 10 నిముషముల ముందే ఇతర కార్యక్రమములను కట్టిపెట్టి ప్రార్థనకు ఉన్ముఖము కావలెను. హడావుడిగా ప్రార్థనా సమయమునకు చేరువారి యందు నేనెటువంటి సర్దుబాట్లు చేయలేను. ఉదయము, సాయంత్రము ప్రార్థనకు ముందు కనీసము కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొనవలెను. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఎక్కువ సమయము నిద్ర కుత్సహించువాడు తమో ప్రధానుడు. తమస్సు సమస్తమును హరించును. ప్రాణమును గూడ హరించును. సోమరి జీవితమున ఏమియును సాధించలేడు. ఏ ఆనందమును పొందలేడు. సద్విషయముల యందు విముఖత ఉండును. సత్పురుషుల యందు విముఖత ఉండును. 

శరీరము, మనస్సు, ఇంద్రియములు మలినముతో కప్పబడి, మలిన విషయముల యందు ఆసక్తి ఉండును.  ఇతడు మొదటగా నేర్వవలసినది నిద్రను నియమించుట. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఆశించుట ఎక్కువైనచో శ్రమించుట తగ్గును. శ్రమించువాడు ప్రస్తుతమున జీవించును. ఆశించువాడు ప్రస్తుతమును కోల్పోవుచునే ఉండును. శ్రమించక ఆశించుట వ్యర్ధము. శ్రమించుటలో ఆనందించుట ఉత్తమము. 

అట్టివారే కాలగమనమున సమర్థవంతులుగా తీర్చి దిద్దబడుదురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సాధకుని మనస్సు నిర్మలమయినపుడు, కామరహితమయినపుడు, ధర్మపూరితమైనప్పుడు, దీక్షాయుత మైనప్పుడు బుద్ధిలోకము నుండి వెలుగు ప్రసరించును. బుద్ధిలోకమున దివ్య ప్రణాళిక అవగాహన కాగలదు. 

ఇంద్రియ దర్శనము కన్న మనోదర్శనము మిన్న. అంతకన్నా బుద్ధితో యోగము చెందిన మనోదర్శనము శ్రేష్టము. అట్టివారికి వాజ్నియమము తప్పనిసరిగా నుండును. సత్యమైన వాక్కే ఉర్ద్వలోకములకు చేర్చును.

*Master K P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

*మకర* శబ్దములో మ అంటే మనసు. దానికి  చంద్రుడు అధిపతి. క అనే అక్షరానికి శని అధిదేవత. ర అనే అక్షరానికి అగ్నిబీజమైన కుజుడు అధిదేవత. మన పూర్వకర్మ లే మూడు గ్రహాల ద్వారా మన దగ్గరకు వస్తాయి. మనము చేసే పనులను బట్టి అవి మంచి చెడు ఫలితాలను ఇస్తాయి. అందుకే మొసలి సంకేతంగా ఇచ్చారు.

ఐదు అవయములు గల ఇంకో జంతువు ఇచ్చారు. అది కూర్మము. వాతావరణము అనుకూలముగా ఉంటే బయటకి వస్తుంది. ప్రతికూలముగా ఉంటే లోపల ఉంటుంది. అలాగే బుద్ధిమంతుడు పరిస్థితులకు అనుగుణముగా పనులు చేసుకుంటూ ఉంటాడు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *ఓం నమో భగవతే శ్రీ గురుదేవాయ*

 గురువులు ఈశాన్ మంత్రం సందేహం ఉన్న ఆ జీవుడు వెనక్కి పోక,ముందుకి పోగా అక్కడే ఉంటాడు. అప్పుడు అక్కడ జీవుడు ఎలా ఉండాలంటే! విష్ణువే వచ్చి "నీకెందుకు నేను రక్షిస్తాను",అంటే, వద్దు వెళ్ళమనాలి. గురువుపై అంతటి విశ్వాసం ఉండాలి. జీవుడికి గురువు అవసరం అడుగడుగునా ఉంది. అది ప్రియాయోగమైన, ఏ మార్గమైనా, ఎందుకంటే హరి,హరుడు, బ్రహ్మ,- ముగ్గురు కలిసిన మూర్తియే గురువు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మరువ వద్దు. ఒకవేళ గురువు శక్తిపై అనుమానం వస్తే ఆ సందేహం వల్ల పతనం కలగవచ్చు. ఒకవేళ పతనం కలిగిన, తిరిగి వచ్చి తన మహత్తర శక్తిని చూపించి, వచ్చిన సందేహాన్ని తీర్చగల శక్తి కూడా గురువు యందున్నది. గురువు ని సందేహంగా నీ చెయ్యి పట్టుకొని, తీసుకెళ్లగలడు. అంతటి అనుగ్రహం కలిగినది గురుతత్వం:-*

 *సర్వం శ్రీ సద్గురు పాదారవిందర్పణమస్తు*🙏

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

*మాస్టర్ C.V.V. మాట.*

సమస్తమగు జీవనవిధానాన్ని ఒక్కసారి కుదిపి, ధర్మపరమైన, సత్యపరమైన ఆచారములను 

మాత్రమే తిరిగి పటిష్టము చేయడము జరుగును. అసత్యమెక్కడన్నను అది బహిర్గత మగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

 మకర, కూర్మ, కుమార  ఈ మూడు పదాలకు ఆంతరిక సంబంధము ఉన్నది. మకరము నుంచి కూర్మమై,  కూర్మము నుంచి కుమారుడు కావాలి. అందుకే మనలనుద్ధరించడానికి ఋషులు యిచ్చిన సంకేతమే షడ్భుజి. ఇది ఒక యంత్రముగా ఇచ్చి,  యంత్రము మీద మంత్రముతో సాధన చేయమన్నారు. మనలో ఆరు కిరణముల చక్రము ఏర్పడి, షట్చక్రములు ప్రభావితమవుతాయి. భగవంతుని అనుగ్రహము, దర్శనము, స్పర్శనము, సంభాషణము లభ్యమవుతాయి.

 తిరుగు లేని సంకల్పము కోసము, మన లోని దేవతలు మేల్కాంచడము కోసము, మనలోని పట్టు తొలగడం కోసము, స్వాంతనము, శాంతి పెరగడం కోసము షణ్ముఖ ఆరాధన చేయాలి.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జ్ఞానము కన్నా పవిత్రమైన అంశము లేదు. జ్ఞానము కలిగిన వారికే సేవా సామర్ధ్యము ఉండును. సమర్ధత లేనివారు సేవ చేయలేరు. సేవ చేయు స్ఫూర్తి కలవారు సమర్ధతను పెంచుకొనవలెను. జ్ఞానము లేని సామర్ధ్యము రావణుని సామర్ధ్యము వలె వికటించును.

అందువలన మహాత్ములు ముందు జ్ఞానమును గురించి తెలిపి, తరువాత సామర్ధ్యము గురించి తెలుపుట జరుగుచున్నది. లోకహితకార్యముల నొనర్చు స్ఫూర్తి కల వారు జ్ఞానమును పెద్దల వద్ద పొందుచు, సామర్ధ్యమును పెంచుకొనవలెను గాని, యెట్టి పరిస్థితి యందు గర్వించరాదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సాధకునకు సహవాస విషయములో అప్రమత్తత అవసరము. సాధకుడు అనగా సత్య సాధకుడు. సత్యాన్వేషణము నందు శ్రద్ధ కలవారితోనే సహవాసము చేయవలెను. అట్లు కానిచో సాధన కుంటుపడ గలదు. స్నేహమునకు గుణము ప్రధానమై ఉండవలెను.

దుస్సాంగత్యము దురభ్యాసముల నేర్పరచి జన్మ జన్మలకును వెంటాడును. అందువలన సత్సాంగత్యమే శరణ్యము. సత్సాంగత్యము వలననే మనసునకు సంగదోషము తొలగును.

.*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము.

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మాస్టర్ *C.V.V.* మాట

నీ యందు నా ఉపదేశము పనిచేయుచున్నదా,  లేదా? అని తెలియుటకు ఒక సుళువు ఉన్నది. పని చేయుచున్నచో 

ముఖము వికాసవంత మగును.

కంగారు తగ్గి ప్రశాంతత పెరుగును.

నీవు ఇతరుల కుపయోగపడుట పెరుగును.

ఆత్మవిశ్వాసము పెరుగును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

సృష్టి చక్రమున గల ధర్మచక్రము వృత్తాకారపు రైలు మార్గము వంటిది. ఈ మార్గమున రైలు బండి నెక్కిన జీవులు ధర్మమును ఆచరించుచు ప్రయాణము సాగించు చుండవలెను. ప్రయాణమునకు నియమము ధర్మమే.

ధర్మమును అనుసరించని వారు ఈ రైలు బండి నుండి దింపివేయబడుదురు. అది కారణముగా ప్రయాణమాగును. మరల ప్రయాణము సాగించవలె నన్నచో ధర్మ, నియమములను అనుష్టానము చేయవలసిన బుద్ది ఏర్పరచు కొనవలెను. ధర్మమే గతి అని తెలిసి, నిరహంకారుడై ధర్మమును అనుసరించిన వాడే ముక్తి మార్గమున ప్రయాణము సాగించగలడు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మన బాధలకు గాని, నష్టములకు గాని, సంతోషమునకు గాని, లాభమునకు గాని, మనమే కారణమని తెలియుట జ్ఞానము. అట్టి జ్ఞానము కలిగి పనులను నిర్వర్తించుట శ్రేయస్కరము. అపుడు ఘర్షణ, తర్కము ఉండదు.

నీ దుఃఖమునకు, సుఖమునకు ఇతరులు కారణము కాదు. నీవే కర్తవు, భర్తవు, భోక్తవు.

Master K.P.K🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సంఘమున గుర్తింపు కొరకు జీవించుట అవిద్యామార్గము. గుర్తెరిగి జీవించుట విద్య. తానెవరో తెలియుటయే గుర్తెరుగుట. గుర్తెరిగి జీవించు వారికి గుర్తింపు కొరకు జీవించు వారికి వ్యత్యాసము  కలదు.  గుర్తెరిగి జీవించే వారు గురువులు. గుర్తింపు కొరకు జీవించువారికి మృదువైన బోధనలు చెవికెక్కినను హృదయమును చేరవు. 

పౌండ్రక వాసుదేవుడు ఎన్ని విన్యాసములు చేసినను వాసుదేవుడు కాలేడు కదా! గుర్తెరుగుటకు సతతము అన్వేషించు వారినే పరమగురువులు అనుగ్రహంచు చుందురు. 

*Master K.P.K🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

దైవానికి భక్తుడికి మధ్య రాయబారం నడిపేవాడు గురువు. దైవము ఇవ్వలేనిది గురువు యిస్తాడు. దైవము గురువు రూపములో సహకరిస్తాడు. ఆ గురువు మన అనుభవానికి రావలసిన కర్మను తీరుస్తాడు. అన్ని ఆటుపోట్లను ఆయనే భరిస్తాడు.

గురువు దైవము కన్నా ఎక్కువగా జీవుని ఆదరిస్తాడు. దైవము యొక్క అస్తిత్వమే గురువు.

*Master  K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మనము చేసే పనులలో మంచి అయినా, చెడు అయినా కొంత భాగము పూర్వీకులకు చెందుతుంది. మనము చేసే మంచి, వాళ్లకు ఊర్ధ్వగతికి చేరుస్తుంది. ఏ వంశములో నైనా, ఒక యోగి జన్మించి, సిద్ధుడై ఆత్మదర్శనము చేసుకుంటే అంతకు ముందు తరాలన్నిటికి ముక్తిరాదు కాని, ఉత్తమ లోకాలు వస్తాయి. 

ముని మనువడు వచ్చేదాకా పై మూడు తరాలు వసు, రుద్ర, ఆదిత్య లోకాలలో ఉంటారు. మనము మంచిపనులు చేస్తూ ఉంటే ఆ పితరులు ఆదిత్య లోకము దాటి ఇంకా ముందుకు వెడతారు. అలాగే గురువులలో గూడా నాల్గవతరము వస్తే గాని, వాళ్లకు ముక్తి ఉండదు. జ్వాలా కూలుడు వచ్చినతరువాత మైత్రేయుడికి, మరువు, దేవాపికి పరిపూర్ణత లభించింది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

పదహారు అచ్చులు షోడశ కళలకు సంబంధించినవి. ఇరవై ఐదు హల్లులలో ఇరవై నాలుగు గాయత్రీ తత్వమునకు సంబంధించినవి. మిగిలిన ఒక్కటి కాలమునకు చెందినది. య, ర, ల, వ, శ, ష, స, హ,  లు బీజాక్షరాలు. వీటిని అష్ట శాంతములు అంటారు. యం - వాయు బీజము, రం - అగ్ని బీజము, లం - అమృత బీజము, వం - వరుణ బీజము, శం - (శని) పృథ్వీ బీజము. శ, ష, స, హ అక్షరాలు మూలాధారానికి సంబంధించినవి. ళ, క్ష, ఱ, లతో మొత్తము 11 అక్షరాలు. 

మొత్తము 52అక్షరాలు. ఏ భాషలోనూ లేవు. స్పష్టమైన ఉచ్చారణ ద్వారా ఆ అక్షరాలలో గల ప్రజ్ఞను ఆవిర్భవింపచేసే శక్తి మానవునికి కలదు. ళ, క్ష, ఱ, ప్రక్కన బెడితే 49 అక్షరాలు 7 టైమ్స్ 7 అని మేడం బ్లావెట్ స్కీ వ్రాసారు. అక్షరాలను సరిగా ఉచ్చరించని వారు పనికి రారు అని కూడా వ్రాసినది.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏.

మాస్టర్ *C.V.V.* మాట

యోగమును ఉపదేశించుటకు ముందు  అభ్యర్థిని సంపూర్ణముగా పరిశీలించి, సూక్ష్మలోకముల లోనికి పంపించి, అభ్యర్థి యొక్క సంచిత కర్మనంతను గమనించి, జీవలక్షణమును అనుసరించి యోగము నిచ్చుట జరిగినది. ప్రార్ధన మరువకుము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

భారతీయ పురాణ గ్రంథములలో  ప్రప్రథమముగా బోధించు విషయము మరణమును గూర్చియే. మరణము గూర్చి తెలుసుకొనుట అశుభము కాదు. భగవద్గీత యందు భగవానుడు పలికిన మొదటి పలుకులు మరణము లేదనియే. భాగవతమున గూడ  ప్రథమ పాఠము మరణము లేదనియే.

మరణము దేహమునకే గాని, దేహికి కాదని, పురాణములు చాటి చెప్పుచున్నవి మరణమును దాటి, అమృతత్త్వమును చేరవలెనని  యోగ విద్య బోధించు చున్నది. మృత్యుంజయ మహా మంత్రము  చావు నుండి తప్పించుకొనుటకు కాదు. చావు లేదని తెలియుటకు. దేహబంధము, కోరికల బంధము, భావబంధము దాటుట మోక్షము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

సంఘమున ఇతరుల గుర్తింపుకై పాటుపడుట ఒక వ్యామోహము. ఈ వ్యామోహము మనిషిని పతనము గావించును. సంఘము గుర్తింపు నీటిపై రాత వంటిది. అది క్షణికము. అంతకన్న అంతఃకరణ శరీరమున గుట్టుగ జీవించుచు, జీవులకు హితము చేయుచు జీవించుట ఉత్తమము. లోపల జీవించు సాధకుడు లోతులలో నుండి దీర్ఘకాలిక ప్రణాళికలను నిర్వర్తించ గలడు. 

వెలుపల జీవించు సాధకుడు ఎంగిలాకువలె గాలివాటపు జీవనము జీవించుచు, చాలా పైకెగిరి, క్రింద పడును. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

వైరాగ్యమనగా నిరాసక్తత, నిర్లిప్తత కాదు. రాగ దోషము లేని దృష్టి. అట్టివారికే  ఇంద్రజాలమగు ఈ పాంచ భౌతిక దృష్టి అవగాహన కాగలదు. వారు ఇంద్రియముల ఇంద్రజాలములకు లోను కారు. 

మాయా స్వరూపమును వారు చక్కగా అవగాహన చేసుకొని, తమ వంతు కర్తవ్యమును నిర్వర్తింతురు. దాటితిమి అను అహంకారమును కూడా దాటగలరు. వారికి ఈ సృష్టి, దైవము యొక్క దివ్యలీలగా గోచరించును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 

జ్ఞాని రహస్య జీవనుడు. తాను జ్ఞాని అని తెలియనీయడు. అందరి యందు ఒకడుగ ఉండును. తనను తాను ప్రదర్శించుకొనడు. అతడు స్వయంప్రకాశకుడు. అతని ఉనికియే పరిసర జీవులకు ఆనందము కలిగించు చుండును. వేదనలను హరించు చుండును. 

అతని యందు తెలియని ఆకర్షణ ఒకటి పరిసర జీవులను ఆకర్షించు చుండును. అతని దర్శనము, స్పర్శనము, అతనితో సంభాషణము జీవులు కోరుట సహజము. అతడు అందరి యందును తానై ఉండును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

 ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు

గానబడిన బుద్ధికంపమయ్యె 

నా మహాత్ము విష్ణు నఖిలలోకాధారు

నార్తులెల్ల బాయ నాశ్రయింతు.

ఏ మహాత్ముని వలన సమస్త విశ్వమంతా బుద్ధికి గోచరమైనదో ఆ మహాత్ముని, విష్ణువును అఖిల లోకధారునిగ భావన చేసి నా బంధము లన్నియు నివారణము చెందుటకై అతని నాశ్రయించెదను.

అనునిత్యము సత్సాధకులు దైవమునకు శరణాగతి చెందుటకు పారాయణము చేయవలసిన ఉత్తమోత్తమ ప్రార్థనా పద్యమిది. ఈ భావము హృదయస్థము కావలెను. ఇది శరణాగతి ప్రార్థనము.

*భాగవతము Master K.P.K🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీ గురుభ్యోనమః🙏*

మాస్టర్ *C.V.V.* మాట

మీ యందు నాకు గల ప్రేమచే నియమములను సరళముగా తెలుపుచున్నాను. నేను సరళముగా తెలుపుటచే మీరు తేలికగ తీసుకొనరాదు. సరళత్వము, మృదుత్వం నా లక్షణము. దీక్షతో ఆచరించుట మీ లక్షణమై ఉండవలెను. మీరట్లున్నచో నేనే మీ యందలి మార్పును మృదువుగా నిర్వర్తింతును.

*Master K P K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోమః 🙏*

ప్రకృతి నుండి పుట్టిన జీవునకు మాయా మోహములు తప్పవు. గుణముల లోనికి, ఇంద్రియముల లోనికి దిగబడిన జీవుడు సత్యమును దర్శింపలేడు. తన చుట్టును ఏర్పడిన ఆవరణల యందు అనగా చూచు విషయమున, విను విషయమున వికృతి చెందును. తాను చూచునది దైవము యొక్క రూపమే అని తెలిసినను గుర్తురాదు. 

తాను వినునది దైవము నుండి వచ్చు శబ్దమే అని గ్రహింపుకు రాదు. తద్భిన్నముగ గుణ సముదాయములనే  చూచు చుండును. రజోగుణ, తమోగుణ దోషము కలవారు ఉన్న సత్యమును దర్శింపక వాదింతురు. సత్వగుణం గలవారు మాత్రమే సత్యమును దర్శింతురు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

అజ్ఞానులకు జ్ఞానబోధ చేయుటకన్నా, జ్ఞానులు తాము ఆచరించుచు, వారలచే నేర్పుతో ఆచరింపచేయ వలెను. సామాన్యముగా చేసిన బోధ వినువారలను బట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరకముగ అనిపించును, వినిపించును. పాత్ర పవిత్రతను బట్టి, పదార్ధము రుచి మారునట్లు శ్రోత చిత్తశుద్ధిని బట్టి, విషయము లవగాహన యగును. 

ఆచరించిన దానిని చూచి, అట్లే ఆచరించుట సులభము. సాధన లేని బోధన బాధను మిగుల్చును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

జీవుడు సూర్యుని ప్రతీకయే. సూర్యమండలమున ఉన్న సమస్త ప్రజ్ఞలును మానవుని యందు ఉన్నవి. తనకు తాను సూర్యుడే. ఇది తెలిసిన వారు తెలిసినవారు. 

 సూర్యుడు సవితృ మండలము నుండి  ప్రాణమును, ప్రజ్ఞను తానందుకొని, తన నుండి బంగారు కాంతి ప్రసరింప చేయుచు సూర్యమండలము అను దేవాలయమును నిర్మాణము చేసినాడు. తన కిరణముల ద్వారా గోళములకు, గ్రహగోళములకు, జీవులకు ప్రాణము, తెలివి అనునిత్యము  అందించు చున్నాడు.

 అతనిది హిరణ్మయ మగు కాంతి. అతడు అందించు ప్రాణము బంగారు నీటి ప్రవాహము. అతడు అందించు ప్రజ్ఞ బంగారు భావము. సూర్యారాధన అత్యంత విశిష్టమైనది. సూర్యోదయమునకు ఉన్ముఖుడవడము శుభప్రదము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః🙏*

మాస్టర్ *C.V.V.* మాట

నేను అందించు యోగము దశలవారీగా, తరతరములకు వికాసము చెందుచు సాగును. నాకన్నా నా తరువాతి తరము వారు దీనిని అనుభవ పూర్వకముగా వివరించి అందింతురు. ఆ పై తరము వారు మరింత వివరింతురు. అటుపై నాలుగవ తరము వారు దీనిని భౌగోళికముగా వికసింప జేయుదురు. అపుడు ఈ యోగ విధానము పరిపూర్ణముగా వివరింపబడును.

                            *ఇది నా మాట*

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ఈ ప్రపంచములో నిజమైన ప్రేమ అరుదుగా గోచరిస్తుంది.  నిజమైన ప్రేమకు తనవారు, పైవారు అని ఉండదు. ప్రేమకు హెచ్చు తగ్గులు ఉండవు. నిజమైన ప్రేమ వికాసాన్ని ఇస్తుంది. 

సమదృష్టి అనే పదమునకు మరియొక పేరే ప్రేమ. ప్రేమ ఉన్నచోట కల్మషము ఉండదు. ఆత్మను ఎరిగిన వాడే నిజమైన ప్రేమికుడు. ఇది మహాత్ముల జీవితము నందే కన్పట్టును.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

ప్రతి ఒక్కరును తమ ఆలోచనను, తమ మాటను అత్యంత విలువైన శక్తులుగా భావించవలెను. ఈ శక్తులను పవిత్రముగా వాడవలెను. అపవిత్రము గావించినచో తాను నష్టపోవుటయే గాక, బృందము యొక్క కష్టమునకు గూడ కారణమగుదురు. 

ఇది దురదృష్టకరము, అపాయకరము.   ఏ ఒక్కరును తాము చేయుచున్న ఆలోచనలు, పలుకుతున్న మాటలు  వాతావరణమును ఎన్ని రకములుగా కలుషితము చేయుచున్నదో గమనించక పోవుట నిజమైన గ్రుడ్డితనము.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

సద్విషయములు ఎన్ని సార్లు తెలిపినను మరల మరల వినుటకే ఇచ్చగింతురు గాని, మానవులు అనుసరించరు, ఆచరించరు. సత్పురుషులు సద్విషయమును వేయి విధములుగ బోధించు చున్నారు. వారు చేయు శంఖారావములను మానవజాతి పెడచెవిన పెట్టుచున్నది. 

అపాయము కలిగినపుడు మాత్రము ఆర్తనాదములు చేయుచు తమ మొరవినమని దివ్యలోకమునకు అర్జీలు పెట్టుదురు. ఇట్టి వారియెడల మహాత్ముల కారుణ్యము అపరిమితము. 

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

అజ్ఞానులు ఎదుటి వాళ్ళను గురించి మాట్లాడటంలో తమ గురించే ఎక్కువ మాట్లాడతారు. వెలుగులోకి ప్రవేశించే కొద్దీ తమ గురించి మాట్లాడటం తగ్గిపోవాలి. మనకు తెలిసిన కొద్దీ అణకువ, వినయము, మౌనము రావాలి. సతతము పరతత్వములో జీవించే వాళ్ళు తమ గురించి చెప్పుకోరు.

అన్నీ తెలిసి ఉండి కూడా అహంకారములో నుండి కొంత మంది బయటకు రాలేరు. వారు తెలిసిన మూర్ఖులు. వశిష్ఠ మహర్షి తన గురించి ఏమీ చెప్పుకోలేదు.

*Master K.P.K.*🙏

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: శ్రీ గురుభ్యోనమః 🙏

*Master C.V.V. మాట*

నా యోగమున విద్య అనగా మానవుడికి కావలసిన సర్వతోముఖమైన పరమార్ధాన్ని ఆచరణ రూపముగా సమన్వయించిన విద్య. భావ పవిత్రత ప్రాతిపదికగా ఈ యోగము సాగుచున్నది. ఎవరెంత సంస్కరించుకొనునో, వారు అంత దివ్య చైతన్యమున వసించుదురు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీ గురుభ్యోనమః🙏*

  అపాయము రాబోవుటకు ముందు సజ్జనులకు ప్రకృతి కొన్ని సూచనలనిచ్చును. ప్రతిభ గల సజ్జనులు కూడా ఈ సూచనలను గమనించరు. కారణము వారును ఇతరుల వలె లోక వ్యవహారముల యందు మునిగియుండుటయే. సహజ ప్రశాంతత, ఏకాంతము దిన చర్యలో భాగముగ ఉన్నప్పుడు ప్రకృతి అందించు సూచనలు అప్రమత్తులగు వారికి అందగలదు. స్వభావమున లోకశ్రేయస్సును గురించిన చింతన గూడ ఉండవలెను.

 అట్టి వారే నిజమగు చూపుగలవారు. ఇతరులు గ్రుడ్డివారే. తెలియకున్నను, తమకు ముందే తెలుసు అనువారు గ్రుడ్డివారిలో ప్రధమకోవకు చెందిన వారు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

[05/01, 08:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏

మంచి మాట కటువుగా ఉన్నా వినడము నేర్చుకోవాలి. మన శ్రేయస్సు కోరేవారు మంచి మాటే చెపుతారు. నిక్కచ్చిగా ఉత్తమ సలహా లివ్వడమే స్నేహ ధర్మము. ధర్మము నిర్దిష్టముగా ఉండాలి.

అధర్మము చేసేవాడి సాంగత్యము  నుండి నిశ్శబ్దంగా తప్పుకోవాలి. లేకపోతే నెమ్మదిగా మనము కూడా పతనమవుతాము. అధర్మపరుల వంచన చేరకూడదు. సత్య సాధనకు ఇది చాలా అవసరము. మాస్టర్ ఇ. కె. గారు ధర్మము అవలంబించని వారిని క్షణకాలములో విసర్జించారు. ధర్మ మార్గాన్ని వదలని జీవికి సృష్టిలో తిరుగుండదు.

*Master K.P.K.🙏*

నవ గోపికా సంఘము

No comments:

Cvv

 [04/01, 13:19] G1 Lalitamma Ssy Annapurneshwari Parivar: *శ్రీగురుభ్యోనమః*🙏 సృష్టి నిర్మాణానికి పెట్టుబడి సత్యము. దాని అల్లిక అంతా ధర్మముప...