https://youtu.be/28vzcraqm0E. గో🐂 ఆధారిత ప్రకృతి వ్యవసాయము
🌾 సేవ్ దేశీ సీడ్స్ & సేవ్ నేచర్ & సేవ్ సాయిల్ 🌾
👉రసాయన రహిత గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని 40 రోజులు తినండి.ఆ ఆహారము యొక్క ఉపయోగమును మీరు పొంది వాటి విలువను అందరికీ తెలియజేయండి.గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయమును ఆచరించండి. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించండి.
👉 మన ఊరు - మన ఆరోగ్యము - మన ఆర్థిక వ్యవస్థ,ప్రకృతి వ్యవసాయము, దేశివాళీ విత్తనము,వాననీటి సేకరణతోనే సాధ్యము చేసుకొందాం.దేశివాళీ విత్తనాల్లో అధిక పోషకాలు లభిస్తాయి మరియ రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
👉ఆరోగ్య సమస్యలు అధికమించి, రోగనిరోధక శక్తిని ఆహారము ద్వారా పొందడానికి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో దేశివాళీ బియ్యముతో తయారు అయిన భోజనమును 40 రోజుల పాటు తినడము. ఇటువంటి ఆహారమును తిన్నవారు ప్రకృతి యొక్క విలువను అర్థము చేసుకొని ప్రకృతి వ్యవసాయము చేయడము లేదా అటువంటి రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయడము.ఈ విధముగా ప్రకృతి వ్యవసాయము,దేశవాళీ విత్తనాలను వ్యాప్తి చేయడము మరియు భావి యువతరానికి ఆదర్శంగా నిలుద్దాం.
👉 2020 - 2030 కాలాన్ని గ్రామ ఆరోగ్యము, అర్ధికముగా పెంపొందించే దిశగాఎవరి గ్రామములో వారు కనీసము ఎకరం లేక రెండు ఎకరాలాలో ప్రకృతి వ్యవసాయము చేయడం లేదా చేయించాలి.అప్పుడే ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఏర్పడుతుంది.
👉 ప్రతీ గ్రామములో ప్రకృతి రైతులు మరియు ఔత్సాహికులు అందరూ కలిసి 40 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో భోజనాలు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని వ్యాప్తి పెంచడానికి ప్రయత్నములు చేద్దాము.ఎవరి గ్రామములో వారు స్వచందముగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొంటే అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించిన వాళ్లమౌతాము. తద్వారా ప్రకృతి వ్యవసాయం సాగు విధానము పెరుగుతుంది.
👉 మన ఊరు - మన ఆరోగ్యము - మన ఆర్థిక వ్యవస్థ అనే నినాదంతో సేవ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ విజయ రామ్ గారు,వారు బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మా బహుధాన్య మిత్ర బృందం తరపున హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు🙏👏💐💐.
👉 ఇట్లు మీ రైతు సోదరులం
బహుధాన్య మిత్ర బృందం.
🌾సేవ్ దేశీ సీడ్స్ & సేవ్ నేచర్ &
సేవ్ సాయిల్🌾
*ఏలూరు & కాకినాడ & బళ్ళారి*
📞90591 27252 ; 92475 00497.
ప్రకృతి వ్యవసాయంతో మన ఆరోగ్యాన్ని, భూమాతను,గోమాతను,వాతావరణమును కాపాడుకుందాం🙏👏.
No comments:
Post a Comment